గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జనవరి 2024, బుధవారం

యాదృశైః సంనివిశతే ... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో𝕝𝕝 యాదృశైః సంనివిశతే యాదృశాంశ్చోప సేవతే|

యాదృగిచ్ఛతి భవితుం తాదృగ్భవతి పూరుషః||


తే.గీ.  ఎట్టివారితోడ చరించు నిలను మనుజు

డెట్టివారిని సేవించు నెపుడుఁ బ్రీతి

నెట్టిదర్ధించునో యగునట్టివాఁడె.

పట్టి మంచినే వెలిగినన్ ప్రబలఁ గలఁడు. 


తా𝕝𝕝 "మానవుడు ఎటువంటివారితో సహవాసం చేస్తాడో అటువంటివాడే అవుతాడు. 

ఎటువంటివారిని సేవిస్తాడో అటువంటివాడే అవుతాడు. ఎటువంటివాడు 

కావాలనుకుంటాడో అటువంటివాడే అవుతాడు".

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.