జైశ్రీరామ్.
గోలుమాలు,బక్కచిక్కె,పౌరనీతి,తారలంటు,చీడల,భగ్నతా,గర్భ-తాలిమి" వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
కుక్కమూతి పిందె లెల్ల!కోరి నిల్చి కాల చక్రమున్!గోలుమాలు చేసిరో
!చెక్కు బెట్టి శాంతి ధాంతి!చేరి చీడపుర్గు లాయిరే!చీలి ముక్కలాయె
బక్క చిక్కె సౌరు లెల్ల!పౌర నీతి భగ్న మేర్పడన్! పాలి గాళ్ళ పంపకం
దక్కు స్వేచ్ఛ దెన్న డంచు!తారలంటె దోష చర్యలున్!తాలిమేది?తల్లికిం
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి,యందలి,అనిరుద్ఛందాంతర్
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము
లుండును.యతులు,9,18,అక్షరము లకు చెల్లును.
1,గర్భగత"-చెక్కుబెట్టు"-వృత్
కుక్క మూతి పిందె లెల్ల!
చెక్కు బెట్టి శాంతి దాంతి!
బక్క చిక్కె సౌరు లెల్ల!
దక్కు స్వేచ్ఛ దెన్న డంచు?
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
2,గర్భగత"-సర్వ శాంతి"-వృత్తము.
కోరి నిల్చి కాల చక్రమున్!
చేరి చీడ పుర్గు లాయిరే!
పౌర నీతి భగ్న మేర్పడన్!
తారలంటు దోష చర్యలన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
3,గర్భగత"-భ్రమతా"-వృత్తము.
గోలు మాలు చేసిరో !యనన్!
చీలి ముక్క లాయె!భాగ్యమున్!
పాలి గాళ్ళ పంప కంబయెన్!
తాలి మేది?తల్లికిం భువిన్!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియు కలదు.పాదమునకు"9"అక్షరము లుండును..
4,గర్భగత"-భ్రమతా"వృత్తము.
కుక్క మూతి పిందె లెల్ల!కోరి నిల్చి కాల చక్రమున్!
చెక్కు బెట్టి శాంతి దాంతి!చేరి చీడ పుర్గు లాయిరే!
బక్క చిక్కె సౌరు లెల్ల!పౌర నీతి భగ్న మేర్పడన్!
దక్కు స్వేచ్ఛ దెన్న డంచు?తారలంటు దోష చర్యలన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి.9,వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-ఓర్పు లేని"-వృత్తము.
కోరి నిల్చి కాల చక్రమున్!కుక్కమూతి పిందె లెల్ల!
చేరి చీడ పుర్గు లాయిరే!చెక్కు బెట్టి శాంతి దాంతి!
పౌర నీతి భగ్న మేర్పడన్!బక్క చిక్కె సౌరు లెల్ల!
తార లంటు దోష చర్యలన్!దక్కు స్వేచ్ఛ దెన్నడంచు?
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.
6;గర్భగత"-ముక్కలాయె"-వృత్తము.
కుక్క మూతి పిందె లెల్ల!గోలు మాలు చేసిరో యనన్!
చెక్కు బెట్టె శాంతి దాంతి!చీలి ముక్క లాయె!భాగ్యమున్!
బక్క చిక్కె పౌరు లెల్ల!పాలి గాళ్ళ పంపకం బయెన్!
దక్కు స్వేచ్ఛ దెన్నడంచు?తాలి మేది?తల్లికిం భువిన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-పాలి గాళ్ళు"-వృత్తము.
గోలు మాలు చేసిరో యనన్!కుక్క మూతి పిందె లెల్ల!
చీలి ముక్కలాయె భాగ్యమున్!చెక్కు బెట్టి శాంతి దాంతి!
పాలి గాళ్ళ పంపకం బయెన్!బక్క చిక్కె పౌరు లెల్ల!
తాలిమేది?తల్లికిం భువిన్!దక్కు స్వేచ్ఛ దెన్న డంచు?
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వయక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-భగ్న నీతి"-వృత్తము.
