గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2025, శనివారం

కవి సింహ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము: 7,శ్రీ నూతలపాటి వేంకటరత్నశర్మ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

30, మే 2025, శుక్రవారం

అవధానములో చిత్రబంధకవిత్వము.... చింతా రామకృష్ణారావు. మరియు. డా.జీయం రామశర్మ శతావధాని పద్యం -ఎత్తుగడ పాఠం అవధాన విద్యా వికాస పరిషత్ 4...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

కవి సింహ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము: 6, శ్రీ నూతలపాటి వేంకట రత్న శర్మ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

29, మే 2025, గురువారం

కవి సింహ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము: 5, శ్రీ నూతలపాటి వేంకట రత్నశర్మ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, మే 2025, బుధవారం

కవి సింహ పోకూరి కాశీపతి, శ్రీ సిద్ధయోగి చరిత్రము: 4, శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

27, మే 2025, మంగళవారం

పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర: 3, శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర: 2, శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

కావ్య పఠనము.1. శ్రీ పోకూరి కాశీపతి గారి సిద్ధయోగి చరిత్రము, శ్రీ నూతలపాట...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మత్తః ప్రమత్తోశ్చోన్మత్తః ... మేలిమిబంగారం మన సమ్స్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  మత్తః ప్రమత్తోశ్చోన్మత్తః శ్రాన్తః క్రోధీ బుభుక్షితఃl

లుబ్ధో భీరుః త్వరాయుక్తః కాముకశ్చ న ధర్మవిత్ll

తే.గీ.  మత్తుఁ, డున్మత్త, లుబ్ధ, ప్రమత్త,  భీరు

వులును, క్రోధి, కాముకుఁడునా కలినినున్న

వాఁడును,మరియు నలసినవాఁడు,త్వరను

కలుగు వాఁడు, నిలపైన ధర్మంబు కానలేరు. 

భావము. "మత్తుడు, ప్రమత్తుడు, ఉన్మత్తుడు, అలసిపోయి ఉన్నవాడు, 

కోపంతో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు, లోభి, పిరికివాడు, 

తొందరపాటులో ఉన్నవాడు, కాముకుడు - వీరు ధర్మమును తెలుసుకోలేరు".

జైహింద్. 

26, మే 2025, సోమవారం

బ్రాహ్మణ ప్రభావము.... శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీ చేపూరి శ్రీరాములు అవధాని ౨౮వ అష్టావధానము...దీప్తిశ్రీనగర్లో..ంఇయాపూర్ మిత్రమండలి ఆధ్వర్యవములో...తె. 25 - 5 - 2025.

0 comments

 

జైశ్రీరామ్.

శా.  శ్రీమన్మంగళ సద్వధాన చతురుల్,   శ్రీమంత సత్ పండితుల్,

ధీమంతుల్, వర కావ్యకర్తలు, మహ ద్ధీమూర్తు లీ సత్ సభన్

శ్రీమంతంబగు సద్వధానమున యీ చేపూరి యుప్పొంగగా

నీమంబొప్పగ వచ్చినారు. తమకు నే చేసెదన్ సన్నతుల్.

శా.  శ్రీమన్మంగళ శ్రీనివాసుని దయన్ చేపూరి శ్రీరాం గుణో

ద్ధాముండద్భుత సద్వధాన మున మోదంబొప్ప సత్పూరణల్

ధీమంతుల్ గని మెచ్చ జెప్పుత, శుభాధిక్యంబు చేకూర్చుతన్,

శ్రీమాతన్ మదినిల్పి సాగుడు సుధీ! సిద్ధింప మీ కోరికల్.

జైహింద్.



25, మే 2025, ఆదివారం

పరవాచ్యేషు నిపుణః ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  పరవాచ్యేషు నిపుణః  -  సర్వో భవతి సర్వదా |

ఆత్మవాచ్యం న జానాతి  -  జానన్నపి విముహ్యతి ||

తే.గీ.  పరుల దోషముల్ చూపుచు పలుకుటందు

నిపుణులే యందరున్ భువిన్, నిశ్చయమిది,

తమదు తప్పులనెన్నడున్ దలపరుకద,

తెలిసియున్ దాచుకొందురు తెలియనీక.

భావము.  ఇతరుల తప్పులను చూపడంలో అందరూ ఎప్పుడూ నిపుణులే 

అయివుంటారు. అలాంటివారే తమ తప్పులను గుర్తించరు. గుర్తించినా, 

గుర్తించనట్టు ఉంటారు.

జైహింద్. 

24, మే 2025, శనివారం

న కృత్యా ప్రాణినాం హింసాం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  న కృత్యా ప్రాణినాం హింసాం  -  మాంసముత్పాద్యేతే క్వచిత్‌ | 

నచ ప్రాణి వధ స్స్వర్గః  -  తస్మా న్మాంసం వివర్జయేత్‌ ॥    (మను- 9-48) 

తే.గీ.  ప్రాణి హింసచే పలలంబు ప్రాప్తమగును,

అటులకాకున్నా మాంసంబదెటులదొరుకు?

ప్రాణిహింసచే కలుగదు స్వర్గమరయ,

మాంసభక్షణమానుట మంచిది భువి.

ప్రాణులను హింసించకుండ మాంస మెచ్చటను లభింపదు, ప్రాణులను చంపుట 

స్వర్గ హెతువు కాక నరక హేతు వగుచున్నది. కావున మాంసమును 

విడచి పెట్టివలయును. 

జైహింద్. 

