జైశ్రీరామ్
మేలుగాని,చాలునిక,భ్రమక,కాలచక్ర,మెలిక,సలలిత,దోషజీవన,తీరెంచు, తులగాని,చాలించు,కలగ నిల్చు,సాగుమా,మెలకువ,జీవయాత్ర,గర్భ"కలి వికార"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ
తూలిపాటు దోషమే సుమా!తులను గా దదెంచగా!తొలగు సర్వ శోభలిలన్!
మేలుగోరు జీవ యాత్రలో!మెలకు వెంచి సాగుమా!మెలిక జీవ మెంచకికన్!
చాలు నింక చేయు ధర్మమున్!జలగ గాక నొప్పుమా!సలలి తుండ వో
కాల చక్ర తీరు నెంచుమా!కలగ నిల్చి పోకుమా!కలి వికార మంటకుమా!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి ఛందము లోనిది.ప్రాసనియమభు కలదు.
పాదమునకు"26"అక్షరములుండును.యతు
చెల్లును.
1,గర్భగత"-మేలుగాని"-వృత్తము.
తూలిపాటు దోషమే సుమా!
మేలుగోరు జీవ యాత్రలో!
చాలు నింక చేయు ధర్మమున్!
కాల చక్ర తీరు నెంచుమా!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9.అక్షరము లుండును.
2,గర్భగత"-చాలునిక"-వృత్తము.
తులను గా దదెంచగా!
మెలకు వెంచి సాగుమా!
జలగ గాక నొప్పుమా!
కలగ నిల్చి పోకుమా!
అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
3,గర్భగత"-భ్రమక"-వృత్తము.
తొలగు సర్వ శోభ లిలన్!
మెలిక జీవ మెంచకుమా!
సలలితుండవో యనగన్!
కలి వికార మంటకుమా!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"-కాల చక్ర"-వృత్తము.
తూలి పాటు దోషమే సుమా!తులను గా దదెంచగా!
మేలు గోరు జీవ యాత్రలో!మెలకు వెంచి సాగుమా!
చాలు నింక జేయు ధర్మమున్!జలగ గాక నొప్పుమా!
కాల చక్ర తీరు నెంచుమా!కలగ నిల్చి పోకుమా!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసననియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యి"10"వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-మెలిక"-వృత్తము.
తులను గా దదెంచగా!తూలి పాటు దోషమే సుమా!
మెలకు వెంచి సాగుమా!మేలు గోరు జీవ యాత్రలో!
జలగ గాక నొప్పుమా!చాలు నింక చేయు ధర్మమున్!
కలగ నిల్చి పోకుమా!కాల చక్ర తీరు నెంచుమా!
అణిమమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి9,వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-సలలిత"-వృత్తము.
తూలి పాటు దోషమే సుమా!తొలగు సర్వ శోభ లిలన్!
మేలు గోరు జీవ యాత్రలో!మెలిక జీవ మెంచ కుమా!
చాలు నింక చేయు ధర్మమున్!సలలితుండ వో యనగన్!
కాల చక్ర తీరు నెంచుమా!కలి వికార మంటకుమా!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-దోషజీవన"--వృత్తము.
తొలగు సర్వ శోభ లిలన్!తూలిపాటు దోషమమే సుమా!
మెలిక జీవ మెంచ కుమా!మేలు గోరు జీవ యాత్రలో!
సలలితుండవో యన గన్!చాలు నింక చేయు ధర్మమున్!
కలి వికార మంటకుమా!కాల చక్ర తీరు నెంచుమా!
అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాససనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.
8,గర్భగత"-తీరెంచు"-వృత్తము.
తులను గా దదెంచగా!తొలగు సర్వ శోభ లిలన్!
మెలకు వెంచి సాగుమా!మెలిక జీవ మెంచకుమా!
జలగ గాక నొప్పుమా!సలలితుండవో యనగన్!
కలగ నిల్చి పోకుమా!కలి వికార మంటకుమా!
అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియము కలదు.పాదదమునకు"17,అక్షరము లుండును.
యతి"-9,"వ యక్షరము నకు చెల్లును.
9,గర్భగత"-తులగాని"-వృత్తము.
తొలగు సర్వ శోభ లిలన్!తులను గా దదెంచగా!
మెలిక జీవ మెంచకుమా!మెలకు వెంచి సాగుమా!
సలలితుండవో యనగన్!జలగ గాక నొప్పుమా!
కలి వికార మంటకుమా!కలగ నిల్చి పోకుమా!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10 ,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"-చాలించు"-వృత్తము.
తులను గా దదెంచగా!తూలి పాటు దోషమే సుమా!తొలగు సర్వ శోభలిలన్!
మెలకు వెంచి సాగుమా!మేలుగోరు జీవ యాత్రలో!మెలికజీవ మెంచకుమా!
జలగ గాక నొప్పుమా!చాలు నింక జేయు ధర్మ మున్!స లలితుం డవో
కలగ నిల్చి పోకుమా!కాల చక్ర తీరు నెంచుమా!కలి వికార మంటకుమా!
అనిరుద్ఖందము నందలి ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్ష రములుండును.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.
11.గర్భగత"-కలగనిల్చు"-వృత్తము.
తూలిపాటు దోషమే సుమా!తొలగు సర్వ శోభలిలన్!తులను గాదదెంచగా!
మేలు గోరు జీవయాత్రలో!మెలిక జీవ మెంచకుమా!మెలకు వెంచి సాగుమా!
చాలు నింక చేయు ధర్మమున్!స లలితుం డవో యనగన్!జలగ గాక
కాల చక్ర తీరు నెంచుమా!కలి వికార మంటకుమా!కలగ నిల్చి పోకుమా!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"-ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు "26అక్షరము లుండును..
యతులు 10,19,అక్షరములకు చెల్లును.
12,గర్భగత"-సాగుమా -"-వృత్తము.
తొలగు సర్వ శోభ లిలన్!తూలిపాటు దోషమే సుమా!తులనుగా దదెంచగా!
మెలిక జీవ మెంచకుమా!మేలు గోరు జీవయాత్రలో!మెలకు వెంచి సాగుమా!
స లలి తుండ వో యనగన్!చాలు నింక చేయు ధర్మమున్!జలగ గాక
కలి వికార మంటకుమా!కాలశచక్ర తీరు నెంచుమా!కలగ నిల్చి పోకుమా!
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.
13,గర్భగత"-మెలకువ"-వృత్తము.
తులను గాదదెంచగా!తొలగు సర్వ శోభ లిలన్!తూలిపాటు దోషమే సుమా!
మెలకు వెంచి సాగుమా!మెలిక జీవ మెంచకుమా!మేలుగోరు జీవయాత్రలో!
జలగ గాక నొప్పుమా!స లలితుండవో యనగన్!చాలు నింక చేయు
కలగ నిల్చి పోకుమా!కలి వికార మంటకుమా!కాల చక్ర తీరు నెంచుమా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును..
14 ,గర్భగత"-జీవయాత్ర"-వృత్తము.
తొలగు సర్వ శోభ లిలన్!తులను గా దదెంచగా!తూలిపాటు దోషమే సుమా!
మెలిక జీవ మెంచకుమా!మెలకు వెంచి సాగుమా!మేలు గోరు జీవయాత్రలో!
స లలితుం డవో యనంగన్!జలగ గాక నొప్పుమా!చాలు నింక చేయు
కలి వికార మంట కుమా!కలగ నిల్చి పోకుమా!కాల చక్ర తీరు నెంచుమా!
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.