గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2024, గురువారం

మోదీ గురుంచి ఇంతవరకూ ఏ పీఠాధిపతి చెప్పని విషయాలు ... || Narendra Modi #s...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఉషశ్రీ రామాయణప్రవనం.

0 comments

 

జైశ్రీరామ్
జైహింద్.

24, జనవరి 2024, బుధవారం

జానకీపతీ పుస్తకావిష్కరణ సభ (జైశ్రీరామ్). భక్తిసాధనం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

23, జనవరి 2024, మంగళవారం

ప్రతిష్టాపన తర్వాత ఈ వీడియో కంటబడటం అదృష్టం | Wrong Ramayan that we lear...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఆదరం,గుండి కోత,కూల్చు కోటలు,తలంపు,నిత్యం,భావము,సత్యనిష్ట, ఊట జలం,సౌఖ్యం,ఊటబావి,ఓటమేది,అనర్ధ,ధాత్రి నిల్పు,నిశ్చిత,గర్భ"-మటే రక్ష"-వృత్తమువల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ..

0 comments

జైశ్రీరామ్. 

ఆదరం,గుండి కోత,కూల్చు కోటలు,తలంపు,నిత్యం,భావము,సత్యనిష్ట, ఊట జలం,సౌఖ్యం,ఊటబావి,ఓటమేది,అనర్ధ,ధాత్రి నిల్పు,నిశ్చిత,గర్భ"-మటే రక్ష"-వృత్తమువల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ..

మాట మాటల కాకరంబౌ!మాటలే మహి నేలు సత్యమ్!మాట కోటమి
                                                                                      లేదురా!
మాట తూటలు గుండె కోతల్!మాట కూల్చును కోట లిట్లే!మాట మించున
                                    ::                                                 దేదిరా?
మాట లేటికి నూట బావుల్!మాట నేస్తము నూహ లేలే!మాట భావ మనో
                                                                                     రమమ్!
మాట మంచియె సౌఖ్య మేర్చున్!మాట ధాత్రిని నిల్పు నిత్యమ్!మాటె
                                                                    నిల్చును లోకమున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"
ఉత్కృతి" ఛందము లోనిది. ప్రాసనియమము కలదు.
పాదమునకు,26,అక్షరము లుండును.యతులు,10,19,అక్షరములకు
చెల్లును.

1,గర్భగత"ఆదరం"-వృత్తము.

మాట మాటల కాకరంబౌ!
మాటతూటలు గుండె కోతల్!
మాట లేటికి నూట బావుల్!
మాట మంచియె సౌఖ్య మేర్చున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-9,అక్షరము లుండును.

2,గర్భగత"-గుండె కోత"వృత్తము.

మాటలే మహి నేలు సత్యమ్!
మాట కూల్చును కోట లిట్లే!
మాట నేస్తము నూహ లేలే!
మాట ధాత్రిని  నిల్పు నిత్యమ్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాథమునకు,9,అక్షరము లుండును.

3,గర్భగత"-కూల్చు కోటలు"-వృత్తము.

మాట కోటమి లేదురా!
మాట మించున దేదిరా?
మాట భావ మనోరమమ్!
మాటె నిల్చును లోకమున్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును

4,గర్భగత"తలంపు"-వృత్తము.

మాట మాటల కాకరంబౌ!మాటలే మహి నేలు సత్యమ్!
మాట తూటలు గుండె కోతల్!మాట కూల్చును కోట లిట్లే!
మాట లేటికి నూట బావుల్!మాట నేస్తము నూహ లేలే!
మాట మంచియె సౌఖ్య మెంచున్!మాట ధాత్రిని నిల్పు నిత్యమ్!

అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10;వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"- .నిత్యం"-వృత్తము.

మాటలే మహి నేలు సత్యమ్!మాట కోటమి లేదురా?
మాట కూల్చును కోటలిట్లే?మాట మించున దేదిరా?
మాట నేస్తమునూహ లేలే!మాట భావ మనోరమమ్!
మాట ధాత్రిని నిల్పు నిత్యమ్!మాటె నిల్చును లోకమున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-భావము"-వృత్తము.

