జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్లో:-
దాసాయమాన సుమ హాసా కదంబవన వాసా కుసుంభ సుమనో
వాసా విపంచి కృత రాసా విధీత మధు మాసారవింద మధురా
కాసార సూత తతి భాసాzభిరామ తను రాసార శీత కరుణా
నాసా మణి ప్రవర భాసా శివా తిమిర మాసాదయే దుపరతిమ్. ౬.
సీ:-
దాసీ జనుల్ పూల హాసంబులే కాగ
కడిమితోపులనుండు కల్పవల్లి;
కుంకుమ సుమ వర్ణ సంకాశ వస్త్రంబు
మేన దాల్చేటి సు జ్ఞాన దీప్తి.
విన రంజకమ్ముగా వీణ మీటెడు తల్లి;
పద్మ శోభకు మించు భర్మ్య వల్లి.
సరసిజ సుమ కాంతి సముదంచిత శరీర.
ఘన వర్ష హిమతుల్య కరుణ కలది.
గీ:-
ఆ శివాణి నాసామణి నమరి యున్న
శ్రేష్ఠమైనట్టి తేజమ్ము శీఘ్ర గతిని
నన్ను పీడించు నజ్ఞాన నాశనమును
చేసి రక్షించి గాచుత. చేతనమిడి.
భావము:-
దాసీ జనులుగా అయిన పూల నగవులు కలదీ; కడిమి తోపులో నివసించేదీ; కుంకుమ పూల వంటి వస్ర్తాన్ని ధరించేదీ; వీణ మీద మీటిన రస రంజితమైన నిక్వణం కలదీ; తిరస్కరించిన వసంత ఋతువు లోని పద్మాల యొక్క మనోహరత్వం గలదీ; సరోవరం లోని పూల మొత్తాల కాంతి చేత సొగసైన శరీరం కలదీ; జడి వాన వంటి చల్లని దయ కలదీ; సౌభాగ్యవతీ ఐన పార్వతీ దేవి ముక్కర లోని శ్రేష్ఠమైన కాంతి చేత (నా అజ్ఞానమనే) అంధకారాన్ని తొలగునట్లు చేయును గాక!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.