జైశ్రీరామ్.
మొన్న 9 వ తేదీ అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహించే అవధాన
శిక్షణా తరగతుల్లో పద్మశ్రీ గరికపాటి నరసింహారావు మహోదయులు
ప్రసంగంలో ఉటంకించిన మరో సమస్య.
“ వ్యాసగ్రంథము తెల్గు జేసిరి గదా పాండిత్యహీనుల్ కవుల్ “
దీనికి వారి పూరణ సమయాభావముచే అందించలేదు.
ఈ సమస్యకు
డా. నరాల రామా రెడ్డి సహృదయుల పూరణ
“ధీసంపన్నత తెల్గుజాతి వెలుగన్ దేదీప్యమానంబుగా
వాసింగాంచిన శిల్పవైభవము విభ్రాజిల్ల , సాహిత్యవి
న్యాసంబొప్పగ ధర్మసూత్రరచనానైపుణ్యమున్ చూపుచున్
వ్యాసగ్రంథము తెల్గుజేసిరిగదాపాండిత్యహీనుల్ కవుల్ “
( పాండితీ + అహీనుల్ > అహి+ఇనుల్ - పాండిత్యంలో ఆదిశేషులైన నన్నయ
తిక్కన ఎఱ్ఱన - కవులు వ్యాసభారతాన్ని తెనిగించారు అని అర్థం )అని
వారే వివరణ ఇచ్చారు.
ఈ సమస్యకు నా పూరణము.
ధీ సంస్కార మహత్వతేజ సుకవుల్ దివ్యంపు సద్గ్రంథముల్
వాసింగాంచిరి తెన్గుఁ జేసి, ఘనుఁడై భాసించువాఁడైన యా
“ వ్యాస గ్రంథము తెల్గు జేసిరి గదా, పాండిత్యహీనుల్ "కవుల్
ధీసంపత్తివిహీను"లంచనుటచే తేజంబు లోపించునా?
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.