గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2024, సోమవారం

గర్వపడు,గర్భకవి,చంద్ర జ్యోత్స్న,వరీయ,వెల్గులిడు,జీవనాళి,కీర్తిమయ,వైదైష్య,,కీర్తిజల్లు,అల్లిక,సాధు తత్వ,సాదరంబు,ఆదరంబు,ఆదిమూర్తి గర్భ"-నిండు వరామ"-వృత్తము. "-నిండు వరామ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్

 గర్వపడు,గర్భకవి,చంద్ర జ్యోత్స్న,వరీయ,వెల్గులిడు,జీవనాళి,కీర్తిమయ,వైదైష్య,,కీర్తిజల్లు,అల్లిక,సాధు తత్వ,సాదరంబు,ఆదరంబు,ఆదిమూర్తి గర్భ"-నిండు వరామ"-వృత్తము.

                 "-నిండు వరామ"-వృత్తము.

                                  రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.   జుత్తాడ.
                                                 

ఆంధ్రజాతి గర్వ పడన్!ఆదరంబు పెంపు నింపెడిన్!అల్లిక మీసొత్తు మిత్రమా!
సాంధ్ర భావ గర్భ కవీ!సా దరంబు నందినా రిలన్!జల్లిరి మీ కీర్తి విత్తులన్!
చంద్ర జ్యోత్స్న వెల్గులిడన్!సాధు తత్వ జీవ నాళినిన్!చల్లటి వైదుష్య
                                                                                     దీప్తులన్!
ఆంధ్రమే వరీయ మనన్!ఆది మూర్తిశంకరుం డనన్!అల్ల వరామంబు
                                                                                నింపుచున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియు కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు9,18,అక్షరములకు చెల్లును.

1.గర్భగత"గర్వపడు"-వృత్తము.

ఆంధ్ర జాతి గర్వపడన్!
సాంధ్రభావ గర్భ కవీ!
చంద్ర జ్యోత్స్న వెల్గు లిడన్!
ఆంధ్రమే!వరీయ మనన్!

అభిజ్ఝా ఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8,అక్షరము లుండును.

2,గర్భగత"గర్భకవి"-వృత్తము.

ఆదరంబు పెంపు నింపెడిన్!
సాదరంబు నంది నా రిలన్!
సాధు తత్వ జీవనాళి నిన్!
ఆది మూర్తి శంకరుం డనన్!

అభిజ్ఞా ఛంరము నందలి"-బృహతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరములుండును.

3.గర్భగత"చంద్ర జ్యోత్స్న"-వృత్తము.

అల్లిక మీ సొత్తు మిత్రమా!
చల్లిరి మీ కీర్తి విత్తులన్!
చల్లటి వైదుష్య దీప్తులన్!
అల్ల వరామంబు నింపుచున్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"వరీయ"-వృత్తము.

ఆంధ్రజాతి గర్వ పడన్!ఆదరంబు పెంపు నింపెడిన్!
సాంధ్ర భావ గర్భ కవీ!సాదరంబు నంది నారిలన్!
చంద్ర జ్యోత్స్న వెల్గు లిడన్!సాధు తత్వ జీవనాళినిన్!
ఆంధ్రమే వరీయ మనన్!ఆదిమూర్తి శంకరుండనన్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి"9"వ యక్షరము నకు చెల్లును.

5,గర్భగత"-వెల్గు లిడు"-వృత్తము.

ఆదరంబు పెంపు నింపెడిన్!ఆంధ్ర జాతి గర్వ పడన్!
సాదరంబు నంది నారిలన్!సాంధ్ర భావ గర్భ కవీ!
సాధు తత్వ జీవనాళినిన్!చంద్ర జ్యోత్స్న వెల్గు లిడన్!
ఆది మూర్తి శంకరుడనన్!ఆంధ్రమే!వరీయ మనన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతి10,వయక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-జీవనాళి"-వృత్తము.

ఆంధ్ర జాతి గర్వ పడన్!అల్లిక మీ సొత్తు మిత్రమా!
సాంధ్ర భావ గర్భ కవీ!జల్లిరి మీ కీర్తి విత్తులన్!
చంద్ర జ్యోత్స్న వెల్గు లిడన్!చల్లటి వైదుష్య దీప్తులన్!
ఆంధ్రమే!వరీయ మనన్!అల్ల వరామంబు నింపుచున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-కీర్తిమయ"-వృత్తము.

అల్లిక మీ సొత్తు మిత్రమా!ఆంధ్ర జాతి గర్వ పడన్!
జల్లిరి మీ కీర్తి విత్తులన్!సాంధ్ర భావ గర్భ కవీ!
చల్లటి వైదుష్య దీప్తులన్!చంద్ర జ్యోత్స్న వెల్గు లిడన్!
అల్ల వరామంబు నింపుచున్!ఆంధ్రమే!వరీయ మనన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు,17"అక్షరములుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-వైదుష్య"-వృత్తము.