అష్టావధానం /అవధాని శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు/నిర్వహణ/యస్. ఆర్. వ...

0 comments

జై శ్రీరామ్.
జైహింద్.

పైశున్యం సాహసం ద్రోహం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  పైశున్యం సాహసం ద్రోహం   -  ఈర్ష్యాసూయార్థ దూషణమ్! 

వాగ్దండయోశ్చ పౌరుష్యం   -  క్రోధజోఁపి గుణోష్టకః!!

తే.గీ. కొండెమాడుట, సాహసంబొండు, ద్రోహ,

మీర్ష్య, దూషణ, తొందర, నితరులఁగని,

శిక్షవేయుట,  కటువుగ చెలగు పలుకు

టనెడి యెనిమిది కోపాన మనకు కలుగు.

భావము.  చాడీలు చెప్పడం, తొందరపాటుతనం, ఇతరులకు హాని చేయడం, 

ఓర్వలేనితనం, ఇతరులలో ఉన్న మంచి గుణాలను దోషాలుగా ప్రచారం చేయడం, 

కఠినంగా మాట్లాడడం, నిష్కారణంగా శిక్షించడం, పరుషంగా మాట్లాడడం - 

ఈ ఎనిమిదీ కోపం నుండి పుట్టిన దుర్గుణాలు.

జైహింద్.

23, మే 2025, శుక్రవారం

మూర్ఖాణాం పండితా ద్వేష్యా ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  మూర్ఖాణాం పండితా ద్వేష్యా  -  దరిద్రాణాం మహాధనాః |

అధార్మికాణాం ధర్మిష్ఠా  -  విరూపాణాం సురూపిణః ||  (మహాభారతం)    

తే.గీ.  మూర్ఖులకు పండితులు రిపుల్ భూమిపైన,

బీదలకు రిపుల్ ధనుకులు, పృథ్విపైన

ధర్మ దూరులకును రిపుల్ ధర్మపరులు,

రూపవంతులు రిపులు కురూపులకును.

భావము.  మూర్ఖులకు పండితులు శత్రువులు. బీదవాళ్లకు ధనికులు 

శత్రువులు. పాపులకు ధార్మికులు శత్రువులు. కురూపులకు సురూపులు శత్రువులు.

జైహింద్.

స్వభావం న జహాత్యేవ ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. స్వభావం న జహాత్యేవ - సాధురాపద్గతోऽపి సన్।

కర్పూరః పావకః స్పృష్టః - సౌరభం లభతేతరామ్॥

తే.గీ.  ఆపదలు చుట్టుముట్టిన నోపు నుత్త

ముండు నైజంబు విడఁబోడు పుడమిపైన,

కప్పురము నగ్ని కాల్చినన్ ఘనతరముగ

సౌరభము పంచుచున్నట్లు, సౌమ్యులార!

భావము. ఆపదలు ఎదురైననూ ఉత్తముడు తన నైజమును విడనాడడు. 

కర్పూరం అగ్నిచే దహించబడిననూ పరులకు సువాసన అందించుచున్నదిగదా.

జైహింద్.

22, మే 2025, గురువారం

నిమిషం నిమిషార్థం వా ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  నిమిషం నిమిషార్థం  వా  -   జ్ఞానినో ధ్యాన చింతయా ౹

క్రతు కోటి  సహస్రాణం  -   ధ్యానమేకం విశిష్యతే ౹౹

తే.గీ.  నిమిషమే యగు లేకర్ధనిమిషమౌను

ధ్యానమన్నది చేసిన దాని ఫలము

కోటిక్రతుతుల్యమౌ గాన గొప్పదయిన

ధ్యాన సాధన చేయుము ధర్మరతుఁడ!

భావము.  నిమిషం గానీ, అరనిమిషం గానీ ధ్యానం చేస్తే వెయ్యి కోట్ల 

క్రతువులు చేసిన ఫలం వస్తుంది. కాబట్టి ధ్యానం ఎంతో విశిష్టమైనది.

జైహింద్.

21, మే 2025, బుధవారం

శ్రీ లక్ష్మీ గద్య.SHRI LAKSHMI GADYAM | SHRI LAKSHMI GADYAM | SHRI PRAHALDACHARYA S. BHATT...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

20, మే 2025, మంగళవారం

14 ఏళ్ల చిన్నారి అనన్య శర్మ ఉప్పలధడియం తొలి అష్టావధానం - అవధాన విద్యా వి...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అవధానవిద్యావికాసపరిషత్ శిబిరం సమాపనోత్సవంలో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ డా. శలాక రఘునాథశర్మ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అవధాన విద్యావికాస పరిషత్ 4వ శిక్షణ సప్తాహం..శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరర...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

19, మే 2025, సోమవారం

దిమిలి భాగవతుల సోమన్నా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవంGolden jubilee celebrations of 1974-75 SSC Batch, Dimili village.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించిన కథ... శ్రీ క్రొవ్విడి వేంకటరాజారావు.

0 comments

జై శ్రీరామ్.
జైహింద్.

17, మే 2025, శనివారం

అష్టదళపద్మబంధ సుదర్శనవృత్త గర్భ మత్తకోకిలవృత్తము.

