జై శ్రీరామ్
"-అనర్ధ ప్రేలనా"-వృత్తము వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
అండయు లేని జీవనము!ఆలన లేని భార్యయున్!ఆదరణంబులేని తావున్!
దండన లేని దుష్కృతము!తాలిమి లేని జీవమున్!తా ధరహాస మొందు
పండని పాప కర్మమును!పాలన లేని రాజ్యమున్!వాదు లనర్ధ ప్రేలనంబున్!
ఖంన లేని వాగుడును!కాలము తీరు వైద్యమున్!కాదన మేలు నదెంచన్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతియందలి"-అనిరుద్ఛందాంతర్
ఛందములోనిది.ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,18,అక్షరములకు చెల్లును.
1,గర్భగత"-పండని కర్మ"-వృత్తము.
అండయు లేని జీవనము!!
దండన లేని దుష్కృతము!
పండని పాప కర్మమును!
ఖండన లేని వాగుడును!
అభిజ్ఞా"ఛందము నందలి,"బృహతి"ఛందము లోనిది!
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత"-దండన శూన్య"-వృత్తము.
ఆలన లేని భార్య యున్!
తాలిమి లేని జీవమున్!
పాలన లేని రాజ్యమున్!
కాలము తీరు వైద్యమున్!
అభిజ్ఞా"ఛందము నందలి"అనుష్ట్ ప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
3,గర్భగత"-నిరాదరణ"-వృత్తము.
ఆదరణంబు లేని తావున్!
తా ధరహాస మందు ధాత్రిన్!
వాదు లనర్ధ ప్రేల నంబున్!
కాదన మేలు నదౌ!నెంచన్!
అభిజ్ఞా"ఛందమునందలి"-బృహతి"-ఛం
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"-ధరహాస"-వృత్తము.
అండయు లేని జీవనము!ఆలన లేని భార్య యున్!
దండన లేని దుష్కృతము!తాలిమి లేని జీవమున్!
పండని పాప కర్మమును!పాలన లేని రాజ్యమున్!
ఖండన లేని వాగుడును!కాలము తీరు వైద్యమున్!
అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17,"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-వాదుల"-వృత్తము.
ఆలన లేని భార్య యున్!అండయు లేని జీవనము!
తాలిమి లేని జీవమున్!దండన లేని దుష్కృతము!
పాలన లేని రాజ్యమున్!పండని పాప కర్మ మును!
కాలము తీరు వైద్యమున్!ఖండన లేని వాగుడును!
అణిమా"ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరము నకు చెల్లును.
6,గర్భగత"-నిరాధార"-వృత్తము.
అండయు లేని జీవనము!ఆదరణంబు లేని చోటున్!
దండన లేని దుష్కృతము!తా ధరహాస మందు ధాత్రిన్!
పండని పాప కర్మమును!వాదు లనర్ధ ప్రేలనంబున్!
ఖండన లేని వాగుడును!కాదన మేలునౌ!నదెంచన్!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-మేలగు"-వృత్తము.
ఆదరణంబు లేని చోటున్!అండయు లేని జీవనము!
తా ధరహాస మందు ధాత్రిన్!దండన లేని దుష్కృతము!
వాదు లనర్ధ ప్రేలనంబున్!పండని పాప కర్మ మును!
కాదన మేలునౌ! నదెంచన్!ఖండన లేని వాగుడును!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-పాలన లేని"-వృత్తము.
ఆలన లేని భార్య యున్!ఆదరణంబు లేని చోటున్!
తాలిమి లేని జీవమున్!తా ధరహాస మందు ధాత్రిన్!
పాలన లేని రాజ్యమున్!వాదు లనర్ధ ప్రేల నంబున్!
కాలము తీరు వైద్యమున్!కాదన మేలునౌ!నదెంచన్!
అణిమా"ఛందమునందలి"అత్యష్టి"ఛం
ప్రాస నియమము కలదు.పాదమునకు"-17,అక్షరములుండు
యతి"9,వ యక్షరము నకు చెల్లును.
9,గర్భగత"-సత్పాలనా"వృత్తము.
ఆదరణంబు లేని చోటున్!ఆలన లేని భార్యయున్!
తా ధరహాస మందు ధాత్రిన్!తాలిమి లేని జీవమున్!
వాదు లనర్ధ ప్రేలనంబున్!పాలన లేని రాజ్యమున్!
కాదన మేలునౌ నదెంచన్!కాలము తీరు వైద్యమున్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండు
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"నిరాలన"-వృత్తము.
ఆలన లేని భార్యయున్!అండయు లేని జీవనము!ఆదరణంబు లేని చోటున్!
తాలిమి లేని జీవమున్!దండన లేని దుష్కృతము!తా ధరహాస మందు
పాలన లేని రాజ్యమున్!పండని పాప కర్మమును!వాదు లనర్ధ ప్రేలనంబున్!
కాలముతీరు వైద్యమున్!ఖండన లేనివాగుడును!కాదన మేలునౌ!నదెంచన్!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18"అక్షరములకు చెల్లును.
11.గర్భగత"-కాలముతీరు"వృత్తము.
అండయు లేని జీవనము!ఆదరణంబు లేని చోటున్!ఆలన లేని భార్యయున్!
దండన లేని దుష్కృతము!తా ధరహాస మందు ధాత్రిన్!తాలిమి లేని
పండని పాప కర్మమును!వాదు లనర్ధ ప్రేల నంబున్!పాలన లేని రాజ్యమున్!
ఖండన లేని వాగుడును!కాదనమేలునౌ!నదెంచన్!కా
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"10,19,అక్షరము లకు చెల్లును.
12,గర్భగత"-పాలన శూన్య"-వృత్తము.
ఆదరణంబు లేని చోటున్!అండథు లేని జీవనము!ఆలన లేని భార్యయున్!
తా ధరహాస మందు ధాత్రిన్!దండన లేని దుష్కృతము! తాలిమి లేని
వాదు లనర్ధ ప్రేలనంబున్!పండని పాపకర్మ మును!పాలన లేని రాజ్యమున్!
కాదన మేలునౌ!నదెంచన్!ఖండనలేని వాగుడును!కాలముతీరు వైద్యమున్!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.
13,గర్భగత"-తాలిమి లేని"-వృత్తము.
ఆలన లేని భార్యయున్!ఆదరణంబు లేని చోటున్!అండయు లేని జీవనము!
తాలిమీ లేని జీవమున్!తా ధరహాస మందు ధాత్రిన్! దండన లేని
పాలన లేని రాజ్యమున్!వాదు లనర్ధ ప్రేలనంబున్!పండని పాప కర్మమును!
కాలము తీరు వైద్యమున్!కాదన మేలునౌ!నదెంచన్!ఖండనలేని వాగుడును!
అనిరుద్ఛందమునందలి "ఉత్కతి "ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"-9,18,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-నిష్ఖండన"-వృత్తము.
ఆదరణంబు లేని చోటున్!ఆలన లేని భార్యయున్!అండయు లేని జీవనము!
తా ధరహాస మందు ధాత్రిన్!తాలిమి లేని జీవమున్!దండన లేని
: : :
వాదు లనర్ధ ప్రేలనంబున్!పాలన లేని రాజ్యమున్!పండనిషపాప కర్మమును!
కాదన మేలునౌ!న దెంచన్!కాలముతీరు వైద్యమున్!ఖండనలేని వాగుడును!
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"-ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్..
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.