ఆదరంబు పెంపు నింపెడిన్!అల్లిక మీ సొత్తు మిత్రమా!
సాదరంబు నంది నా రిలన్!జల్లిరి మీ కీర్తి విత్తులన్!
సాధు తత్వ జీవనాళినిన్!చల్లటి వైదుష్య దీప్తులన్!
ఆదిమూర్తి శంకరుం డనన్!అల్ల వరామంబు నింపుచున్!

అణిమా ఛందమునందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-కీర్తి జల్లు"-వృత్తము.

అల్లిక మీ సొత్తు మిత్రమా!ఆదరంబు పెంపు నింపెడిన్!
జల్లిరి మీ కీర్తి విత్తులన్!సాదరంబు నంది నారిలన్!
చల్లటి వైదుష్య దీప్తులన్!సాధు తత్వ జీవ నాళి నిన్!
అల్ల వరామంబు నింపుచున్!ఆదిమూర్తి శంకరుండనన్!

అణిమా ఛందము నందలి"-ధృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-అల్లిక"-వృత్తము.

ఆదరంబు పెంపు నింపెడిన్!ఆంధ్రజాతి గర్వపడన్!అల్లిక మీసొత్తు మిత్రమా!
సాదరంబు నందినా రిలన్!సాంధ్ర భావ గర్భ కవీ!జల్లిరి మీ కీర్తి విత్తులన్!
సాధు తత్వ జీవనాళి నిన్!చంద్ర జ్యోత్స్న వెల్గు లిడన్!చల్లటి వైదుష్య
                                                                                     దీప్తులన్!
ఆదిమూర్తి శంకరుండనన్!ఆంధ్రమే వరీయమనన్!అల్ల వరామంబు
                                                                               నింపుచున్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-సాధుతత్వ"వృత్తము.

ఆంధ్రజాతి గర్వ పడన్!అల్లిక మీసొత్తు మిత్రమా!ఆదరంబు పెంపు నింపెడిన్!
సాంధ్ర భావ గర్భకవీ!జల్లిరి మీకీర్తి విత్తులన్!సాదరంబు నందినా రిలన్!
చంద్ర జ్యోత్స్న వెల్గు లిడన్!చల్లటి వైదుష్య దీప్తులన్!సాధు తత్వ జీవనాళి
                                                                                            నిన్!
ఆంధ్రమే!వరియ మనన్!అల్ల వరామంబు నింపుచున్!ఆది మూర్తి శంకరుం
                                                                                       డనన్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము లుండును.
యతులు.9,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-సాదరంబు"-వృత్తము.

అల్లిక మీ సొత్తు మిత్రమా!ఆంధ్రజాతి గర్వపడన్!ఆదరంబు పెంపు నింపెడిన్!
జల్లిరి మీ కీర్తి విత్తులన్!సాంధ్ర భావ గర్భ కవీ!సాదరంబు నందినా రిలన్!
చల్లటి వైదుష్య దీప్తులన్!చంద్ర జ్యోత్స్న వెల్గు లిడన్!సాధు తత్వ జీవ
                                                                                       నాళినిన్!
అల్ల వరామంబు నింపుచున్!ఆంధ్రమే!వరీయ మనన్!ఆది మూర్తి శంకరుం
                                                                                         డనన్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-ఆదరంబు"-వృత్తము.

ఆదరంబు పెంపు నింపెడిన్!అల్లిక మీ సొత్తు మిత్రమా!ఆంధ్రజాతి గర్వపడన్!
సాదరంబు నందిని రిలన్!జల్లిరి మీ కీర్తి విత్తులన్!సాంధ్ర భావ గర్భ కవీ!
సాధు తత్వ జీవనాళినిన్!చల్లటి వైదుష్య దీప్తులన్!చంద్ర జ్యోత్స్న  వెల్గు
                                                                        :                   లిడన్!
ఆదిమూర్తి శంకరుం డనన్!అల్ల వరామంబు నింపుచున్!ఆంధ్రమే వరీయ
                                                                                         మనన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-ఆది మూర్తి"-వృత్తము.

అల్లిక మీసొత్తు మిత్రమా!ఆదరంబుపెంపునింపెడున్!ఆంధ్రజాతి గర్వపడన్
జల్లిరి మీ కీర్తి విత్తులన్!సాదరంబు నందినా రిలన్!సాంధ్ర భావ గర్భ కవీ!
చల్లిరి వైదుష్య దీప్తులన్!సాధు తత్వ జీవనాళినిన్!చంద్ర జ్యోత్స్న వెల్గు
                                                                                          లిడన్!
అల్ల వరామంబు నింపు చున్!ఆదిమూర్తి శంకరుండనన్!ఆంధ్రమే! వరీయ
                                                                                       మవన్!

అనిరుద్ఛందమందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు10,19,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.