0 comments

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

13 - 5 - 2025న నేను అవధానశిక్షణాశిబిరమున చెప్పిన అవధానంలో 

చిత్రకవిత్వం అనే అంశంలో అష్టదళపద్మబంధ సుదర్శనవృత్తగర్భ మత్తకోకిల 

విని నేను చెప్పిన సూచనననుసరించి తమ్ముఁడు చిరంజీవి 

మరుమాముల దత్తాత్రేయశర్మ అష్టావధాని 

అష్టదళపద్మబంధ సుదర్శనవృత్తగర్భ మత్తకోకిలను వ్రాసి 

డా.జీ.యం. రామశర్మగారినే అబ్బుర  పరచుట మీ అందరికీ తెలిసిన విషయమే. 

ఆ పద్యమును గమనింపుడు.

అష్టదళపద్మబంధ సుదర్శనవృత్తగర్భ మత్తకోకిల

వాసరాపురి వాగ్భవా! నుత వాక్సతీ! శ్రుతి వైభవా!

వాసవాదుల ద్రష్టవా! విభ వాఙ్మయీ! శుభ దాయివా!

వాసితాత్మభువాణివాయన వాసికెక్కిన దానివా!

వాసినొప్పెడి నిత్యవా! హృది వాఙ్మివై యలరారవా!

మత్తకోకిల గర్భస్థ సుదర్శనవృత్తము.

వాసరాపురి వాగ్భవా! వాక్సతీ! శ్రుతి వైభవా!

వాసవాదుల ద్రష్టవా! వాఙ్మయీ! శుభ దాయివా!

వాసితాత్మభువాణివా! వాసికెక్కిన దానివా!

వాసినొప్పెడి నిత్యవా! వాఙ్మివై యలరారవా!



చెప్పినవెన్వెంటనే గ్రహించి ఇంత చక్కగా తాను స్వయంగా వ్రాసిచూపగానే 

నా ఆనందానికి అవధులే లేవంటే మీరు నమ్మకపోరు. ఇది సత్యం కాబట్టి.

అదే విధంగా

చి.వింజమూరి సంకీర్త్య్ కూడా అప్పటికప్పుడు వ్రాసి ప్రదర్శించడం మనమందరం చూచాముకదా.

అష్టదళపద్మబంధ సుదర్శనవృత్తగర్భ మత్తకోకిల

రామనామము బల్క రా! మది రాముడేమన తోడురా,

రామరాజ్యమె మేలు రా! భువి రామరూపము గోరరా,

రాముడేమన దిక్కు రా! మరి రామపాదము పట్టరా,

రామునిన్ భజియించరా! సఖ రాక్షసాంతకు గొల్వరా.

మత్తకోకిల గర్భస్థ సుదర్శనవృత్తము.

రామనామము బల్క రా! రాముడేమన తోడురా,

రామరాజ్యమె మేలు రా! రామరూపము గోరరా,

రాముడేమన దిక్కు రా! రామపాదము పట్టరా,

రామునిన్ భజియించరా! రాక్షసాంతకు గొల్వరా.

అదేవిధంగా

శతావధాని చి. ఉప్పలధడియం భరత్ శర్మ చక్కని పద్యం వ్రాసి నాకు 

పంపించాడు. చలా బాగా వ్రాశాడని నేను చెప్పనక్కరలేదు. మీరే చూడండి.

అష్టదళపద్మబంధ సుదర్శనవృత్తగర్భ మత్తకోకిల

మా! యశేషజగద్గమా! జనమాన్యవైభవమూలమా! 

మాయఁ గాల్చు మహత్వమా! సిరిమాత! విష్ణుకళత్రమా! 

మా యమేయసుఖాంకమా! బుధమాన్యసచ్చరితా! రమా! 

మా యగారము చేరుమా! నిను మాటి మాటికిఁ గొల్వమా.

మత్తకోకిల గర్భస్థ సుదర్శనవృత్తము.

మా! యశేషజగద్గమా! మాన్యవైభవమూలమా! 

మాయఁ గాల్చు మహత్వమా! మాత! విష్ణుకళత్రమా! 

మా యమేయసుఖాంకమా! మాన్యసచ్చరితా! రమా! 

మా యగారము చేరుమా! మాటి మాటికిఁ గొల్వమా.


ఈ విధంగా అవధానంలో బంధ గర్భ చిత్రరచనలు చేస్తుంటే అవధాఅనానికే 

మరింత వన్నె తెస్తాయనుటలో ఏమాత్రం సందేహం లేదు. 


నా మాటను గౌరవించి చెప్పినది గ్రహించి వెంటనే పద్యరచన చేసి నాకు ఆనందం 

కలిగించి ఈ ముమ్మూర్త్రులకు ఆత్రినాథులు ఆయురారోగ్యానందైశ్వర్యాల

నందించుచు మంచి చిత్రకవులుగా కూడా తీర్చిదిద్దాలని మనసారా 

కోరుకొంటున్నాను.

చిత్రకవితాభిమాని

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

త్రయః కాలకృతాః పాశాః ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  త్రయః కాలకృతాః పాశాః   -  శక్యన్తే న నివర్తితమ్।
వివాహో జన్మ మరణం  -  యథా యత్ర చ యేన చ॥
తే.గీ.  పుట్టుకయు పెండ్లి మృత్యువు పుడమిపైన
బ్రహ్మ లిఖియించినట్టులే పడయవలయు,
మార్చగానేరరెవ్వరున్, మాన్యులార!
ఎక్క డేదియో పొందెద మక్కడేను.
భావము.  వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు. ఎప్పుడు 
ఎక్కడ ఎవడిచే అనుభవింపఁబడవలెనో అప్పుడు అక్కడ అతడు 
అనుభవించవలసినదే! ఇవి మార్చడానికి అసాధ్యమైనవి.

