జైశ్రీరామ్.
దదాననిష్ట,తెన్గు సంస్కృతి,రంగవల్లి,పితృతృప్తి,బంధువర్గ,నిండుశోభ,సందడి,నింపొదవు,సొబగు పెంచు,వాడ వాడ,పండుగ,నిండునీతి,తెల్లమాయె,ధర్మ నిష్ట"-గర్భ సంక్రాంతి శోభ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి జుత్తాడ.
వచ్చె మకర సంక్రమణం!పాడి పంట లంది రాగ!వల్లె రంగవల్లు లొప్పుచున్!
అచ్చ తెన్గు సంస్కృతినిన్!ఆడ ఈడ ఏడ చూడ!అల్ల బంధు వర్గ సందడిన్!
తెచ్చె సొబగు రంగ వళుల్!ధీడు నీతి నింపు పెంప!తెల్లమైన నిండు శోభలన్!
వచ్చె పితలు తృప్తు లవన్!వాడ వాడ పండు గాయె!వల్లె దాన ధర్మ నిష్టతన్!
ధీడు=ధీటు.
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృ
ఛందములోనిది.ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,18,అక్షరములకు చెల్లును.
1,గర్భగత"-దాన నిష్ట"-వృత్తము.
వచ్చె మకర సంక్రమణం!
అచ్చ తెన్గు సంస్కృతినిన్!
తెచ్చె సొబగు రంగ వళుల్!
వచ్చె పితలు తృప్తు లవన్!
అభిజ్ఞా ఛందమునందలి "-బృహతి"-ఛందము లోనాది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత"-తెన్గు సంస్కృతి"-వృత్తము.
పాడి పంట లంది రాగ!
ఆడ ఈడ ఏడ చూడ!.
ధీడు నీతి నింపు పెంప!
వాడ వాడ పండు గాయె!
అభిజ్ఞా ఛందము నందలి""అనుష్టుప్ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుడును.
3,గర్భగత"-రంగవల్లి"-వృత్తము.
వల్లె రంగ వల్లు లొప్పుచున్!
అల్ల బంధు వర్గ సందడిన్!
తెల్లమైన నిండు శోభలన్!
వల్లె దాన ధర్మ నిష్టతన్!
అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"పితృతృప్తి"--వృత్తము.
వచ్చె మకర సంక్రమణం!పాడి పంట లంది వచ్చె!
అచ్చ తెన్గు సంస్కృతినిన్!ఆడ ఈడ ఏడ చూడ!
తెచ్చె సొబగు రంగ వళుల్!ధీడు నీవి నింపు పెంప!
వచ్చె పితలు తృప్తు లవన్!వాడ వాడ పండు గాయె!
అణిమా"ఛందమునందలి"అత్యష్టి"-ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి10, వయక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-బంధువర్గ"-వృత్తము.
పాడి పంట లంది వచ్చె!వచ్చె మకర సంక్రమణం!
ఆడ ఈడ ఏడ చూడ!అచ్చ తెన్గు సంస్కృతినిన్!
ధీడు నీవి నింపు పెంప!తెచ్చె సొబగు రంగవళుల్!
వాడ వాడ పండు గాయె!వచ్చె పితలు తృప్తు లవన్!
అణిమా ఛందము నందలి అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-నిండు శోభ"-వృత్తము.
పాడి పౌట లంది వచ్చె!వల్లె రంగవల్లు లొప్పుచున్!
ఆడ ఈడ ఏడ చూడ!అల్ల బంధు వర్గ సందడిన్!
ధీడు నీవి నింపు పెంప!తెల్లమైన నిండు శోభలన్!
వాడ వాడ పండు గాయె!వల్లె దాన ధర్మ నిష్టతన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి9,వ యక్షరము నకు చెల్లును.
7,గర్భగత"-సందడి"-వృత్తము.
వల్లె రంగ వల్లు లొప్పుచున్!పాడి పంట లంది వచ్చె!
అల్ల బంధు వర్గ సందడిన్!ఆడ ఈడ ఏడ చూడ!
తెల్లమైన నిండు శోభలన్!ధీడు నీవి నింపు పెంప!
వల్లె దావ ధర్మ నిష్టతన్!వాడ వాడ పండు గాయె!
అణిమా ఛందమునందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-నింపొదవు"-వృత్తము .
వచ్చె మకర సంక్రమణం!వల్లె రంగ వల్లు లొప్పుచున్!
