.హర శంభో శివ సర్వజ్ఞా!
వర దాంబో నిధి పారజ్ఞా!
గురు జ్ఞానోత్సుక శ్రీ హరా!
నిరతానంద గురోత్తమా! 1.
అరవిందాయత లోచనా!
పరమేశా!శుభ శోభకా!
వరదాయీ నటశేఖరా!
గిరి కైలాస నివాసకా! 2.
సిరి దాతీవయ శంకరా!
వర భాగ్యోదయ సూర్యమా!
తిరి పెం బేలయ?జంగమా!
హర నిన్నే మది గొల్తునే! 3.
పురారీవే!పురుషోత్తమా!
గురు తాపోప శ్రమాంగిరా!
గురు దత్తా సుర బాంధవా!
మరుభూమిం జరియింతువే! 4.
వర బూధిం ధరియింతువే!
గరళంబున్ గళముంచితే!
స్థిర ప్రజ్ఞం జగ రక్షణన్!
పరమం బేర్చెడి మోక్షకా! 5.
సురలం సౌమ్యుడ వీవయా!
వరము ల్గోరగ నిత్తువే!
పరమేశుండవు శ్రీ హరా!
జర తాపంబులు బాపుమా! 6.
హర నిన్నే మది గొల్తునే!
తిరుగాడం బల మీవయా!
చర జీవానల బాధలన్!
దరి రా నీకుమి మోక్షదా! 7.
బరువాయెం నర జన్మమున్!
తిరమేదీ గన జాలకన్!
దరి జేరీ నను గావుమా!
పరమార్ధంబును గూర్చుమా! 8.
గిరి పుత్రిం హృది నిల్పితే!
వర వారిం శిర ముంచితే!
గిరి కైలాసము నీదయా!
గురు నాట్యా!నట రాజమా! 9,
కురులం గంగమ నాట్యమున్!
వరమౌ శీతల మేర్చగా!
నిరతానందము నొందుచున్!
నరులం బ్రోవు మహేశ్వరా! 10,
నిరతం బీశ్వరు గొల్తునే!
పరమానందము నొందుచున్!
సుర భోగంబులు కోరనే!
సుర సౌమ్యంబది యెంతునే! 11.
గిరి జేశుం నమకంబునున్!
హర స్తుతౌ చమకంబునున్!
స్థిర మేర్చే మహ న్యాసమున్!
పరమాత్మా గొలుతుం సదా! ; 12.
హరు నెంచే వర భాగ్యమున్!
నిరతంబుం గలి గింపుమా!
సుర మోదంబగు కీర్తనల్!
వరదామంబుం జేర్చగన్! 13.
దురహంకారుల ద్రోలుమా!
నర లోకంబును కావుమా!
సిరి పొంగం నిను దల్వకన్!
దరి జేరం మరిచే రిలన్! 14,
పరమార్ధంబును బోధిలం!
గురు బోధం గలి గింపుమా!
స్థిర ప్రజ్ఞాన్విత దేహులన్!
నిరతంబుం గను శంకరా! 15,
వర బీజాలకు స్రష్టవై!
బరగే వీవిల శంకరా!
వెరపు ల్దూరము చేయుమా!
నిరతానందము నింపుమా! 16.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.