జైహింద్.

16, మే 2025, శుక్రవారం

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్... నా పూరణము.

0 comments

 జైశ్రీరామ్.

వంచత్వంబున కూనలన్ దినుటకై పంచాస్యమేతెంచగా

నెంచెన్ దానికి చిక్కకుండునటులన్ హృద్యంపు ధైర్యంబుతో

వంచించెన్ వెనుకంజనుండి కరచెన్ పర్వెత్తె నాసింహమే 

*పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్.*

జైహింద్.

ఆశయా సంఞ్చితం ద్రవ్యం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఆశయా సంఞ్చితం ద్రవ్యం  -  కాలేనైవోపభుజ్యతేl

అన్యే చైతత్ ప్రపద్యన్తే  -  వియోగే తస్య దేహినఃll

(మహాభారతమ్ - అనుశాసనపర్వమ్)

తే.గీ.  ఆశనార్జించు ధనము నీ వనుభవింప

జాల వన్యు లనుభవింత్రు, చనినపిదప,

ధనము గడియించు, వెచ్చించు ధర్మమునకు,

నిహముపరమును దక్కునో మహిత! నిజము. 

భావము. దురాశతో సంపాదించిన ధనం అవసరమైనప్పుడు అనుభవంలోకి 

రాదు. ఆ జీవి గతించినప్పుడు ఆ ధనాన్ని ఇతరులు పొందుతారు.

జైహింద్.

15, మే 2025, గురువారం

అవధాన విద్యా వికాస 4వ అవధాన శిక్షణా సప్తాహం లో చి. గట్టెడి విశ్వంత్ అష్టావధానం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

3వరోజు - అవధాన విద్యావికాస పరిషత్ 4వ శిక్షణ సప్తాహం..శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అవధాన విద్యావికాస పరిషత్ నాల్గవ అవధాన శిక్షణ సప్తాహం|| సమాపనోత్సవం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అశ్వస్య లక్షణం వేగః ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  అశ్వస్య లక్షణం వేగః  -  మదో మాతంగ లక్షణమ్ |

చాతుర్యం లక్షణం నార్యాః  -  ఉద్యోగం పురుష లక్షణమ్ ||

(మహాసుభాషితసంగ్రహః)        

తే.గీ.  వేగమశ్వలక్షణమగు విశ్వమునను,

మదము గజలక్షణంబగు మహిని జూడ,

నేర్పు స్త్రీ లక్షణంబగు నేలపైన,

నిరతముద్యోగమే తగు పురుషులకును.

భావము.  వేగం అనేది గుర్రానికి లక్షణము.  గర్వం అనేది ఏనుగుకు లక్షణము.  

చాతుర్యం అనేది స్త్రీలకు లక్షణము.  ఉద్యోగం అనేది పురుషులకు లక్షణము.

 జైహింద్.

అవధాన విద్యా వికాస పరిషత్ 4వ అవధాన శిక్షణ సప్తాహం...శ్రీ కౌత రామకృష్ణ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

14, మే 2025, బుధవారం

పిన్నవయసులో నే అష్టావధానిగా..14 ఏళ్ళ బాలవిద్వన్మూర్తి చిరంజీవి సంకీర్త్య్

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అద్భుతంగా సాగిన శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యంగారి అష్టావధానంIIఅవధాన విద్యావికాస పరిషత్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అవధాన విద్యా వికాస పరిషత్ శిబిరంలో "నిఘంటు పరిచయం" శతావధాని ఆముదాల మురళి...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పుం రూపం వా స్మరేద్దేవీం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  పుం రూపం వా స్మరేద్దేవీం  -  స్త్రీ రూపం వా విచింతయేత్ |

అథవా నిష్కలం ధ్యాయేత్స  -  చ్చిదానందలక్షణమ్ ||

తే.గీ.  సచ్చిదానంద చైతన్యశక్తి నెన్ని

పురుషునిగ, లేక వనితగా నరయవచ్చు,

నటులఁ గాకున్న నిర్గుణ మనుపమాన

మనుచు మదినెంచ వచ్చునర్చనమున.

భావము.  విశ్వ చైతన్యాన్ని పురుషరూపంలో కానీ, స్త్రీరూపంలో కానీ, లేదా 

ఏ రూపమూ లేని నిర్గుణతత్త్వంగా కానీ ధ్యానించవచ్చు.

జైహింద్.

ఆశా ధృతిం హన్తి సమృద్ధిమన్తకః ... మేలిమిబంగారం మన సంస్కృతి

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఆశా ధృతిం హన్తి సమృద్ధిమన్తకః  -  క్రోధః శ్రియం హన్తి యశః కదర్యతాl

అపాలనం హన్తి పశూంశ్చ రాజన్ఏ  -  కః కృద్ధో బ్రాహ్మణో హన్తి రాష్ట్రమ్ll

తే.గీ.  ఆశ ధైర్యమున్, బంధులన్ యముఁడు జంపు,

వసు యశంబులన్ క్రోధ లోభములు చంపు,  

పాలనములేమి పశువులన్, బ్రాహ్మణుండు

చంపు కినుకచే రాష్ట్రమున్, సత్యమిదియె.

భావము.  "ఆశ ధైర్యాన్ని చంపుతుంది. యముడు పుత్రకళత్ర సమృద్ధిని 

చంపుతాడు. కోపం సంపదను చంపుతుంది. లోభం కీర్తిని చంపుతుంది. 