అచ్చ తెన్గు సంస్కృతిన్!అల్ల బంధు వర్గ సందడిన్!
తెచ్చె సొబగు రంగ వళుల్!తెల్లమైన నిండు శోభలన్!
వచ్చె పితలు తృప్తు లవన్!వల్లె దాన ధర్మ నిష్టతన్!
అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-సొబగు పెంచు"-వృత్తము.
వల్లె రంగ వల్లు లొప్పుచున్!వచ్చె మకర సంక్రమణం!
అల్ల బంధు వర్గ సందడిన్!అచ్చ తెన్గు సంస్కృతిన్!
తెల్లమైన నిండు శోభలన్!తెచ్చె సొబగు రంగ వళుల్!
వల్లె దాన ధర్మ నిష్టతన్!వచ్చె పితలు తృప్తు లవన్!
అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమభు కలదు.పాదమునకు"--18,అక్షరము లుండును.
యతి"10"వ యకషరము నకు చెల్లును.
10,గర్భగత"-వాడ వాడ"-వృత్తము.
పాడి పంట లంది వచ్చె!వచ్చె మకర సంక్రమణం!వల్లె రంగ వల్లు లొప్పుచున్!
ఆడ ఈడ ఏడ చూడ!అచ్చ తెన్గు సంస్కృతినిన్!అల్ల బంధువర్గ సందడిన్!
ధీడు నీవి నింపు శెంప!తెచ్చె సొబగు రంగ వళుల్!తెల్లమైన నిండు శోభలన్!
వాడ వాడ పండుగాయె!వచ్చె పితలు తృప్తు లవన్!వల్లె దాన ధర్మ నిష్టతన్!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు9,18,అక్షరము లకు చెల్లును.
11.గర్భగత"-పండుగ"-వృత్తము.
పాడి పంట లందివచ్చె!వల్లె రంగ వల్లు లొప్పుచున్!వచ్చె మకర సంక్రమణం!
ఆడఈడ ఏడ చూడ!అల్ల బంధువర్గ సందడిన్!అచ్చ తెన్గు సంస్కృతినిన్!
ధీడు నీవి నింపు పెంప!తెల్లమైన విండు శోభలం!తెచ్చె సొబగు రంగవళుల్!
వాడ వాడ పండు గాయె!వల్లె దాన ధర్మ నిష్టతం!వచ్చె పితలు తృప్తులవన్!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరములుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.
12,గర్భగత"-నిండునీతి"-వృత్తము.
వల్లె రంగ వల్లు లొప్పుచున్!పాడి పంట లంది వచ్చె!వచ్చె మకర సంక్రమణం!
అల్ల బంధు వర్గ సందడిం!ఆడ ఈడ ఏడ చూడ!అచ్చ తెన్గు సంస్కృతినిన్!
తెల్లమైన నిండు శోభలన్!ధీడు నీవి నింపు పెంప!తెచ్చె సొబగు రంగవళుల్!
వల్లె దాన ధర్మ నిష్టతన్!వాడ వాడ పండు గాయె!వచ్చె పితలు తృప్తు లవన్!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.
13,గర్భగత"-తెల్లమాయె"-వృత్తము.
వచ్చె మకర సంక్రమణం!వల్లె రంగ వల్లు లొప్పుచున్!పాడి పంట లంది వచ్చె!
అచ్చ తెన్గు సంస్కృతినిం!అల్ల బంధు వర్గ సందడిం!ఆడ ఈడ ఏడ చూడ!
తెచ్చె సొబగు రంగవళుల్!తెల్ల మైన నిండు శోభలం!ధీడు నీవి నింపు పెంప!
వచ్చె పితలు తృప్తు లవన్!వల్లె దాన ధర్మ నిష్టతం!వాడ వాడ పండు గాయె!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-ధరమనిష్ట"-వృత్తము.
వల్లె రంగ వల్లు లొప్పుచున్!వచ్చె మకర సంక్రమణం!పాడి పంట లంది వచ్చె!
అల్ల బంధు వర్గసందడిన్!అచ్చ తెన్గు సంస్కృతినిన్!ఆడ ఈడ ఏడ చూడ!
తెల్లమైన నిండు శోభలం!తెచ్చె సొబగు రంగవళుల్!ధీడు నీవి నింపు పెంప!
వల్లె దాన ధర్మ నిష్టతం!వచ్చె పితలు తృప్తు లవం!వాడ వాడ పండు గాయె!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు.10,19,అక్షరములకు చెల్లును..
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.