మాట కోటమి లేదురా!మాట మాటలే మహి నేలు సత్యమ్!
మాట మించున దేదిరా?మాట కూల్చును కోట లిట్లే?
మాట భావ మనోరమమ్!మాట నేస్తము నూహ లేలే!
మాట నిల్చును లోకమున్!మాట ధాత్రిని నిల్పు నిత్యమ్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-సత్య నిష్ట"-వృత్తము.

మాటలే మహి నేలు సత్యమ్!మాట మాటల కాకరంబౌ?
మాట కూల్చును కోట లిట్లే?మాట తూటలు గుండె కోతల్!
మాట నేస్తము నూహ లేలే!మాట లేటికి నూట బావుల్!
మాట ధాత్రిని నిల్చు నిత్యమ్!మాట మంచియె సౌఖ్య మేర్చున్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-నూటజలం"-వృత్తము.

మాట మాటల కాకరంబౌ!మాట కోటమి లేదురా!
మాట తూటలు గుండె కోతల్!మాట మించున దేదిరా?
మాట లేటికి నూట బావుల్!మాట భావ మనోరమమ్!
మాట మంచియె సౌఖ్య మేర్చున్!మాటె నిల్చును లోకమున్!

అణిమా ఛందము నందలి అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి10;వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-సౌఖ్యం"-వృత్తము.

మాట కోటమి లేదురా?మాట మూటల కాకరంబౌ!
మాట మించున దేదిరా?మాట తూటలు గుండె కోతల్!
మాట భావ మనోరమమ్!మాట లేటికి నూట బావుల్!
మాటె నిల్చును లోకమున్!మాట మంచియె సౌఖ్య మేర్చున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-ఊట బావి"-వృత్తము

మాటలే మహి నేలు సత్యమ్!మాట కోటమి లేదురా?మాట మాటల
                                                                                కాకరంబౌ!
మాట కూల్చును కోటలిట్లే!మాట మించున దేదిరా?మాట తూటలు
                                                                           గుండె కోతల్!
మాట నేస్తము నూహ లేలే?మాట భావ మనోరమమ్!మాట లేటికి
                                                                        నూట బావుల్!
మాట ధాత్రిని నిల్పు నిత్యమ్!మాటె నిల్చును లోకమున్!మాట మంచియె
                                                                    సౌఖ్య మెంచున్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-ఓటమేది?"-వృత్తము.

మాట కోటమి లేదురా!మాటలే మహి నేలు సత్యమ్!మాట మాటల
                                                                               కాకరంబౌ!
మాట మించున దేదిరా?మాట కూల్చును  కోట లిట్లే!మాట తూటలు
                                                                         గుండె కోతల్!
మాట భావ మనో రమమ్!మాట నేస్తము నూహ లేలే!మాట లేటికి
                                                                      నూట బావుల్!
మాటె నిల్చును లోకమున్!మాట ధాత్రిని నిల్పు నిత్యమ్!మాట మంచియె
                                                                      సౌఖ్య మేర్చున్!

అనిరుద్ఛందమునందలి ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-అనర్ధము"-వృత్తము.

మాటలే మహి నేలు సత్యమ్!మాట మాటల కాకరంబౌ!మాట కోటమి
                                                                                  లేదురా!
మాట కూల్చును కోటలిట్లే!మాట తూటలుగుండె కోతల్!మాట మించున
                                                                                    దేదిరా?
మాట నేస్తము నూహ లేలే!మాట లేటికి? నూట బావుల్!మాట భావ
                                                                           మనోరమమ్!
మాట ధాత్రిని నిల్పు నిత్యమ్!మాట మంచియె  సౌఖ్య మేర్చున్!మాటె
                                                                నిల్చును లోకమున్!!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-ధాత్రి నిల్పు"-వృత్తము.

మాట మాటల కాకరంబౌ!మాట కోటమి లేదురా1మాటలే మహి నేలు
                                                                                   సత్యమ్!
మాటతూటలు గుండె కోతల్!మాట మించున దేదిరా?మాట కూల్చును
                                                                                కోట లిట్లే!
మాట లేటికి నూట బావుల్ !మాట భావ మనోరమమ్!మాట నేస్తం
                                                                            నూహ లేలే!
మాట మంచియె సౌఖ్య మెంచున్!మాటె నిల్చును లోకమున్!మాట
                                                             ధాత్రిని నిల్పు నిత్యమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"నిశ్చిత"-వృత్తము.