అపాలనం (రక్షణం లేకుండుట) పశువులను చంపుతుంది. కోపించిన 

బ్రాహ్మణుడు రాష్ట్రమంతటినీ చంపుతాడు.

జైహింద్.

13, మే 2025, మంగళవారం

అవధాన విద్యా వికాస 4వ అవధాన శిక్షణ సప్తాహం 13 ఏళ్ళ బాలవిద్వన్మూర్తి - చిరంజీవి వింజమూరి సంకీర్త్య్.

0 comments

జైశ్రీరామ్.
శా.  శ్రీమన్మంగళ భారతీ జనని రాశీభూత  సంస్కారమున్,
ధీమాధుర్యము, దివ్యదీప్తి, సుగుణోత్తేజంబు సంకీర్త్యునన్
ప్రేమన్ గొల్పుటఁ జేసి బాలుఁడయినన్ విఖ్యాతిగానియ్యెడన్
ధీమంతంబగు సద్వధానమున తా దీపించె లోకంబునన్.

మనుమఁడు చిరంజీవి వింజమూరి సంకీర్త్య్ కు నా శుభాశీస్సులు. జగన్మాత కృపకై నిరంతరసాధనతో ఈ బాలుఁడు వృద్ధిచెందుగాక.
శుభమస్తు.
జైహింద్.

12, మే 2025, సోమవారం

ధర్మరాజుకు నారదుడు చెప్పిన కర్ణుని కథ... శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అవధాన విద్యా వికాస 4వ అవధాన శిక్షణ సప్తాహం 14 ఏళ్ళ బాలవిద్వన్మూర్తి - చి...

0 comments

జైశ్రీరామ్.
శుభమస్తు సంకీర్త్!
జైహింద్

భారతసైనికులారా! విజయోఽస్తు. తే.11 - 5 - 2025.

0 comments

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

భారతసైనికులారా! విజయోఽస్తు.

ఉ.  దుష్కృత పాగ్విమూఢులగు దుష్టులు దేశవినాశకారకుల్

ముష్కరపాళి హిందువులఁ బూజ్యులనెన్నుచు కాల్చి చంపిరా

ముష్కర జాతి మాయగను పూజ్య న.మో. వర దీక్షబూని రా

శుష్కపు జన్ములన్ దునుమి శోభిలఁ జేసెడు మాతృదేశమున్.


శా.  యావద్భారతజాతి యేకబిగితో నా జాతిపై యుమ్మినన్

త్రోవే కానక చచ్చిపోవుదురుగా దుష్టాత్ములాయేటిలో,

భావిన్ ముష్కరులుండనట్టు లిపుడే ప్రఖ్యాత యుద్ధంబునన్

గావించున్ గద శ్రీ న.మో. జగతికే కల్యాణమున్ గూర్చుచున్.


ఉ.  హైందవ తేజసంబున రహించెడి భారత దేశమాతనే

కొందలమందఁ జేయఁగ నకుంఠితరీతిని యెవ్వరిద్ధరన్

ముందునకొచ్చినన్ దునిమి మూర్ఖపు జాతి విహీనసుస్థితిన్

బంధుర రీతిఁ జేయు సురభారత వీరుల కంజలించెదన్.


ఉ.  అమ్మా! భారత దేశమాత! గనుమోయమ్మా! మహావీరులౌ

నెమ్మిన్ శత్రువినాశనైపుణిని క్షోణిన్ బేరు గన్నట్టి నీ

సమ్మాన్యంపు సుతాళియన్ క్షిపణులన్, సాధింతురమ్మా జయం

బిమ్మాన్యుల్ జగదేకవీరులు కనన్ సృష్టిన్ బ్రభామూర్తులే.


ఉ.  మంగళభారతావనిని మంగళమూర్తులు వీర సైన్యమీ

మంగళమూర్తులెప్పుడును మంగళముల్ కనుగాక ధాత్రిపై,

పొంగుత భారతాంబ తన పుత్రులసద్విజయంబు గాంచుచున్

నింగిని దేవతాతతి గణించి జయంబులు పల్కుగావుతన్.

🙏🏼

జయతు హైందవమ్

జయతు భారతమ్.

అమ్మ దయతో🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

శ్రీ నరసింహ ఆవిర్భావ ఘట్టము ఉపన్యాసము నాంపల్లీ హనుమాన్ మందిర్. వాగ్విదాంవరులు శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ. 11 - 05 - 2025.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

10, మే 2025, శనివారం

పఠకాః పాఠకశ్చైవ ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  పఠకాః పాఠకశ్చైవ  -  యే చాన్యే శాస్త్ర చింతకాః |

సర్వే వ్యసనినో మూర్ఖాః  -  యః క్రియావాన్ స పండితః ||  (మహాభారతం)

తే.గీ.  పఠక పాఠకుల్, శాస్త్ర సంభాషకులును

తద్వ్యసనముచే మూర్ఖులు, దాని నొడిసి

పట్టి పాటింపకున్నచో,    భవ్యగతిని

యాచరింపంగ వలయు తా మరసినయవి.

భావము.  చదివేవారు, చదివించేవారు, మరియు శాస్త్ర విషయాలను చర్చించే 

ఇతరులు, వీరందరూ కేవలం గ్రంథాల వ్యసనంలోనే మునిగిపోయి ఉంటే, 

వారు మూర్ఖులే. శాస్త్రోక్త ప్రకారం క్రియాశీలుడైనవాడే నిజమైన పండితుడు.

జైహింద్.

