గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2024, శుక్రవారం

సమన్యాయం,సమధర్మం,కమనీయం,తమితీర,ధనతృష్ణ,పామునైజం,పరహింస,భము లొనరు,ప్రీతిల,స్వార్ధచింత,తగు శిక్ష,సా దరణ,కాదనక,వాదుల,

జైశ్రీరామ్ 

సమన్యాయం,సమధర్మం,కమనీయం,తమితీర,ధనతృష్ణ,పామునైజం,పరహింస,భము లొనరు,ప్రీతిల,స్వార్ధచింత,తగు శిక్ష,సా దరణ,కాదనక,వాదుల,

సమ న్యాయం సమధర్మం!సమ సమాజ స్థాపనమ్ము!సా దరణ నెంతురే

                                                                                          రసన్?
కమనీయం సిరి నంటెం!గమక మాయె స్వార్ధ చింత!కాదనగ శక్య మేరికిన్?
తమి తీరం ధన తృష్ణం!తమము పెచ్చె శిక్ష లేక!తా ధరను నాశ మేర్తురే!
భ్రమియించే విష నాగుల్!భముల సజ్జనాళిముంచి!వాదులం పారిలం
                                                                                           సిరుల్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"9,18,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-సమన్యాయం"-వృత్తము.

సమ న్యాయం సమ ధర్మం!
కమనీయం సిరి నంటెం!
తమి తీరం ధన తృష్ణం!
భ్రమియించే విష నాగుల్!

అభిజ్ఞా ఛందము నందలి,అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

2,గర్భగత"-సమధర్మం"-వృత్తము.

సమ సమాజ స్థాపనమ్ము!
గమక మాయె స్వార్ధ చింత!
తమము పెచ్చె శిక్ష లేక!
భముల సజ్జనాళి ముంచి!

అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-కమనీయం"-వృత్తము.

సా దరణ నెంతురే రసం?
కాదనగ శక్య మేరికిన్?
తా ధరను నాశ మేర్తురే!
వాదులను పారిలం సిరుల్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4.గర్భగత"-తమితీర"-వృత్తము.

సమ న్యాయం సమ ధర్మం!సమ సమాజ స్థాపనమ్ము!
కమనీయం సిరి నంటెం!గమక మాయె స్వార్ధ చింత!
తమి తీరం ధన తృష్ణం!తమము పెచ్చె శిక్ష లేక!
భ్రమియించే విష నాగుల్!భముల సజ్జనాళి ముంచి!

అణిమా ఛందము నందలి అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు17,అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-ధనతృష్ణ"-వృత్తము.

సమ సమాజ స్థాపనమ్ము!సమ న్యాయం సమ ధర్మం!
గమక మాయె స్వార్ధ చింత!కమనీయం సిరి నంటెం!
తమము పెచ్చె శిక్ష లేక!తమి తీరం ధన తృష్ణం!
భముల సజ్జనాళి ముంచి!భ్రమి యించే విష నాగుల్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-పాము నైజం"-వృత్తము.

సమ న్యాయం సమ ధర్మం!సా దరణ నెంతురే!రసం?
కమనీయం సిరి నంటెం!కాదనగ శక్య మేరికిన్!
తమి తీరం ధన తృష్ణం!తా ధరను నాశ మేర్తురే?
భ్రమియించే విష నాగుల్!వాదులం పారిలం సిరుల్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"-9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"పరహింస"-వృత్తము.

సా దరణ నెంతురే!రసం?సమ న్యాయం సమ ధర్మం!
కాదనగ శక్య మేరికిం?కమనీయం సిరి నంటెన్!
తా ధరను నాశ మేర్తురే?తమి తీరం ధన తృష్ణన్!
వాదులం పారిలం సిరుల్!భ్రమియించే విష నాగుల్!!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును
యతి,10,వ యక్షరము నకు చెల్లును.

8,గర్భగత"భము లొనరు"-వృత్తము.

సమ సమాజ స్థాపనమ్ము!సా దరణ నెంతురే!రసం?
గమక మాయె స్వార్థ చింత!కాదనగ శక్య మేరికిన్!
తమము పెచ్చె శిక్ష లేక!తా ధరను నాశ మేర్తురే!
భముల సజ్జనాళి ముంచి!వాదులం పారిలం సిరుల్!

