గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2024, శుక్రవారం

వీనులు,వికటము,పకపకలు,వికలము,లొల్లాశ్రిత,లోనయె,వెకిలిగ,భిల్లుల,కార్ముకము,చెకచెక,దరిజేరు,చెల్లాచెదరు,నగ మెగయు,ఫేనము,గర్భ"విన సొంపు"-వృత్తము.

జైశ్రీరామ్.   

వీనులు,వికటము,పకపకలు,వికలము,లొల్లాశ్రిత,లోనయె,వెకిలిగ,భిల్లుల,కార్ముకము,చెకచెక,దరిజేరు,చెల్లాచెదరు,నగ మెగయు,ఫేనము,గర్భ"విన సొంపు"-వృత్తము.

వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

లుక లుకల వికటమై!లొల్లాశ్రిత జీవమాయెన్!లోనయె ధన తృష్ణం వెసన్!
వెకిలిగ పక పకలం!భిల్లు ల్దరి జేరి నిల్వం!ఫేనము నయె సర్వస్వమున్!
చెకచెక నర మెకముల్!చెల్లా చెద రేర్చ ధాత్రిం!శ్రీ నగ మెగసెం శోధిలన్!
వికల మొనరుచు నికం!విల్లుం విడు కార్ముకంబై!వీనుల విన సొంపౌ నొకో?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది. ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,18,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"వీనుల"-వృత్తము.

లుక లుకల వికటమై!
వెకిలిగ పక పకలన్!
చెక చెక నర మెకముల్!
వికట మొనరుచు నికన్!

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది .
ప్రాస నియమభు కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-వికటము"-వృత్తము.

లొల్లాశ్రిత జీవ మాయెన్!
భిల్లు ల్దరి జేరి నిల్వన్!
చెల్లా చెద రేర్చ ధాత్రిన్!
విల్లుం విడు కార్ముకంబై!

అభిజ్ఞా"ఛందము నందలి"-అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-8,అక్షరము లుండును.

3,గర్భగత"-పక పకలు"-వృత్తము.

లోనయె ధన తృష్ణం వెసన్!
ఫేనము నయె సర్వ స్వమున్!
శ్రీ నగ మెగసెం శోధిలన్!
వీనుల విన సొంపౌ నొకో?

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"వికలము"-వృత్తము.

లుక లుకల వికటమై!లొల్లా శ్రిత జీవ మాయెన్!
వెకిలిగ పక పకలం!భిల్లు ల్దరి జేరి నిల్వన్!
చెర చెర నర మెకముల్!చెల్లా  చెద రేర్చ ధాత్రిన్!
వికల మొనరుచు నికం!విల్లుం విడు కార్ముకంబై!

అణిమా ఖందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-లొల్లాశ్రిత"-వృత్తము.

లొల్లాశ్రిత జీవ మాయెం!లుక లుకల వికటమై!
భిల్లు ల్దరి జేరి నిల్వన్!వెకిలిగ పక పకలన్!
చెల్లా చెద రేర్చ ధాత్రిం!చెర చెర నర మెకముల్!
విల్లుం విడు కార్ముకంబై!వికల మొనరుచు నికన్!

అణిమా"ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-లోనయె"-వృత్తము.

లుక లుకల వికటమై!లోనయె ధన తృష్ణం వెసన్!
వెకిలిగ పక పకలం!ఫేనము నయె సర్వ స్వమున్!
చెర చెర నర మెకముల్!శ్రీ నగ మెగసెం శోధిలన్!
వికల మొనరుచు నికం!వీనుల విన సొంపౌ నొకో?

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-వెకిలిగ"-వృత్తము.

లోనయె ధన తృష్ణం వెసం!లుకలుకల వికటమై!
ఫేనము నయె సర్వస్వముం!వెకిలిగ పక పకలం!
శ్రీ నగ మెగసెం శోధిలం!చెర చెర నర మెకముల్!
వీనుల విన సొంపౌ నొకో?వికల మొనరుచు నికన్!

అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-భిల్లుల"-వృత్తము.

లొల్లాశ్రిత జీవ మాయెం!లోనయె ధన తృష్ణం వెసన్!
భిల్లులె దరి జేరి నిల్వం!ఫేనము నయె సర్వస్వమున్!
చెల్లా చెద రేర్చ ధాత్రిం!శ్రీ నగ మెగసెం శోధిలన్!
విల్లుం విడు కార్ము కంబునై!వీనుల విన సొంపౌ నొకో?