9, మే 2025, శుక్రవారం

తే.11 - 5 - 2025 న శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం శతావధానిచే 377వ అష్టావధానం మియాపూర్ లో

0 comments

 జైశ్రీరామ్

జైహింద్.

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. ఆపూర్యమాణమచలప్రతిష్ఠం  -  సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|

తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే  -  స శాన్తిమాప్నోతి న కామకామీ||

తే.గీ. చేరుచున్నను సతతంబు నీరు జలధి

నిశ్చలంబుగనుండును నిరుపమగతి,

భోగభాగ్యముల్ చేరినన్ పొంగిపోక

కోరికలు లేని ప్రాజ్ఞుని తీరునొప్పి. 

భావము. "సముద్రం నింపబడుతూనే ఉంటుంది.... నిశ్చలంగా ఉంటుంది. 

జలం దానిలో చేరిననూ దానిని కదిల్చలేవు... అదే రీతిగా భోగాలు తనలో 

ప్రవేశించినప్పటికీ నిర్వికారంగా ఉండే స్థితప్రఙ్ఞుడే.... కోరికలకు దూరమై 

సుఖశాంతులను పొందగలడు".

జైహింద్.

8, మే 2025, గురువారం

ఆపరేషన్ సిందూర్... నేలమట్టమైన ఉగ్రవాదుల స్థావరాలు | Operation Sindoor | భారత మాతకు ముష్కర రక్త సిందూర తిలకం.

0 comments

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏿

భారత మాతకు ముష్కర రక్త సిందూర తిలకం.


శా.  శ్రీమన్మంగళ భారతావని శుభశ్రీభావ సంపూజ్యులన్,

క్షేమానందము లందరున్గనుచు భాసించన్ మదిన్ గోరు సత్,

ప్రేమోద్భాసిత దివ్యమూర్తులను, సద్విజ్ఞాన సంస్కారులన్,

బ్రేమన్ గాంచెడి మాత, లోకముననే వేదప్రభాతేజమై.


ఉ.  శాంతియు సౌఖ్యమున్ సుఖము, సజ్జనపాళి కనంగనెంచుచున్,

భ్రాంతి విదూరులై మెలఁగు భవ్యులు, ధర్మమునాల్గుపాదముల్

సాంతము నొప్పునట్టులుగ నాశనుచేసెడివారు, గ్లాని యొ

క్కింతయు కల్గనీయరుగ యీప్సితధర్మపు వర్తనంబునన్.


ఉ.  భారత జాతి శాంతగుణ భాస్కరతేజమటంచు నెంచుచున్,

నేరములెన్ని చేసిన గణింపక, శాంతిగనుందురంచు, సం

స్కారవిహీన ముష్కరులు కాల్చుచునుండిరి భారతీయులన్,

ధీరులు భారతీయులని దేవుని సాక్షిగ తెల్పకుందురా?


శా.  ధర్మగ్లాని సహింపరార్యులిచటన్, దాష్టీకమున్ గాంచి రా

ధర్మాధర్మము లెంచి చూచినను సద్ధర్మంబె చూపట్టగా

మర్మంబింతయు లేక దుష్ట జనులన్ మాయింతురిద్ధాత్రిపై,

కర్మల్ పండిన ముష్కరాధములకున్ గల్పింతురే మృత్యువున్.


ఉ.  హిందువులన్ గణించుచును హేయముగా మగవారినెంచి వా

రందరిప్రాణముల్ గొనిరి యగ్నిశరంబులతోడ ముష్కరుల్,

ముందికనేమియౌనొ? కనలున్ మన పాక్కని యెంచ నేరరే?

సందుల దాగినారమిక చక్కగనుంటిమటంచు నెంచిరే.


శా.  సిందూరంపు కళావిదూరులుగ మా స్త్రీజాతినే జేసినా

రందున్ ముష్కరజాతి యొక్కటియె యంచాదుష్టులన్ గుర్తుగా

సిందూర్ దాడిని మట్టుఁబెట్టిరి జగఛ్ఛ్రేయంబుగానెంచుచున్,

సౌందర్యాద్భుత భారతీ ప్రతిభతో శక్తిన్ గనన్ జేసిరే.


చ.  విజయము భారతీయ సుపవిత్ర దళత్రయ రక్షకాళికిన్,

విజయము హైందవార్ణవ ప్రవిస్తర ధర్మవివర్ధకాళికిన్,

విజయము మోది మేధకును, విస్త్రుత భారతజాతికంతకున్,

విజయము ధర్మబద్ధులకు, విజ్ఞులకెల్లను శ్రీనృసింహుఁడా!


ఉ.  మంగళమౌత భారత సమస్త జనాళికి, భావపాళికిన్,

మంగళమౌత హిందువుల మంగళభావనపాళికెప్పుడున్

మంగళమౌత వేదచయ మంగళభాస్కరతేజమంతకున్

మంగళమౌత శాంభవికి, మంగళమౌమన మాతృభూమికిన్.

🙏🏿

అమ్మ దయతో🙏🏿

చింతా రామకృష్ణారావు

జైహింద్.

కర్మ లోకవిరుద్ధం తు ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  కర్మ లోకవిరుద్ధం తు  -  కుర్వాణం క్షణదాచర |

తీక్ష్ణం సర్వజనో హంతి  -  సర్పం దుష్టమివాగతమ్ ||

(రామాయణం)

తే.గీ.  ఇంటఁ దూరిన సర్పమ్మునెటుల చంపు

దురొ యటులఁ జంపుదురు ప్రజ దురితుఁడైన

ప్రజల కహితముఁ జేసెడివానినిలను,

హితమె ప్రజలకుఁ జేయుమో హితుఁడ! సతము.

