జైశ్రీరామ్.
శ్లో. నిమిషం నిమిషార్థం వా - జ్ఞానినో ధ్యాన చింతయా ౹
క్రతు కోటి సహస్రాణం - ధ్యానమేకం విశిష్యతే ౹౹
తే.గీ. నిమిషమే యగు లేకర్ధనిమిషమౌను
ధ్యానమన్నది చేసిన దాని ఫలము
కోటిక్రతుతుల్యమౌ గాన గొప్పదయిన
ధ్యాన సాధన చేయుము ధర్మరతుఁడ!
భావము. నిమిషం గానీ, అరనిమిషం గానీ ధ్యానం చేస్తే వెయ్యి కోట్ల
క్రతువులు చేసిన ఫలం వస్తుంది. కాబట్టి ధ్యానం ఎంతో విశిష్టమైనది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.