మాట కోటమి లేదురా!మాట మాటల కాకరంబౌ!మాటలే మహి నేలు
                                                                                     సత్యమ్!
మాట మించున దేదిరా?మాట తూటలు గుండె కోతల్!మాట కూల్చును
                                                                                  కోట లిట్లే!
మాట భావ మనోరమమ్!మాట లేటికి నూట బావుల్!మాట నేస్తం
                                                                            నూహ లేలే!
మాటె నిల్చును లోకమున్!మాట మంచియె సౌఖ్య మెంచున్!మాట
                                                            ధాత్రిని నిల్పు నిత్యమ్!

జైహింద్.

శ్రీమాన్ రామభద్రాచార్యస్వామివారివల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షం గా వచ్చింది.వీరికి హిందూ జాతి యావత్తు ఎప్పటికీ ఋణపడిఉంటుంది.

0 comments

 

జైశ్రీరామ్.
శ్రీ రామభద్రాచార్యాయ నమః.
రామభద్రాచార్యస్వామి.. ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షం గా వచ్చింది. ఈ స్వామీజీ అంధుడు. అయినా ఋగ్వేదం లోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి ఇలా ఉంటుంది. సనాతనధర్మం అంటే ఇంత శక్తివంతమైనది..  రుగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడేనాడో వ్రాసిన భాష్యం మంత్ర రామాయణం. ఇతని తండ్రి గోవిందసూరి. దీనిలో 157 రుగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుండి సీతాపృధ్వీ ప్రవేశం వరకు ఉంది. దీనిని రామభద్రాచార్యస్వామి అనే అంధ సన్యాసి కల స్పష్టం చేశారు. ఈయన ఒక మఠానికీ అధిపతి.  రామజన్మభూమిని గురించికోర్టులో వాదాలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒక జడ్జి, హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా? చెప్పమని ప్రశ్నించారట.  అప్పుడే స్వాములవారిని తీసుకువచ్చి సాక్ష్యం ఇప్పించారు. ఆ అంధస్వామి అనర్గళంగా రుగ్వేదమంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథని వివరిస్తూంటే జడ్జీలతో సహా కోర్టంతా దిగ్భ్రాంతికి లోనయ్యింది.  అంధుడు పుస్తకం, మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలు, దాని భాష్యం. రామకథ వివరించడం ఆశ్చర్యకరం కదా! దీనివలన రామ జన్మభూమి తీర్పు ఏకగ్రీవంగా వెలువడింది. తరువాత శ్రీరామభద్రాచార్యాస్వామి వారిని అభినందించిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో సంచారం చేసింది.

జైహింద్.

22, జనవరి 2024, సోమవారం

జైశ్రీరామ్ జైశ్రీరామ్...Jai Shri Ram (Telugu) | Tanikella Bharani | Ayodhya Ram Mandir Song

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అయోధ్య రామ యంత్రాన్ని తయారు చేసిన చిదంబర శాస్త్రి గారి మాటల్లో అయోధ్య చరిత్ర.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

గోలుమాలు,బక్కచిక్కె,పౌరనీతి,తారలంటు,చీడల,భగ్నతా,గర్భ-తాలిమి" వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్. 

గోలుమాలు,బక్కచిక్కె,పౌరనీతి,తారలంటు,చీడల,భగ్నతా,గర్భ-తాలిమి"   వృత్తము  రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

కుక్కమూతి పిందె లెల్ల!కోరి నిల్చి కాల చక్రమున్!గోలుమాలు చేసిరో
                                                                                  యనన్!
!చెక్కు బెట్టి శాంతి ధాంతి!చేరి చీడపుర్గు లాయిరే!చీలి ముక్కలాయె
                                                                            భాగ్యమున్!
బక్క చిక్కె సౌరు లెల్ల!పౌర నీతి భగ్న మేర్పడన్! పాలి గాళ్ళ  పంపకం
                                                                                బయెన్!
దక్కు స్వేచ్ఛ దెన్న డంచు!తారలంటె దోష చర్యలున్!తాలిమేది?తల్లికిం
                                                                               భువిన్?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి,యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము
లుండును.యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-చెక్కుబెట్టు"-వృత్తము.