భావము.  ప్రజలకు విరుద్ధమైన పనులు చేసే క్రూర స్వభావం ఉన్నవాడిని, 

ఇంటిలో ప్రవేశించిన విషసర్పాన్ని కొట్టి చంపినట్లే, ప్రజలు కొట్టి చంపుతారు.

జైహింద్.

6, మే 2025, మంగళవారం

ప్రవృత్తిర్వా నివృత్తిర్వా ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ప్రవృత్తిర్వా నివృత్తిర్వా  -  నిత్యేన కృతకేన వా |

పుంసాం యేనోపదిశ్యేత  -  తచ్ఛాస్త్రమభిధీయతే || 

తే.గీ.  చేయఁ దగినట్టి వేవియో చేయఁ దగని

వేవియో తెలియునటుల హితము చెప్పు

నట్టి వేదమైనను, నన్యమయినదయిన

నెద్దియైనను శాస్త్రమే, యెరుఁగఁ దగును.

భావము. మానవుఁడు చేయవలసినదేదియో, చేయకూడనిదేదియో, 

వేదముల చేత కాని, మరియే యితర రచనలచేత కాని తెలియఁజేయఁ

బడునదే శాస్త్రము. 

జైహింద్.

సంసార వర్ధకం కర్మ ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సంసార వర్ధకం కర్మ  -  తన్నివృత్యై న కల్పతేl

న హి పఙ్కస్య పఙ్కేన  -  నివృత్తిరవలోక్యతేll

(మహావాక్య దర్పణమ్ శ్రీ ఆదిశంకరాచార్యులు)

తే.గీ.  కర్మ తాపత్రయముఁ బెంచు, మర్మమిదియె,

కర్మలను కాల్పఁ జాలదు కర్మయెపుడు,

బురదబురదను కడగదు, బుద్ధినెఱిఁగి

కర్మబంధ పంకము వీడఁ గలుగు సుఖము.

భావము. కర్మలు సంసార తాపత్రయాన్ని వృద్ధి చేస్తాయే కానీ నివర్తింప

జేయలేవుకదా. బురదని బురద కడగలేదు కదా!

జైహింద్.

అనకాపల్లి జిల్లా దిమిలి గ్రామంలో శ్రీభాగవతులసోమన్నా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఆనాటి 1974-75 SSC విద్యార్థులు నిర్వహించిన స్వర్ణోత్సవం

1 comments

 జైశ్రీరామ్.

అనకాపల్లి జిల్లా దిమిలి గ్రామంలో శ్రీభాగవతులసోమన్నా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో 01-3-1974న నేను ప్రథమ ఆంధ్రపండితునిగా ఉద్యోగమున చేరియుంటిని. ఆనాటి 1974-75 SSC విద్యార్థులు ఇప్పటికి 50 సంవత్సరములు పూర్తయిన సందద్భముగా స్వర్ణోత్సవమును జరిపి ఆనాటి వారి గురువులమైన మమ్ములను ఘనంగా సన్మానించి వారి సంస్కారమును బహిర్గతం చేసి మిగిలిన విద్యాసంవత్సరములలోని విద్యర్థులకు మార్గదర్శకులయ్యారు. అట్టి యీ సంస్కారవంతులైన మా విద్యార్థులను ఆ జగన్మాత నిరంతరము కాపాడుచుండుగాక.👍

జైహింద్.

అవధాన విద్యా వికాస పరిషత్. నాల్గవ అవధాన శిక్షణ సప్తాహం. తే.09 - 5 - 2025 నుండి 15 - 5 - 2025 వరకు. నిర్వహణ. బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ.

0 comments

 జైశ్రీరామ్.


ఈ కార్యక్రమము మంగళప్రదముగా నిర్వహింపఁబడుగాక.

జైహింద్.

5, మే 2025, సోమవారం

చందనం శీతలం లోకే ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  చందనం శీతలం లోకే  -  చందనాదపి చంద్రమాః |

చంద్రచందనయోర్మధ్యే  -  శీతలా సాధు సంగతిః ॥

తే.గీ.  చందనము లోకులకుఁ జూడ చలువకలిమి,

చంద్రుఁడంతకు మించిన చలువరేడు,

చంద్రచందనములకన్ను చలువ కనగ

సజ్జనులమైత్రి ధరణిపై సజ్జనులకు.

భావము.  చందనము శీతలమైనది. చందనము కన్న చంద్రుడు 

శీతలమైనవాడు. చంద్ర, చందనముల కంటే సజ్జనసహవాసము మిక్కిలి 

చల్లదనము నిచ్చును.

జైహింద్.

కాశ్యపగౌతమాఖ్యానం అనబడే బ్రాహ్మణ నాడీజంఘుల కథ ... శ్రీ క్రొవ్విడి వేంకటరాజారావు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

3, మే 2025, శనివారం

గుణవంతః క్లిశ్యంతే ప్రాయేణ ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్

శ్లో.  గుణవంతః క్లిశ్యంతే ప్రాయేణ  -  భవంతి నిర్గుణాస్సుఖినః |

బంధనమాయాంతి శుకాః*ల్  -  యథేష్ట సంచారిణః కాకాః ||

తే.గీ.  బాధలను గుణవంతులే పడుదురిలను,

సుఖములను దుష్టు జనులందుచుందురు రకట!

పంజరంబులన్ జిలుకలు బంధనమగు,

వాయసములాకసముననే వరలుఁ గనుమ.