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "17"అక్షరము లుండును.
యతి"9,18,అక్షరము లకు చెల్లును.

9,గర్భగత"కార్ముకం"-వృత్తము.

లోనయె ధన తృష్ణం వెసం!లొల్లాశ్రిత జీవ మాయెన్!
ఫేనము నయె సర్వస్వముం!భిల్లులె దరి జేరి నిల్వన్!
శ్రీ నగ మెగసెం శోధిలం!చెల్లా చెద రేర్చ ధాత్రిన్!
వీనుల విన సొంపౌ నొకో?విల్లుం విడు కార్ముకంబునై!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకై,17,అక్షరము లుండును.
యతి,"10"వ యక్షయరమునకు చెల్లును.

10,గర్భగత"-చెక చెక"వృత్తము.

లొల్లాశ్రిత జీవ మాయెం!లుక లుకల వికటమై!లోనయె ధన తృష్ణం వెసన్!
భిల్లుల్ దరి జేరి నిల్వం!వెకిలిగ పక పకలం!ఫేనము నయె సర్వస్వ మున్!
చెల్లా చెద రేర్చ ధాత్రిం!చెక చెక నర మెకముల్!శ్రీ నగ మెగసెం శోధిలన్!
విల్లుం విడు కార్ముకంబునై!వికల మొనరుచు నికం!వీనుల విన సొంపౌ నొకో?

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,19,అక్షరములకు చెల్లును.

11.గర్భగత"-దరి జేరు"-వృత్తము.

లుక లుకల వికటమై!లోనయె ధన తృష్ణం వెసం!లొల్లాశ్రిత జీవ మాయెన్!
వెకిలిగ పక పకలం!ఫేనము నయె సర్వస్వముం!భిల్లుల్ దరి జేరి నిల్వన్!
చెక చెక నర మెకముల్!శ్రీ నగ మెగసెం శోధిలం!చెల్లా చెద రేర్చ ధాత్రిన్!
వికల మొనరుచు నికం!వీనుల విన సొంపౌ నొకో?విల్లుం విడు కార్ముకంబునై!

అనిరుద్ఛందమునందలిఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

12;గర్భగత"-చెల్లా చెదరు"-వృత్తము.

లోనయె ధన తృష్ణం వెసం!లుక లుకల వికటమై!లొల్లా శ్రిత జీవ మాయెన్!
ఫేనము నయె సర్వస్వముం!వెకిలిగ పక పకలం!భిల్లుల్ దరి జేరి నిల్వన్!
శ్రీ నగ మెగసెం శోధిలం!చెక చెక నర మెకముల్!చెల్లా చెద రేర్చ ధాత్రిన్!
వీనుల విన సొంపౌ నొకో?వికల మొనరుచు నికం!విల్లుం విడు కార్ముకంబునై!

అనిరుద్ఛందమునందలిఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-నగ మెగయు"-వృత్తము.

లొల్లాశ్రిత జీవమాయెం!లోనయె ధన తృష్ణం వెసం!లుక లుకల వికటమై!
భిల్లుల్ దరి జేరి నిల్వం!ఫేనము నయె సర్వస్వముం!వెకిలిగ పక పకలన్!
చెల్లా చెద రేర్చ ధాత్రిం!శ్రీ నగమెగసెం శోధిలం!చెక చెక నర మెకముల్!
విల్లుం విడు కార్ముకంబునై!వీనుల విన సొంపౌ నొకో?వికల మొనరుచు నికన్!

అనిరుద్ఛందము నందలిఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-ఫేనము"-వృత్తము.

లోనయె ధన తృష్ణం వెసం!లొల్లాశ్రిత జీవ మాయెం!లుక లుకల వికటమై!
ఫేనము నయె సర్వస్వముం!భిల్లుల్దరి జేరి నిల్వం!వెకిలిగ పక పకలన్!
శ్రీ నగ మెగసెం శోధిలం!చెల్లా చెద రేర్చ ధాత్రిం!చెక చెక నర మెకముల్!
వీనుల విన సొంపౌ నొకో?విల్లుం విడు కార్ముకంబునై!వికల మొనరుచు నికన్!

అనిర్ద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.