జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్లో:- యాzళీభిరాత్మ తనుతాలీzన కృత్ ప్రియక పాళీషు ఖేలతి భవ
వ్యాళీన కుల్యసిత చూళీ భరా చరణ ధూళీ లసన్ ముని గణా!
యాzళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాzళీక శోభి తిలకా!
సాzళీ కరోతు మమ కాళీ! మనస్స్వపద నాళీక సేవన పదౌ!
సీ:-
చెలులతో నే కాళి శ్రీ కడిమి వనిలో
నీప్సితంబుగ క్రీడ నెలమి యాడు;
నీప్సితంబుగ క్రీడ నెలమి యాడు;
సంసార సర్పంబు సమసింప నేకాళి
యాడు ముంగిసయయి యలరు నెపుడు;
యాడు ముంగిసయయి యలరు నెపుడు;
నీలి ముంగురులతో నిత్యంబు నేకాళి
భక్తుల మదిలోన ప్రబలి యుండు;
భక్తుల మదిలోన ప్రబలి యుండు;
పాద రేణువులచే ప్రబలంగ నేకాళి
ముని సమూహముఁ జేసి; పూజ్య మయెనొ;
ముని సమూహముఁ జేసి; పూజ్య మయెనొ;
గీ:-
నిండు హృది తోడ చెవ్వాకు నిల్పె నెవతె;
వెలుగు తిలకంపు నుదుటితో చెలగు నెవతె;
నిండు హృది తోడ చెవ్వాకు నిల్పె నెవతె;
వెలుగు తిలకంపు నుదుటితో చెలగు నెవతె;
అట్టి యమ యసిత కలువ లభయ పాద
భృంగముగ నన్ను జేయుత యింగితమిడి.
భృంగముగ నన్ను జేయుత యింగితమిడి.
భావము:-
ఏ కాళికా దేవి తనయొక్క చెలికత్తెలతో సుకుమారంగా కలసి మెలసినదై కడిమి చెట్ల యొక్క తోపులలో క్రీడిస్తున్నదో; సంసారమనే త్రాచుపాముకు ఆడ ముంగిస వంటిదో; నల్లటి కేశ పాశం కలదో; పాద రేణువుల చేత ప్రకాశిస్తున్న ముని సమూహము కలదో; ఏ కాళికా దేవి నిండైన శుద్ధాంతరంగంతో చెవికి చెవ్వాకును ధరించిందో; ఏ కాళికా దేవి నుదుటి మీద ప్రకాశిస్తున్న బొట్టును కలిగి యున్నదో; ఆ కాళీకా దేవి తన పాదాలు అనే నల్ల కలువలను సేవించడంలో నా మనస్సును తుమ్మెదనుగ చేయును గాక!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.