భావము.  లోకమున గుణవంతులగు జనులే తరచుగా బాధలను 

అనుభవించుచున్నారు. గుణహీనులు సుఖమును అనుభవించుచున్నారు. 

చిలుకలు పంజరమున బంధింపబడుచున్నవి. కాకులు స్వేచ్ఛగా ఆకాశమున

విహరించుచున్నవి.

జైహింద్. 

అగ్రతః చతురో వేదా: ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  అగ్రతః చతురో వేదా: - పృష్ఠతః సశరం ధనుః 

ఇదం బ్రాహ్మమ్ ఇదం - క్షాత్రం  శాపాదపి శరాదపి.  

తే.గీ.  నాల్గు వేదముల్ పఠియించి నలువఁ బోలి,

వెనుక శర ధనువులఁ దాల్చు విప్రవరుఁడు,

ధర్మ రక్షకై దీవిం చధర్మముపయి

నస్త్రమును వేయు, నతనికి నంజలింతు.

భావము.  నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి  పృష్ఠ భాగం లో (వీపు ) అమ్ములపొది ని ధరించి, చేతిలో ధనుస్సు తో  ఉన్న  బ్రాహ్మణుడు అవసరాన్ని బట్టి శాపమూ ఇవ్వగలడు శరమూ ప్రయోగించగలడు. ఆశీర్వాదమూ  ఇవ్వగలడు  అస్త్రమూ సంధించగలడు. ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన హింసను కూడా చేపట్టగలడు. సమయాన్ని బట్టి బ్రాహ్మణ ధర్నాన్ని , క్షాత్ర ధర్మాన్ని పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరించుచున్నాను.

జైహింద్. 

పూజితం హ్యశనం నిత్యం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  పూజితం హ్యశనం నిత్యం,  -  బలమూర్జం చ యచ్ఛతి.                        

అపూజితం తు యద్భుక్తం,   -   ఉభయం నాశయేత్ ధృవమ్.

తే.గీ.  శుచిగ, శుభ్రముగానుండి శోభలీను

పూజితాహారమే శక్తి తేజములిడు,

పాచి క్రుళ్ళినవి తినిన వేచు మనను,

క్షీణమౌ బల తజముల్ కీడు కలుగు.

భావము.  పూజ్యమైన ఆహారము నిత్యమూ సేవించుట వలన మాత్రమే బలము 

తేజస్సు మనకు లభిస్తాయి. అపూజితమైన ఆహారము అనగా అపవిత్రంగా 

పాచిపోయిన క్రుళ్ళిపోయిన ఆహారము సేవించినచో బలము తేజస్సు 

రెండూ నశించును.

జైహింద్. 

2, మే 2025, శుక్రవారం

కుంభః పరిమితమంభః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  కుంభః పరిమితమంభః -  పిబత్యసౌ కుంభసంభవో ఽంబోధిమ్ |

అతిరిచ్యతే సుజన్మా - కశ్చిత్ జ్జనకం నిజేన చరితేన ||

తే.గీ.  పరిమితంబగు జలముచే వరలు కుండ,

కుండనుండి తా పుట్టియు కుంభజుఁ డిల

సంద్రమునను ద్రాగివేసెను, సన్నుతముగ,

తండ్రినే మించు ప్రతిభచే తనయు లరయ.      

భావము.  కుంభము (కుండ) పరిమితమగు నీటిని కల్గియుండును. ఆ కుంభము 

నుండి జన్మించిన అగస్త్యుడు (కుంభసంభవుడు) సముద్రమునే త్రాగినాడు.  

సుజన్మగల వ్యక్తి తన ఉత్తమ ప్రవర్తనచే తండ్రిని మించిన వాడవుతాడు.

జైహింద్. 

1, మే 2025, గురువారం

కర్మణా జాయతే భక్తిః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో. కర్మణా జాయతే భక్తిః  -  భక్త్యా జ్ఞానం ప్రజాయతే।

జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః  -  ఇతి శాస్త్రార్థసఙ్గ్రహః॥

తే.గీ.  భక్తి కర్మచే కలుగును భక్తి వలన

జ్ఞానముత్పన్నమయెడు నా జ్ఞానమునను

ముక్తి సాధ్యమౌ మనలకు, పూజ్యులార!

శాస్త్రమర్మంబు నెఱుఁగుడీ చక్కగాను.

భావము.   కర్మలవల్ల భక్తి కలుగుచున్నది. భక్తి వల్ల జ్ఞానమున్నూ, 

తద్వారా మోక్షము కలుగుతున్నదని శాస్త్ర నిర్ణయము.

జైహింద్. 

న హింస్యాత్ సర్వభూతాని. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  న హింస్యాత్ సర్వభూతాని  -  మైత్రాయణచరో భవేత్ |

నేదం జీవితమాసాధ్య  -  వైరం కుర్వీత కేనచిత్ ||  (మహాభారతం)         

తే.గీ.  ప్రాణులనుహింసచేయుట పాపమగును,

జీవులకు స్నేహమందించు జీవితమున,

మనుజ జన్మంబు మహితము, మాను హింస,

మానవునిగ నీధర్మంబు మానవలదు.

భావము.  ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. ప్రతి జీవితో స్నేహభావంతో 

వ్యవహరించాలి. ఈ మానవ జన్మ లభించిన తర్వాత ఎవరి పట్ల కూడా 

శత్రుత్వాన్ని సాధించకూడదు.

జైహింద్.