జైశ్రీరామ్.
శ్లో. అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యో మతి మాన్నర:
సర్వత: సారమాదధ్యాత్ పుష్పేభ్యైవ షట్పద:
తే.గీ. శాస్త్రమదిచిన్నదయినను చాలపెద్ద
దయిననున్ గాని గ్రహియించునరసి జ్ఞాని,
చిన్నదని పెద్దదని పూలనెన్నకుండ
తేనె గ్రహించు తుమ్మెద తీరునరయ.
భావము.
బుద్ధిమంతుడైన వాడు చిన్న శాస్త్రములు, గొప్ప శాస్త్రముల నుండి తుమ్మెద
పూవుల నుండి మకరందమును సేకరించినట్టు సారమును స్వీకరిస్తాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.