కుక్క మూతి పిందె లెల్ల!
చెక్కు బెట్టి శాంతి దాంతి!
బక్క చిక్కె సౌరు లెల్ల!
దక్కు స్వేచ్ఛ దెన్న డంచు?

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

2,గర్భగత"-సర్వ శాంతి"-వృత్తము.

కోరి నిల్చి కాల చక్రమున్!
చేరి చీడ పుర్గు లాయిరే!
పౌర నీతి భగ్న మేర్పడన్!
తారలంటు దోష చర్యలన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-భ్రమతా"-వృత్తము.

గోలు మాలు చేసిరో !యనన్!
చీలి ముక్క లాయె!భాగ్యమున్!
పాలి గాళ్ళ పంప కంబయెన్!
తాలి మేది?తల్లికిం భువిన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియు కలదు.పాదమునకు"9"అక్షరము లుండును..

4,గర్భగత"-భ్రమతా"వృత్తము.

కుక్క మూతి పిందె లెల్ల!కోరి నిల్చి కాల చక్రమున్!
చెక్కు బెట్టి శాంతి దాంతి!చేరి చీడ పుర్గు లాయిరే!
బక్క చిక్కె సౌరు లెల్ల!పౌర నీతి భగ్న మేర్పడన్!
దక్కు స్వేచ్ఛ దెన్న డంచు?తారలంటు దోష చర్యలన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి.9,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-ఓర్పు లేని"-వృత్తము.

కోరి నిల్చి కాల చక్రమున్!కుక్కమూతి పిందె లెల్ల!
చేరి చీడ పుర్గు లాయిరే!చెక్కు బెట్టి శాంతి దాంతి!
పౌర నీతి భగ్న మేర్పడన్!బక్క చిక్కె సౌరు లెల్ల!
తార లంటు దోష చర్యలన్!దక్కు స్వేచ్ఛ దెన్నడంచు?

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.

6;గర్భగత"-ముక్కలాయె"-వృత్తము.

కుక్క మూతి పిందె   లెల్ల!గోలు మాలు చేసిరో యనన్!
చెక్కు బెట్టె శాంతి దాంతి!చీలి ముక్క లాయె!భాగ్యమున్!
బక్క చిక్కె పౌరు లెల్ల!పాలి గాళ్ళ పంపకం బయెన్!
దక్కు స్వేచ్ఛ దెన్నడంచు?తాలి మేది?తల్లికిం భువిన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-పాలి గాళ్ళు"-వృత్తము.

గోలు మాలు చేసిరో యనన్!కుక్క మూతి పిందె లెల్ల!
చీలి ముక్కలాయె భాగ్యమున్!చెక్కు బెట్టి శాంతి దాంతి!
పాలి గాళ్ళ పంపకం బయెన్!బక్క చిక్కె పౌరు లెల్ల!
తాలిమేది?తల్లికిం భువిన్!దక్కు స్వేచ్ఛ దెన్న డంచు?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వయక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-భగ్న నీతి"-వృత్తము.

కోరి నిల్చి కాల చక్రమున్!గోలు మాలు చేసిరో యనన్?
చేరి చీడ పుర్గు లాయిరే!చీలి ముక్క లాయె భాగ్యమున్!
పౌర నీతి భగ్న మేర్పడన్!పాలి గాళ్ళ పంప కంబయెన్!
తార లంటు దోష చర్యలన్!తాలి మేది?తల్లికిం భువిన్!

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-గోలుమాలు"-వృత్తము.

గోలుమాలు చేసిరో యనన్?కోరి నిల్చి కాల చక్రమున్!
చీలి ముక్కలాయె భాగ్యమున్!చేరి చీడ పుర్గు లాయిరే!
పాలిగాళ్ళ పంప కంబయెన్!పౌర నీతి భగ్న మేర్పడన్!
తాలి మేది తల్లికిం భువిన్!తార లంటు దోష చర్యలన్!

అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనిమము కలదు. పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.

10,గర్భగత"-బక్క చిక్కె"-వృత్తము.

