జైశ్రీరామ్.
శ్లో. పూజితం హ్యశనం నిత్యం, - బలమూర్జం చ యచ్ఛతి.
అపూజితం తు యద్భుక్తం, - ఉభయం నాశయేత్ ధృవమ్.
తే.గీ. శుచిగ, శుభ్రముగానుండి శోభలీను
పూజితాహారమే శక్తి తేజములిడు,
పాచి క్రుళ్ళినవి తినిన వేచు మనను,
క్షీణమౌ బల తజముల్ కీడు కలుగు.
భావము. పూజ్యమైన ఆహారము నిత్యమూ సేవించుట వలన మాత్రమే బలము
తేజస్సు మనకు లభిస్తాయి. అపూజితమైన ఆహారము అనగా అపవిత్రంగా
పాచిపోయిన క్రుళ్ళిపోయిన ఆహారము సేవించినచో బలము తేజస్సు
రెండూ నశించును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.