గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2024, మంగళవారం

మంగమేశ,సంఘమేశ,వరాంగ,కరుణాకర,చతురతా,సరిలేని,పురమేలు,బ్రోవగ,పొంజేయు,స్థావర,జంగమ,మా వరాంగి,మతులమేయం,కరుణించు,గర్భ"-సుధీర ధీరా"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ..

జైశ్రీరామ్. 

జంగమాశ్రిత సంఘమేశా!స్థావరంబుల నిల్పి బ్రోవన్!చతురు డీవే!శంకరా!

మంగమేశుని ప్రాపు నీదే!మా వరాంగికి సోదరుండా!మతు లమేయం
                                                                                   బేర్చుమా!
గంగ భంగ వరాంగ దేహా!కావ నీ సరి లే రనంగన్గతిని గూర్పం రావయా!!
పొంగ జేయుమి శ్రీ లనంతమ్!భూ వరీయ సు ధీర ధీరా!ప్రగతి మూలం
                                                                                   బీవనన్!
                                                                                      
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి,
ఛందము లోనిది.ప్రాస నియమము కలదు. పాదమునకు"26"అక్షరము లుండును.యతురు"10,19,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-మంగమేశ"-వృత్తము.

జంగ మాశ్రిత సంఘమేశా!
మంగ మేశుని ప్రాపు నీదే!
గంగ భంగ వరాంగ దేహా!
పొంగ జేయుమి శ్రీ లనంతమ్!

అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 9,అక్షరము లుండును.

2,గర్భగత"-సంఘమేశ"-వృత్తము.

స్థావరంబులు నిల్పి బ్రోవన్!
మా వరాంగికి సోదరుండా!
కావ నీసరి లే రనంగన్!
భూ వరీయ సుధీర ధీరా!

అభిజ్ఞా ఛందము నందలి "బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-వరాంగ"వృత్తము.

చతురు డీవే!శంకరా!
మతు లమేయం బేర్చుమా!
గతిం గూర్పం రావయా!
ప్రగతి మూలం బీవనన్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్ఛందము"లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"8"అక్షరములుండును.

4,గర్భగత"కరుణాకర"-వృత్తము.

జంగ మాశ్రిత సంఘమేశా!స్థావరంబుల నిల్పి బ్రోవన్!
మంమేశుని ప్రాపు నీదే!మా వరాంగికి సోదరుండా!
గంగ భంగ వరాంగ దేహా!కావ నీ సరి లేరనంగన్!
పొంగ జేయుమి శ్రీ లనంతమ్!భూ వరీయ సు ధీర ధీరా!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-చతురతా'-వృత్తము.

స్థావరంబుల నిల్పి బ్రోవన్!జంగ మాశ్రిత సంఘ మేశా!
మా వరాంగికి సోదరుండా!మంగమేశుని ప్రాపు నీదే!
కావ నీ సరి లే రనంగన్!గంగ భంగ వరాంగ దేహా!
భూ వరీయ సు ధీర ధీరా!పొంగ జేయుమి శ్రీ లనంతమ్!

అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"సరి లేని"-వృత్తము.

స్థావరంబుల నిల్పి బ్రోవన్!చతురు డీవే!శంకరా
మా వరాంగికి సోదరుండా!మతు లమేయం బేర్చుమా!
కావ నీసరి లే రనంగన్!గతిని గూర్చం రావయా!
భూ వరీయమ ధీరధీరా!ప్రగతి మూలంబీ వనన్!

అణిమా ఛందమునందలి "అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-పురమేలు"-వృత్తము.

చతురు డీవే!శంకరా!స్థావరంబుల నిల్పి బ్రోవన్!
మతు లమేయం బేర్చుమా!మా వరాంగికి సోదరుండా!
గతిని గూర్పం రావయా!కావ నీ సరి లే రనంగన్!
ప్రగతి మూలం బీవనన్!భూవరీయమ ధీరధీరా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందములోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-బ్రోవగ"-వృత్తము.

