జైశ్రీరామ్.
అశాశ్వత,సత్యం,జీవనా,కీర్తిగను,తలపోయు,తరియించు,ఖగవాహన,హరి భక్తి,జగము,చరితార్ధ,కీర్తిలు,జగతిని,చరజగ,నరజన్మ,గర్భ"-పటుతర"- వృత్తము,
జన్మ మశాశ్వతంబు గదే?చరితార్ధుండగు వాడె !జగతిం వరదుండౌ
కను మిది జీవ సత్యమయా!కరము న్కీర్తి గడించు!ఖగ వాహను
తన్మది నెంచు సామ్యము నున్!తరియింపం దలపోయు!తగ నిల్వుము
చిన్మయు మెచ్చు జీవితమున్!స్థిరమేదీ?జగమందు!జి
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి ఛందములోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు
"26"అక్షరములుండును.యతులు10,19,
1,గర్భగత"-అశాశ్వత"-వృత్తము.
జన్మ మశాశ్వతంబు గదే?
కను మిది జీవ సత్య మయా!
తన్మది నెంచు సామ్యమునున్!
చిన్మయు మెచ్చు జీవితమున్!
అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు9"-అక్షరము లుండును.
2,గర్భగత"-సత్యం"-వృత్తము.
చరితార్ధుండగు వాడె!
కరము న్కీర్తి గడించు!
తరియింపం దలపోయు!
స్థిర మేదీ?జగ మందు!
అభిజ్ఞా ఛందమునందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
3,గర్భగత"-జీవనా"-వృత్తము.
జగతిం వరదుండౌ గదే!
ఖగ వాహను నాశీశ్శులన్!
తగ నిల్వుమి శోభాయతన్!
జిగి గొల్వుమి భక్తిం హరిన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"-కీర్తి గను"-వృత్తము.
జన్మ మశాశ్వతంబు గదే!చరితార్ధుండగు వాడె!
కన్మిది జీవ సత్య మయా!కరమున్కీర్తి గడించు!
తన్మది నెంచు సామ్యమునున్!తరియింపం దలపోయు!
చిన్మయు మెచ్చు జీవితమున్!స్థిరమేదీ?జగమందు!
అణిమా ఛందమునందలి అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-తలపోయు"-వృత్తము.
చరితార్ధుండగు వాడె!జన్మ మశా శ్వతంబు గదే!
కరమున్కీర్తి గడించు!కన్మిది జీవ సత్యమయా!
తరియింపం దలపోయు!తన్మది నెంచు సామ్యమునున్!
స్థిరమేదీ?జగ మందు!చిన్మయు మెచ్చు జీవితమున్!
అణిమి ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లొనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9"వ యక్షరము నకు చెల్లును.
6,గర్భగత"-తరియించు"-వృత్తము.
జన్మ మశాశ్వతంబు గదే!జగతిం వరదుండౌ గదే!
కన్మిది జీవసత్య మయా!ఖగ వాహను నాశీశ్శులన్!
తన్మది నెంచు సామ్యమునున్!తగ నిల్వుమి శోభాయతన్!
చిన్మయు మెచ్చు జీవితమున్!జిగి గొల్వుమి భక్తిం హరిన్!
అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-ఖగవాహన"-వృత్తము.
జగతిం వరదుండౌ గదే!జన్మ మశాశ్వతంబు గదే!
ఖగ వాహను నాశీశ్శులన్!కన్మిది జీవ సత్యమయా!
తగ నిల్వుమి శోభాయతన్!తన్మది నెంచు సామ్యమునున్!
జిగి గొల్వుమి భక్తిం హరిన్!చిన్మయు మెచ్చు జీవితమున్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-హరి భక్తి"-వృత్తము.
చరితార్ధుండగు వాడె!జగతిం వరదుండౌ గదే!
కరముం కీర్తి గడించు!ఖగవాహను నాశీశ్శులన్!
తరియింపం దలపోయు!తగ నిల్వుమి శోభాయతన్!
స్థిరమేదీ?జగమందు!జిగి గొల్వుమి భక్తిం హరిన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-జగము"-వృత్తము.
జగతిం వరదుండౌ గదే! చరితార్ధుండగు వాడె!
ఖగవాహను నాశీశ్శులన్!కరము కీర్తిం గడించు!
తగ నిల్వుమి శోభాయతన్!తరి యింపం దలపోయు!
జిగి గొల్వుమి భక్తిం హరిన్!స్థిరమేదీ?జగమందు!
అణిమి ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"చరితార్ధ"- వృత్తము.
చరితార్ధుండగు వాడె!జన్మ మశాశ్వతంబు గదే!జగతిన్వరదుండౌ
;
కరమున్కీర్తిం గడించు!కన్మిది జీవ సత్య మయా!ఖగ వాహను
తరియింపం దలపోయు!తన్మది నెంచు సామ్యము నున్!తగ నిల్వుమి
స్థిర మేదీ?జగమందు!చిన్మయు మెచ్చు జీవితమున్!జిగి గొల్వుమి
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.
11,గర్భగత"-కీర్తిలు"-వృత్తము.
జన్మ మశాశ్వతంబు గదే!జగతిం వరదుండౌ గదే!చరి తార్ధుండగు
కన్మిది జీవ సత్య మయా!ఖగ వాహను నాశీశ్శులన్!కరమున్కీర్తి
తన్మది నెంచు సామ్యమునున్!తగ నిల్వుమి శోభాయతం!తరియింపం
;
చిన్మయు మెచ్చు జీవితమున్!జిగి గొల్వుమి భక్తిం హరిం!స్థిర మేదీ?
: ;:
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదము నకు26,అక్షరము లుండును.
యతలు"-10,19,అక్షరములకు చెల్లును.
12,గర్భగత"-జగతిని"-వృత్తము.
జగతిం వరదుండౌ గదే!జన్మ మశాశ్వతంబు గదే!చరితార్ధుండగు
: :
ఖగ వాహను నాశీశ్శులం!కన్మిది జీవ సత్యమయా!కరమున్కీర్తి
తగ నిల్వుమి శోభాయతన్!తన్మది నెంచుసౌమ్యమునున్! తరియింపం
జిగి గొల్వుమి భక్తిం హరిన్!చిన్మయు మెచ్చు జీవితమున్!స్థిరమేదీ?
:
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.
13 ,గర్భగత"-చరజగ"వృత్తము.
చరితార్ధుండగు వాడె!జగతిం వరదుండౌ గదే!జన్మ మశాశ్వతంబు
కరమున్కీర్తి గడించు!ఖగ వాహను నాశీశ్శులన్!కన్మిది జీవ సత్య
తరియింపం దలపోయు!తగ నిల్వుమి శుభాయతన్!తన్మది నెంచు
::
స్థిరమేదీ?జగమందు!జిగి గొల్వుమి భక్తిం హరిన్!చిన్మయు మెచ్చు
అనిరుద్ఛందము నందలి-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.
14,గర్భగత"-నరజన్మ"-వృత్తము.
జగతిన్వరదుండౌ గదే!చరితార్ధుండగు వాడె!జన్మ మశాశ్వతంబు
ఖగ వాహను నాశీశ్శులన్!కరమున్కీర్తి గడించు!కన్మది జీవ సత్య
తగ నిల్వుమి శభాయతన్!తరియింపం దలపోయు!తన్మది నెంచు
గొల్వుమి భక్తిం హరిన్!స్థిర మేదీ?జగమందు!చిన్మయు మెచ్చు
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు ,10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.