జైశ్రీరామ్.
శ్లో. కర్మ లోకవిరుద్ధం తు - కుర్వాణం క్షణదాచర |
తీక్ష్ణం సర్వజనో హంతి - సర్పం దుష్టమివాగతమ్ ||
(రామాయణం)
తే.గీ. ఇంటఁ దూరిన సర్పమ్మునెటుల చంపు
దురొ యటులఁ జంపుదురు ప్రజ దురితుఁడైన
ప్రజల కహితముఁ జేసెడివానినిలను,
హితమె ప్రజలకుఁ జేయుమో హితుఁడ! సతము.
భావము. ప్రజలకు విరుద్ధమైన పనులు చేసే క్రూర స్వభావం ఉన్నవాడిని,
ఇంటిలో ప్రవేశించిన విషసర్పాన్ని కొట్టి చంపినట్లే, ప్రజలు కొట్టి చంపుతారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.