జైశ్రీరామ్.
విద్యకు విలువేదిచ్చట!వేషము భాష్యము దూష్యం!ప్రీతియు గనజాల
తధ్యము ధన చింతే నట!ధాషతు చేతురు గొప్పన్!దాతలు బలె మాట
బోధ్యము పర హానే నట!భూషలు నొందు తలంపే!భూతియె పరమార్ధ
చిద్యమలత బేజారయె!శేషిత శోభ లవింతే!చేతన తల వంపు నైనన్!
దాతలు బలె=దాతలట్లు
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-
ఉత్కృతి "-ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు"26"అక్షరము లుండును.యతులు"10,18,అక్షరములకు
చెల్లును.
1,గర్భగత"-పరహాని"-వృత్తము.
విద్యకు విలువే దిచ్చట!
తధ్యము ధన చింతే నట!
బోధ్యము పరహానే నట!
చిద్యమలత బేజారయె!
అభిజ్ఞా"ఛందమునందలి"బృహతి" ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత"-బోధ్యము"వృత్తము.
వేషము భాష్యము దూష్యం!
ధాషతు చేతురు గొప్పన్!
భూషలు నొందు తలంపే!
శేషిత శోభ ల వింతే!
అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"ఊక్షరము లుండును
3,గర్భగత"-చిద్యమల"-వృత్తము.
ప్రీతియు గన జాల రెంచన్!
దాతలు బలెమాట లొప్పున్!
భూతియె పరమార్థ తృష్ణనన్!
చేతన తలవంపు నైనన్!
అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది
పాదమునకు 9,అక్షరములుండును.
4,గర్భగత"-బేజారు"-వృత్తము.
విద్యకు విలువే దిచ్చట!వేషము భాష్యము దూష్యం!
తథ్యము ధన చింతే నట!ధాషతు చేతురు గొప్పన్!
బోధ్యము పర హానే నట!భూషలు నొందు తలంపే!
చిద్యమలత బేజారయె!శేషిత శోభ ల వింతే!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "17,అక్షరము లుండును.
యతి"10,వయక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-ధనచింత"-వృత్తము.
వేషము భాష్యము దూష్యం!విద్యకు విలువే దిచ్చట!
ధాషతు చేతురు గొప్పన్!తథ్యము ధన చింతే నట!
భూషలు నొందు తలంపే!బోధ్యము పరహానే నట!
శేషిత శోభ ల వింతే!చిద్య మలత బేజారయె!
అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పొదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-భాష్యము"-వృత్తము.
విద్యకు విలు వే దిచ్చట!ప్రీతియు గన జాల రెంచన్!
తథ్యము ధనచింతే నట! దాతలు బలె మాట లొప్పున్!
బోధ్యము పరహానే నట!భూతియె పరమార్ధ తృష్ణనన్!
చిద్యమలత బేజారయె!చేతన తలవంపు నై నన్!
అణిమా ఛందము నందలి""ధృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-తలంపు"-వృత్తము.
ప్రీతియు గన జాల రెంచన్!విద్యకు విలువే దిచ్చట!
దాతలు బలె మాటలొప్పున్ తథ్యము ధన చింతే నట!
భూతియె పరమార్ధ తృష్ణనన్!బోధ్యము పర హానే నట!
చేతన తలవంపు నైనన్!విద్య మలత బేజారయె!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును!
8,గర్భగత"శోభ"-వృత్తము.
వేషము భాష్యము దూష్యం!ప్రీతియు గన జాల రెంచన్!
ధాషతు చేతురు గొప్పన్!దాతలుబలె మాట లొప్పున్
బోధ్యము పర హానే నట!భూతియె పరమార్ధ తృష్ణనన్!
విద్యమలపత బేజారయె!చేతన తలవంపు నైనన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు-"17"అక్షరము లుండును.
యతి9,"వ యక్షరమునకు చెల్లును!
9,గర్భగత"-వరదము"వృత్తము.
ప్రీతియు గన జాల రెంచన్!వేషము భాష్యము భూష్యం!
దాతలు బలె మాట లొప్పున్!ధాషతు జేతురు గొప్పన్!
భూతియె పరమార్ధ తృష్ణనన్!బోధ్యము పర హానే నట!
చేతన తలవంపు నైనన్!విద్య మలత బే జారయె!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
పాదమునకు"17,అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.
10,గర్భగత"-భూతియ"-వృత్తము.
వేషము భాష్యము దూష్యం!విద్యకు విలువే దిచ్చట!ప్రీతియు గన జాల
ధాషతు జేతురు గొప్పన్!తథ్యము ధన చింతే నట!దాతలు బలె మాట
భూషలు నొందు తలంపే!బోధ్యము పర హానే నట!భూతియె పరమార్ధ
శేషిత శోభల వింతే! చిద్యమలత బేజారయె!చేతన తలవంపు నైనన్!
అనిరుద్ఛందము నందలి ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రా సనియమము కలదు.పాదము నకు 26,అక్షరము లుండును.
యతులు "-10,19,అక్షరములకు చెల్లును.
11.గర్భగత"-పరమార్ధ"-వృత్తము.
విద్యకు విలువే దిచ్చట!ప్రీతియు గన జాల రెంచన్!వేషము భాష్యము
తథ్యము ధన చింతే నట!దాతలు బలె మాట లొప్పన్!ధాషతు చేతురు
బోధ్యము పర హానే నట! భూతియె పరమార్ధ తృష్ణన్!భూషలు నొందు
చిద్యమలత బేజారయె!చేతన తల వంపు నైనన్! శేషిత శోభలలింతే!
అనిరుద్ఛందమునందలి "ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు "26"అక్షరములుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.
12,గర్భగత"-ఆశాలత"వృత్తము.
ప్రీతియు గన జాల రెంచన్!విద్యకు విలువే దిచ్చట!వేషము భాష్యము
దాతలు బలె మాట లొప్పన్!తథ్యము ధన చింతే నట!ధాషతు చేతురు
భూతియె పరమార్ధ తృష్ణన్!బోధ్యము పర హానే నట!భూషలు నౌందు
చేతన తల వంపు నైనన్!చిద్య మలత బేజారయె!శేషిత శోభలవింతే!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26 అక్షరము లుండును.
యతులు10,19,అక్షరము లకు చెల్లును.
13,గర్భగత"-శోభాయత"వృత్తము .
వేషము భాష్యము దూష్యం!ప్రీ తియు గన జాల దెంచన్!విద్యకు విలువే
ధాషతు జేతురు గొప్పన్!దాతలు బలె మాట లొప్పన్!తథ్యము ధన
భూషలు నొందు తలంపే! భూతియె పరమార్ధ తృష్ణన్!చోధ్యము పర
శేషిత శోభ లవింతే!చేతన తలవంపు నైనన్!చిద్యమలత బేజారయె!
అనిరుద్ఛందము నందలి "-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు.9,18,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-శేషిత"-వృత్తము.
ప్రీతియు గన జాల దెంచన్!వేషము భాష్యము దూష్యం!విద్యకు విలువే
దాతలు బలె మాట లొప్పన్!ధాషతు జేతురు గొప్పన్!తథ్యము ధన
భూతియె పరమార్ధ తృష్ణం!భూషలు నొందు తలంపే!చోధ్యము పర
చేతన తలవంపు నైనన్!శేషిత శోభ ల వింతే!విద్యమలత బేజారయె!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లండును.యతులు"10,18"అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.