కోరి నిల్చి కాల చక్రమున్!గోలు మాలు చేసిరో యనన్?
చేరి చీడ పుర్గు లాయిరే!చీలి ముక్క లాయె భాగ్యమున్!
పౌర నీతి భగ్న మేర్పడన్!పాలి గాళ్ళ పంప కంబయెన్!
తార లంటు దోష చర్యలన్!తాలి మేది?తల్లికిం భువిన్!
అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-గోలుమాలు"-వృత్తము.
గోలుమాలు చేసిరో యనన్?కోరి నిల్చి కాల చక్రమున్!
చీలి ముక్కలాయె భాగ్యమున్!చేరి చీడ పుర్గు లాయిరే!
పాలిగాళ్ళ పంప కంబయెన్!పౌర నీతి భగ్న మేర్పడన్!
తాలి మేది తల్లికిం భువిన్!తార లంటు దోష చర్యలన్!
అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనిమము కలదు. పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.
10,గర్భగత"-బక్క చిక్కె"-వృత్తము.
కోరి నిల్చి కాల చక్రమున్!కుక్క మూతి పిందె లెల్ల!గోలుమాలు చేసిరో
చేరి చీడ పుర్గు లాయిరే!చెక్కు బెట్టి శాంతి దాంతి!చీలి ముక్క లాయె
పౌర నీతి భగ్న మేర్పడన్!బక్క చిక్కె పౌరు లెల్ల!పాలి గాళ్ళ పంప
తార లంటు దోష చర్యలన్!దక్కె స్వేచ్ఛ దెన్నడంచు?తాలి మేది?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
11.గర్భగత"-పౌరనీతి"-వృత్తము.
కుక్క మూతి పిందె లెల్ల!గోలు మాలు చేసిరో?యనన్!కోరి నిల్చి
చెక్కు బెట్టి శాంతి దాంతి!చీలి ముక్కలాయె భాగ్యమున్!చేరి చీడ
బక్క చిక్కి పౌరు లెల్ల!పాలి గాళ్ళ పంప కం బయెన్!పౌర నీతి భగ్న
దక్కె స్వేచ్ఛ దెన్న డంచు!తాలి మేది?తల్లికిం భువిన్!తార లంటు
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది..
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.
12,గర్భగత"-తార లంటు"-వృత్తము.
గోలు మాలు చేసిరో యనన్?కుక్క మూతి పిందె లెల్ల!కోరి నిల్చి
చీలి ముక్క లాయె భాగ్యమున్!చెక్కు బెట్టి శాంతి దాంతి!చేరి చీడ
పాలిగాళ్ళ పంప కంబయెన్!బక్క చిక్కి పౌరు లెల్ల!పౌర నీతి భగ్న
తాలి మేది?తల్లికిం భువిన్!దక్కె స్వేచ్ఛ దెన్నడంచు?తార లంటు
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"-ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.
13,గర్భగత"-చీడల"-వృత్తము.
కోరి నిల్చి కాల చక్రమున్!గోలు మాలు చేసిరో యనన్?కుక్క మూతి
చేరి చీడ పుర్గు లాయిరే?చీలి ముక్క లాయె భాగ్యమున్!చెక్కు బెట్టి
పౌర నీతి భగ్న మేర్పడన్!పాలి గాళ్ళ పంప కంబయెన్!బక్క చిక్కి
తార లంటు దోష చర్యలన్!తాలి మేది?తల్లికిం భువిన్!దక్కె స్వేచ్ఛ
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-భగ్నతా"-వృత్తము.
గోలు మాలు చేసిరో యనన్?కోరి నిల్చి కాల చక్రమున్!కుక్క మూతి
చీలి ముక్క లాయె భాగ్యమున్!చేరి చీడ పుర్గు లాయిరే?చెక్కు బెట్టి
పాలిగాళ్ళ పంప కం బయెన్!పౌర నీతి భగ్న మేర్పడన్!బక్క చిక్కి
తాలిమేది?తల్లికిం భువిన్!తార లంటు దోష చర్యలన్!దక్కె స్వేచ్ఛ
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.