జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ మద్దూరి రామ్మూర్తి శతావధాని.
చింతా రామకృష్ణారావు
చాతుర్య మొప్పార శతకముల్ రచియించి
చక్కని పాండితిన్ జాటినాడు,
జ్ఞాన ప్రకాశియై గర్భ కవిత్వమ్ము
వెలయించి ధన్యుడై వెలిగినాడు
మహితమై యలరెడు మంగళాష్టకముల
బంధమ్ముగా నల్లి వరలినాడు
భవ్యమౌ సంస్కృత కావ్యాల తెలుగున
ననువాదముల జేసి యలరినాడు
తే.గీ. అరయ కవికల్ప భూజ సద్బిరుదమంది
నట్టి చింతా గృహజుని ధన్యాత్ముడైన
రామకృష్ణాఖ్యు సత్కవిన్ రమ్య యశుని
జ్ఞాన మంజూష శ్రీమాత సాకుగాత !
నా స్పందన.
మ. వర మద్దూరి వరాన్వయుల్ శుభగుణుల్ ప్రఖ్యాత రామ్మూర్తి సు
స్థిర కీర్తిన్ నిలుపంగ నన్ను కృతిలో దీపింప పద్యమ్ములో
పరమోదారగుణాఢ్యులై నిలిపిరే, భాగ్యంబు నాదేకదా,
సరిలేనట్టి కవీద్ర మీరు శుభముల్ సంతోషమున్ గాంచుడీ!
ధన్యవాదములతో
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.