గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2023, ఆదివారం

సదమల,తదనిశమ,విర్రవీగు,బిగిచెడు,చెదురు,వినువీధి,నీచతా,గర్భ "-వరదామ"-వృత్తము. "వరదామ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

 సదమల,తదనిశమ,విర్రవీగు,బిగిచెడు,చెదురు,వినువీధి,నీచతా,గర్భ

"-వరదామ"-వృత్తము.

                   "వరదామ"-వృత్తము.

                           రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                    జుత్తాడ.

పగ తగదు జీవ ధాత్రిన్!వగపే గల్గించు తుదిన్!వదలును పురుషార్ధముల్!
సగ మెరిగి మాట లాడన్!జగతిం నీచుండునగున్!సదమల మది పాడగున్!
తగుదు నని విర్రవీగన్!తగునా వాచాలతయున్!తదనిశ మప రాధమౌ!
సెగ లెగయు నాక శానన్!జిగి మాపుం దైవమిలన్!చెదురును వరదామమున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాస నియమము కలదు.పాదమునకు27"అక్షరము
లండును యతులు10,18,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"తగనిపగ"-వృత్తము.

పగ తగదు జీవ ధాత్రిన్!
సగమెరిగి మాటలాడన్!
తగుదు నని విర్రవీగన్!
సెగ లెగయు నాకశానన్!

అభిజ్ఞా  ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2.గర్భగత"-+సగమెరుగు"వృత్తము.

వగపే గల్గించు తుదిన్!
జగతిం నీచుండు నగున్!
తగునా!వాచాలత యున్!
జిగి మాపుం!దైవ మిలన్!

అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"8"అక్షరములుండును.

3.గర్భగత"-సెగలెగయు"వృత్తము.

వదులును పురుషార్ధములున్!
సదమల మది పాడగున్!
తద నిశ మపరాధ మౌ!
చెదురును వర దామమున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు9"అక్షరము లుండును.

4.గర్భగత"-వగపేల"వృత్తము.

పగ తగదు!జీవ ధాత్రిన్!వగపే!గల్గించు తుదిన్!
సగ మెరిగి మాట లాడన్!జగతిని నీఛుండు నగున్!
తగుదు నని విర్రన్ వీగం!తగునా!వాచాలతయున్!
సెగ లెగయు నాకశానన్!జిగి మాపుం దైవమునున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-వాచాలత"వృత్తము.

వగపే గల్గించు తుదిన్!పగ తగదు జీవ ధాత్రిన్!
జగతిం!నీచుండు నగుం!సగ మెరిగి మాటలాడన్!
తగునా!వాచాలత యున్!తగునని విర్ర వీగన్!
జిగి మాపుం దైవమునుం!సెగ లెగయు నాకశానన్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.ప17,క్రఅక్షరములుండును.
యతి"9"వయక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-జిగి మాయు"-వృత్తము.

పగ తగదు జీవ ధాత్రిం!వదులును పురుషార్ధముల్!!
సగ మెరిగి మాటలాడం!సదమల మది పాడగున్!
తగుదు నని విర్ర వీగం!త దనిశ మప రాధమౌ!
సెగ లెగయు నాకశానం!చెదురును వర దామమున్!

అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"వదులు"-వృత్తము.

వదులును పురుషార్ధముల్!పగ తగదు జీవ ధాత్రిన్!
సదమల మది పాడగుం!సగ మెరిగి మాట లాడన్!
త దనిశ మపరాధ మౌ!తగుదు నని విర్ర వీగన్!
చెదురును వర దామముం!సెగ లెగయు నాక శానన్!

అణిమా ఛందమునందలి"-ధృతి ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-సదమల"-వృత్తము.

వగపే గల్గించు తుదిం!వదులును పురుషార్ధముల్!
జగతిం నీచుండు నగుం!సదమల మది పాడగున్!
తగునా!వాచాలత యుం!త దనిశ మపరాధమౌ!
జిగి మాపుం దైవమునుం!చెడును వర దామమున్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందములోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరము నకు చెల్లును.

9,గర్భగత"తదనిశ"వృత్తము.

వదులును పురుషార్ధముల్!వగపే గల్గించు తుదిన్!
సదమల మది పాడగుం!జగతిం!నీచుండు నగున్!
త దనిశ మప రాధమౌ!తగునా!వాచాలత యున్!
చెడును వరదామముం!జిగి మాపుం దైవమునున్!

అణిమా ఛదమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"విర్రవీగు"వృత్తము.

వగపే గల్గించు తుదిం!పగ తగదు జీవ ధాత్రిం!వదులును పురుషార్ధముల్!
జగతిం నీచుండు నగుం!సగ మెరిగి మాటలాడం!సదమల మది పాడగున్!
తగునా!వాచాలతయుం!తగుదు నని విర్ర వీగం!త దనిశ మప రాధమౌ!
జిగి మాపుం!దైవమునుం!సెగ లెగయు నాకశాన!చెదురును వర దామమున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,యక్షరములకు చెల్లును.

11.గర్భగత"-బిగి చెడు"వృత్తము.

పగ తగదు జీవధాత్రిం!వదులును పురుషార్ధముల్!వగపే గల్గించు తుదిన్!
సగ మిరిగి మాటలాడం!సదమల మది పాడగుం!జగతిం నీచుండు నగున్!
తగుదు నని విర్ర వీగం!త దనిశ మప రాధమౌ!తగునా!వాచాలత యున్!
సెగ లెగయునాకశానం!చెదురును వరదామముం!జిగి మాపుందైవమునున్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26,అక్షరములుండును.
యతులు10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-చెదురు"-వృత్తము.

వదులును పురు షార్ధముల్!పగ తగదు జీవ ధాత్రిం!వగపే గల్గించు తుదిన్!
సదమల మది పాడగుం!సగ మెరిగి మాటలాడం!జగతిం నీచుండు నగున్!
తదనిశ మపరాధమౌ!తగుదునని విర్ర వీగం!తగునా!వాచాలత యున్!
చెదురును వరదామముం!సెగ లెగయు నాకశాన!జిగి మాపుందైవమునున్!

అనిరుద్ఛందము నందలిఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు10,19,అక్షరములకు చెల్లును.

13"గర్భగత"విను వీధి"-వృత్తము.

వగపే గల్గించు తుదిం!వదులును పురుషార్ధముల్!పగ తగదు జీవ ధాత్రిన్!
జగతిం నీచుండు నగుం!సదమల మది పాడగుం!సగ మెరిగి మాటలాడన్!
తగునా!వాచాలతయుం!తదనిశ మపరాధమౌ!తగుదు నని విర్ర వీగన్!
జిగి మాపుం దైవమునుం!చెదురు వరదామముం!సెగ లెగయు నాకశానన్!

అనిరుద్ఛందము నందలిఉత్కృతి"ఛందములోనిది.
ప్రాస నియమముకలదు.పాదమునకు,26"అక్షరములుండును
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-నీచతా"-వృత్తము.

వదులును పురుషార్ధ ముల్!వగపే గల్గించు తుదిం!పగ తగదు జీవధాత్రిన్!
సదమలమది పాడగుం!జగతిం నీచుండు నగుం!సగ మెరిగి మాట లాడన్!
తద నిశ మప రాధమౌ!తగునా!వాచా లతయుం!తగుదు నని విర్ర వీగన్!
చెదురును వర దామముం!జిగి మాపుం దైవమునుం!సెగలెగయు నాకశానన్!

అనిర్ద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు.,10,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.