కోరి నిల్చి కాల చక్రమున్!కుక్క మూతి పిందె లెల్ల!గోలుమాలు చేసిరో
                                                                                  యనన్?
చేరి చీడ పుర్గు లాయిరే!చెక్కు బెట్టి శాంతి దాంతి!చీలి ముక్క లాయె
                                                                          భాగ్యమున్!
పౌర నీతి భగ్న మేర్పడన్!బక్క చిక్కె పౌరు లెల్ల!పాలి గాళ్ళ పంప
                                                                         కం బయెన్!
తార లంటు దోష చర్యలన్!దక్కె స్వేచ్ఛ దెన్నడంచు?తాలి మేది?
                                                                     తల్లికిం భువిన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

11.గర్భగత"-పౌరనీతి"-వృత్తము.

కుక్క మూతి పిందె లెల్ల!గోలు మాలు చేసిరో?యనన్!కోరి నిల్చి
                                                                    కాలచక్రమున్!
చెక్కు బెట్టి శాంతి దాంతి!చీలి ముక్కలాయె భాగ్యమున్!చేరి చీడ
                                                                   పుర్గులాయిరే?
బక్క చిక్కి పౌరు లెల్ల!పాలి గాళ్ళ పంప కం బయెన్!పౌర నీతి భగ్న
                                                                       మేర్పడన్!
దక్కె స్వేచ్ఛ దెన్న డంచు!తాలి మేది?తల్లికిం భువిన్!తార లంటు
                                                                 దోష చర్యలన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది..
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-తార లంటు"-వృత్తము.

గోలు మాలు చేసిరో యనన్?కుక్క మూతి పిందె లెల్ల!కోరి నిల్చి
                                                                   కాల చక్రమున్!
చీలి ముక్క లాయె భాగ్యమున్!చెక్కు బెట్టి శాంతి దాంతి!చేరి చీడ
                                                                  పుర్గు లాయిరే?
పాలిగాళ్ళ పంప కంబయెన్!బక్క చిక్కి పౌరు లెల్ల!పౌర నీతి భగ్న
                                                                       మేర్పడన్!
తాలి మేది?తల్లికిం భువిన్!దక్కె స్వేచ్ఛ దెన్నడంచు?తార లంటు
                                                                 దోష చర్యలన్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-చీడల"-వృత్తము.

కోరి నిల్చి కాల చక్రమున్!గోలు మాలు చేసిరో యనన్?కుక్క మూతి
                                                                               పిందె లెల్ల!
చేరి చీడ పుర్గు లాయిరే?చీలి ముక్క లాయె భాగ్యమున్!చెక్కు బెట్టి
                                                                          శాంతి దాంతి!
పౌర నీతి భగ్న మేర్పడన్!పాలి గాళ్ళ పంప కంబయెన్!బక్క చిక్కి
                                                                             పౌరు లెల్ల!
  తార లంటు దోష చర్యలన్!తాలి మేది?తల్లికిం భువిన్!దక్కె స్వేచ్ఛ
                                                                          దెన్నడంచు?

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-భగ్నతా"-వృత్తము.

గోలు మాలు చేసిరో యనన్?కోరి నిల్చి కాల చక్రమున్!కుక్క మూతి
                                                                               పిందె లెల్ల!
చీలి ముక్క లాయె భాగ్యమున్!చేరి చీడ పుర్గు లాయిరే?చెక్కు బెట్టి
                                                                          శాంతి దాంతి!
పాలిగాళ్ళ పంప కం బయెన్!పౌర నీతి భగ్న మేర్పడన్!బక్క చిక్కి
                                                                              పౌరు లెల్ల!
తాలిమేది?తల్లికిం భువిన్!తార లంటు దోష చర్యలన్!దక్కె స్వేచ్ఛ
                                                                         దెన్న  డంచు?

జైహింద్.

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావ విశేషాలు || బ్రహ్మశ్రీ దేవరకొండ శ్రీన...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

జైశ్రీరామ్. శ్రీ బాలరాములయోధ్యలో స్వస్థానాధిష్ఠులగుచున్న సందర్భముగా ఆనంద పారవశ్యముతో వారిముందు చేసుకొనిన నా హృదయావిష్కరణ. పద్య దశకము.

1 comments

జైశ్రీరామ్.

 శ్రీ బాలరాములయోధ్యలో స్వస్థానాధిష్ఠులగుచున్న సందర్భముగా 

ఆనంద పారవశ్యముతో వారిముందు చేసుకొనిన నా హృదయావిష్కరణ.  