జంగ మాశ్రిత సంఘ మేశా!చతురు డీవే!శంకరా!
మంగ మేశుని ప్రాపు నీదే!మతు లమేయం బేర్చుమా!
గంగ భంగ వరాంగ దేహా!గతిని గూర్పం రావయా!
పొంగ జేయుమి శ్రీ లనంతమ్!ప్రగతి మూలం బీవనన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 17,అక్షరము లుండును.
యతి,10"వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-పొంగ జేయు"-వృత్తము.

చతురు డీవే!శంకరా!జంగ మాశ్రిత సంఘ మేశా!
మతు లమేయం బేర్చుమా!మంగమేశుని ప్రాపు నీవే!
గతిని గూర్పం రావయా!గంగ భంగ వరాంగ దేహా!
ప్రగతి మూలం బీవనన్!పొంగ జేయుమి శ్రీ లనంతమ్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-స్థావర"-వృత్తము.

స్థావరంబుల నిల్పి బ్రోవన్!జంగ మాశ్రిత సంఘమేశా!చతురు డీవే!శంకరా!
మా వరాంగికి సోదరుండా!మంగమేశుని ప్రాపు నీదే!మతు లమేయం
                                                                                    బేర్చుమా!
కావ నీసరి లేరనంగన్!గంగ భంగ వరాంగ దేహా!గతిని గూర్పం రావయా!
భూ వరీయమ ధీర ధీరా!పొంగ జేయుమి శ్రీ లనంతం!ప్రగతి మూలంబీ
                                                                                      వనన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18;అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-జంగమ"-వృత్తము.

స్థావరంబుల నిల్పి బ్రోవం!చతురు డీవే శంకరా!జంగ మాశ్రిత సంఘమేశా!
మా వరాంగికి సోదరుండా!మతు లమేయం బేర్చుమా!మంగ మేశుని ప్రాపు
                                                                                             నీదే!
కావ నీసరి లేరనంగం!గతిని గూర్పం రావయా!గంగ భంగ వరాంగ దేహా!
భూ వరీయమ ధీర ధీరా!ప్రగతి మూలం బీవనం!పొంగ జేయుమి శ్రీ
                                                                                   లనంతమ్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26"అక్షరము లుండును.
యతులు10,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-మా వరాంగి"-వృత్తము.

చతురు డీవే!శంకరా!స్థావరంబుల నిల్పి బ్రోవం!జంగ మాశ్రిత సంఘమేశా!
మతు లమేయం బేర్చుమా!మా వరాంగికి సోదరుండా!మంగమేశుని ప్రాపు
                                                                                        :::    నీదే!
గతిని గూర్చం రావయా!కావ నీసరి లేరనంగం!గంగ భంగ వరాంగ దేహా!
ప్రగతి మూలం బీవనం!భూ వరీయమ ధీర ధీరా!పొంగ జేయుమి శ్రీ
                                                                                 లనంతమ్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-మతులమేయ"-వృత్తము.

జంగ మాశ్రిత సంఘ మేశా!చతురు డీవే!శంకరా!స్థావరంబుల నిల్పి బ్రోవన్!
మంగమేశుని ప్రాపు నీదే!మతు లమేయం బేర్చుమా! మా వరాంగికి
                                                                                  సోదరుండా!
గంగ భంగ వరాంగ దేహా!గతిని గూర్చం రావయా!కావ నీసరి లేరనంగన్!
పొంగ జేయుమి శ్రీ లనంతం!ప్రగతి మూలం బీవనన్!భూ వరీయ సు ధీర
                                                                                          ధీరా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26,అక్షరము లుండును.
యతులు10,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-కరుణించు"-వృత్తము.

చతురు డీవే!శంకరా!జంగ మాశ్రిత సంఘమేశా!స్థావరంబు నిల్పి బ్రోవన్!
మతు లమేయం బేర్చుమా!మంగమేశుని ప్రాపు నీదే!మా  వరాంగికి
                                                                             సోదరుండా!
గతిని గూర్పం రా వయా!గంగ భంగ వరాంగ దేహా!కావ నీసరి లే రనంగన్!
ప్రగతి మూలం బీవనం!పొంగ జేయుమి శ్రీ లనంతం!భూ వరీయమ ధీర
                                                                                   ధీరా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.