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును

9,గర్భగత"-ప్రీతిలు"-వృత్తము.

సా దరణ నెంతురే!రసం?సమ సమాజ స్థాపనమ్ము!
కాదనగ శక్య మేరికిం?గమక మాయె స్వార్ధ చింత!
తా ధరను నాశ మేర్తురే!తమము పెచ్చె శిక్ష లేక!
వాదులం పారిలం సిరుల్!భముల సజ్జనాళి ముంచి!

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరభు లుండును.
యతి.10,వ యక్షరము నకు చెల్లును.

10,గర్భగత"-స్వార్ధ చింత"-వృత్తము.

సమసమాజ  స్థాపనమ్ము!సమ న్యాయం సమ ధర్మం!సాదరణ నెంతురే?
                                                                                           రసన్!
గమక మాయె స్వార్ధ  చింత!కమనీయం సిరి నంటెం!కాదనగ శక్య మేరికిన్!
తమము పెచ్చె శిక్ష లేక!తమి తీరం ధన తృష్ణం!తా  ధరను నాశ మేర్తురే!
భముల సజ్జనాళి ముంచి!భ్రమియించే  విష నాగుల్!వాదులం పారిలం
                                                                                         సిరుల్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును
యతులు,10,18 అక్ రములకు చెల్లును.

11.గర్భగత"-తగు శిక్ష"-వృత్తము.

సమ న్యాయం సమ ధర్మం!సాదరణ నెంతురే?రసం!సమ సమాజ
                                                                           స్థాపనమ్ము!
కమనీయం సిరి నంటెం!కాదనగ శక్య మేరికిం?గమక మాయె స్వార్ధ చింత!
తమి తీరం ధన తృష్ణం!తా  ధరను నాశ మేర్తురే!తమము పెచ్చె శిక్షలేక!
భ్రమియించే విష నాగుల్!వాదులం పారిలం సిరుల్!భముల సజ్జనాళి
                                                                               ముంచి!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరరముఉ లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-సా దరణ"-వృత్తము.

సా దరణ నెంతురే!రసన్!సమ న్యాయం సమ ధర్మం!సమ సమాజ   
                                                                             స్థాపనమ్ము!
కాదనగ శక్య మేరికిన్?కమనీయం సిరి నంటెం!గమక మాయె!స్వార్ధ చింత
తా ధరను నాశ మేర్తురే!తమి  తీరం ధనతృష్ణం!తమము పెచ్చె శిక్ష లేక!
వాదులం పారిలం సిరుల్!భ్రమియించే విష నాగుల్!భముల సజ్జ నాళి
                                                                                  ముంచి!

అనిరుద్ఛేదము నంరలి ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్ రము లుండును.
యతులు"-10 18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-కాదనక"-వృత్తము.

సమ సమాజ స్థాపనమ్ము!సాదరణ నెంతురే!రసం?సమ న్యాయం
                                                                          సమ ధర్మమ్!
గమక మాయె స్వార్ధ చింత!కాదనగ శక్య మేరికిన్?కమనీయం సిరి నంటెం!
తమము పెచ్చె శిక్ష లేక!తా ధరను నాశ మేర్తురే!తమి తీరం ధన తృష్ణన్!
భముల సజ్జనాళి ముంచి!వాదులం పారిలం సిరుల్!భ్రమియించే విష
          ;                                                                         నాగుల్!

14,గర్భగత"-వాదుల"-వృత్తము.

సాదరణ నెంతురే!రసం?సమ  మాజ స్థాపనమ్ము!సమ న్యాయం సమ
                                                                                       ధర్మమ్!
కాదనగ శక్యమేరికిం?గమక మాయె స్వార్ధచింత!కమనీయం సిరి నంటెం
ధరను నాశ మేర్తురే!తమము పెచ్చె శిక్షలేక!తమి తీరం ధన తృష్ణన్!
వాదులం పపారిలం సిరుల్!భముల సజ్జనాళి ముంచి!భ్రమియించే విష
                                                                                      నాగుల్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"-ఛందము లోనిరి.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతలు"10,18 ,అక్షరములకు చెల్లును.   

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.