పద్య దశకము.


జై శ్రీరామ్.    జై శ్రీరామ్.    జై శ్రీరామ్.


ఉ.  శ్రీ రఘురామ! వందనము చేసెద నీ వర భక్తపాళిదౌ

స్మేర ముఖారవిందములఁ జిందెడి శ్రీరఘురామ సత్ సుధన్

గోరి గ్రహించువారి పదకుట్మల బద్ధ ప్రశస్త ధూళికిన్,

వారలయోధ్య నుండు పరివారము, శ్రీకర బాలరామయా! ౧.


ఉ.  నీ వర నామ దర్శనము నేర్పుగఁ గల్గు విధంబునన్ మహ

ద్భావన చేసి యాలయము వాస్తుప్రకారమయోధ్యలోన నా

దేవగణంబు గాంచునటు తీరుగ నిర్మితి చేసినార లా

దేవగణంబె భూమిపయి, దివ్యుఁడ!  శ్రీకర బాలరామయా!. ౨.


చం.  కలిని యడంచి, శ్రీ కృతయుగంబును ధాత్రిని గొల్పి, నిత్యమున్

మలినము లేని జీవితము మానవపాళికిఁ గూర్చనెంచుచున్

వెలసితివా? పరాత్పరుఁడ!  పేశల దివ్యమనోజ్ఞ రూప! స్వ

స్థలమున సుస్థిరంబుగను, సారస నేత్రుఁడ! బాలరామయా! ౩.


చం.  నెనరున, భక్తిభావమున, నిత్యము నీ మహనీయ నామమున్

ఘనముగ నన్నియున్ శుభముగా జరుగన్ విలిఖించి ముందుగా

పనిపడి యేది వ్రాసినను వ్రాయుట మాకలవాటు నీ కృపన్,

ప్రణతులు నీకు, మా పనులు భాసిలఁ జేయుము, బాలరామయా! ౪.


ఉ.  జానకి తోడు కాగ మనసార ఘనంబగు కార్యముల్ ప్రభూ!

ధీనిధివై యొనర్చితివి, ధీయన సీతయె లోఁ దలంపఁగా,

నేనును జానకీ సతిని, నిన్నును నామదిలోన నిల్పి, య

క్షీణ దయాంబురాశివని చేరుదు నిన్ వర బాలరామయా! ౫.


చం.  నినుఁ గనినంతలోననె మనీషులుగా మనసాధ్యమౌనయా

మనుజులకెన్న, నీమహిమ మానవతన్ గలిగించుచుండుటన్,

ఘనతను గొల్పిభక్తుల ప్రకాశము పెంచెడి దైవమీవెయై

మనుజులఁ గావవచ్చితివి, మాన్య దయామయ! బాలరామయా! ౬.


చం.  కరివరదుండ వీవనుచు గౌరవమొప్పగ విష్ణుమూర్తిగా

నిరుపమ భక్తిఁ గొల్చెదను, నేనె కరిన్, మకరిన్, దలంప, న

న్నరయుచు నేమి చేసెదవొ? యార్తిని బాపుచు నెట్లు కాతువో?

పరమ దయాపరుండ! వరభావనఁ గొల్పుచు, బాలరామయా! ౭.


ఉ.  పాపపు భావనల్, మరియు పాపపు కార్యములన్ మనంబున

శ్రీపతి! నీకె సాధ్యమగు చేరగనీయక మమ్ము నిల్పగన్,

శ్రీ పరమేశ్వరీ సహిత శ్రీనిధి వీ విది చేయఁ జాలవో?

కోపమె లేని నిన్ గొలుతుఁ గోమల దేహుఁడ! బాలరామయా! ౮.


ఉ.  నీవొనరించి సృష్టి, మహనీయులనీ ధర నిల్పి,  నీ ప్రభన్

జీవనశైలి,  నిర్మల ప్రసిద్ధగుణోద్ధతి వ్రాయఁ జేసి, స

ద్భావసమృద్ధిఁ గొల్పునటు వాసిగ చేసిన నీకు నీవె యో

ధీవర! సాటి యౌదువు, మదిన్ నిను నిల్పెద, బాలరామయా! ౯.


ఉ.  మంగళ రూప జానకికి, మాన్యమహోదయ! నీకు నెల్లెడన్,

మంగళమౌత నిన్ గొలుచు మాన్య కవీశ్వర పండితాళికిన్, 

మంగళమౌత యంచిచట మాన్య సుపూజ్యులు పార్వతీశివుల్

మంగళ వాక్సుధాస్రవము మన్ననఁ గొల్పిరి, బాలరామయా! ౧౦.

🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

21, జనవరి 2024, ఆదివారం

మేలుగాని,చాలునిక,భ్రమక,కాలచక్ర,మెలిక,సలలిత,దోషజీవన,తీరెంచు, తులగాని,చాలించు,కలగ నిల్చు,సాగుమా,మెలకువ,జీవయాత్ర,గర్భ"కలి వికార"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్

మేలుగాని,చాలునిక,భ్రమక,కాలచక్ర,మెలిక,సలలిత,దోషజీవన,తీరెంచు, తులగాని,చాలించు,కలగ నిల్చు,సాగుమా,మెలకువ,జీవయాత్ర,గర్భ"కలి వికార"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ

తూలిపాటు దోషమే సుమా!తులను గా దదెంచగా!తొలగు సర్వ శోభలిలన్!
మేలుగోరు జీవ యాత్రలో!మెలకు వెంచి సాగుమా!మెలిక జీవ మెంచకికన్!
చాలు నింక చేయు ధర్మమున్!జలగ గాక నొప్పుమా!సలలి తుండ వో
                                                                                    యనంగన్!
కాల చక్ర తీరు నెంచుమా!కలగ నిల్చి పోకుమా!కలి వికార మంటకుమా!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి ఛందము లోనిది.ప్రాసనియమభు కలదు.
పాదమునకు"26"అక్షరములుండును.యతులు"-10,18,అక్షరములకు
చెల్లును.

1,గర్భగత"-మేలుగాని"-వృత్తము.

తూలిపాటు దోషమే సుమా!
మేలుగోరు జీవ యాత్రలో!
చాలు నింక చేయు ధర్మమున్!
కాల చక్ర తీరు నెంచుమా!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9.అక్షరము లుండును.

2,గర్భగత"-చాలునిక"-వృత్తము.

తులను గా దదెంచగా!
మెలకు వెంచి సాగుమా!
జలగ గాక నొప్పుమా!
కలగ నిల్చి పోకుమా!

అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-భ్రమక"-వృత్తము.

తొలగు సర్వ శోభ లిలన్!
మెలిక జీవ మెంచకుమా!
సలలితుండవో యనగన్!
కలి వికార మంటకుమా!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-కాల చక్ర"-వృత్తము.

తూలి పాటు దోషమే సుమా!తులను గా దదెంచగా!
మేలు గోరు జీవ యాత్రలో!మెలకు వెంచి సాగుమా!
చాలు నింక జేయు ధర్మమున్!జలగ గాక నొప్పుమా!
కాల చక్ర తీరు నెంచుమా!కలగ నిల్చి పోకుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసననియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యి"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-మెలిక"-వృత్తము.

తులను గా దదెంచగా!తూలి పాటు దోషమే సుమా!
మెలకు వెంచి సాగుమా!మేలు గోరు జీవ యాత్రలో!
జలగ గాక నొప్పుమా!చాలు  నింక చేయు ధర్మమున్!
కలగ నిల్చి పోకుమా!కాల చక్ర తీరు నెంచుమా!

అణిమమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-సలలిత"-వృత్తము.

తూలి పాటు దోషమే సుమా!తొలగు సర్వ శోభ లిలన్!
మేలు గోరు జీవ యాత్రలో!మెలిక జీవ మెంచ కుమా!
చాలు నింక చేయు ధర్మమున్!సలలితుండ వో యనగన్!
కాల చక్ర తీరు నెంచుమా!కలి వికార మంటకుమా!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-దోషజీవన"--వృత్తము.

తొలగు సర్వ శోభ లిలన్!తూలిపాటు దోషమమే సుమా!
మెలిక జీవ మెంచ కుమా!మేలు గోరు జీవ యాత్రలో!
సలలితుండవో యన గన్!చాలు నింక చేయు ధర్మమున్!
కలి వికార మంటకుమా!కాల చక్ర తీరు నెంచుమా!

అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాససనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

8,గర్భగత"-తీరెంచు"-వృత్తము.

తులను గా దదెంచగా!తొలగు సర్వ శోభ లిలన్!
మెలకు వెంచి సాగుమా!మెలిక జీవ మెంచకుమా!
జలగ గాక నొప్పుమా!సలలితుండవో యనగన్!
కలగ నిల్చి పోకుమా!కలి  వికార మంటకుమా!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియము కలదు.పాదదమునకు"17,అక్షరము లుండును.
యతి"-9,"వ యక్షరము నకు చెల్లును.

9,గర్భగత"-తులగాని"-వృత్తము.

తొలగు సర్వ శోభ లిలన్!తులను గా దదెంచగా!
మెలిక జీవ మెంచకుమా!మెలకు వెంచి సాగుమా!
సలలితుండవో యనగన్!జలగ గాక నొప్పుమా!
కలి వికార మంటకుమా!కలగ నిల్చి పోకుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10 ,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-చాలించు"-వృత్తము.

తులను గా దదెంచగా!తూలి పాటు దోషమే సుమా!తొలగు సర్వ శోభలిలన్!
మెలకు వెంచి సాగుమా!మేలుగోరు జీవ యాత్రలో!మెలికజీవ మెంచకుమా!
జలగ గాక నొప్పుమా!చాలు నింక జేయు ధర్మ మున్!స లలితుం డవో
                                                                                        యనగన్!
కలగ  నిల్చి పోకుమా!కాల చక్ర తీరు నెంచుమా!కలి వికార మంటకుమా!

అనిరుద్ఖందము నందలి ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్ష రములుండును.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.

11.గర్భగత"-కలగనిల్చు"-వృత్తము.

తూలిపాటు దోషమే సుమా!తొలగు సర్వ  శోభలిలన్!తులను గాదదెంచగా!
మేలు గోరు జీవయాత్రలో!మెలిక జీవ మెంచకుమా!మెలకు వెంచి సాగుమా!
చాలు నింక చేయు ధర్మమున్!స లలితుం డవో యనగన్!జలగ గాక
                                                                                       నొప్పుమా!
కాల చక్ర తీరు నెంచుమా!కలి వికార మంటకుమా!కలగ నిల్చి పోకుమా!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26అక్షరము లుండును..
యతులు 10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-సాగుమా -"-వృత్తము.

తొలగు సర్వ శోభ లిలన్!తూలిపాటు దోషమే సుమా!తులనుగా దదెంచగా!
మెలిక జీవ మెంచకుమా!మేలు గోరు జీవయాత్రలో!మెలకు వెంచి సాగుమా!
స లలి తుండ వో యనగన్!చాలు నింక చేయు ధర్మమున్!జలగ గాక
                                                                                         నొప్పుమా!
కలి వికార మంటకుమా!కాలశచక్ర తీరు నెంచుమా!కలగ నిల్చి పోకుమా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-మెలకువ"-వృత్తము.

తులను గాదదెంచగా!తొలగు సర్వ శోభ లిలన్!తూలిపాటు దోషమే సుమా!
మెలకు వెంచి సాగుమా!మెలిక జీవ మెంచకుమా!మేలుగోరు జీవయాత్రలో!
జలగ గాక  నొప్పుమా!స లలితుండవో యనగన్!చాలు నింక చేయు
                                                                                       ధర్మమున్!
కలగ నిల్చి పోకుమా!కలి వికార మంటకుమా!కాల చక్ర తీరు నెంచుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును..

14 ,గర్భగత"-జీవయాత్ర"-వృత్తము.

తొలగు సర్వ శోభ లిలన్!తులను గా దదెంచగా!తూలిపాటు దోషమే సుమా!
మెలిక జీవ మెంచకుమా!మెలకు వెంచి సాగుమా!మేలు గోరు జీవయాత్రలో!
స లలితుం డవో యనంగన్!జలగ గాక నొప్పుమా!చాలు నింక చేయు
                                                                                         ధర్మమున్!
కలి వికార మంట కుమా!కలగ నిల్చి పోకుమా!కాల చక్ర తీరు నెంచుమా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

అశాశ్వత,సత్యం,జీవనా,కీర్తిగను,తలపోయు,తరియించు,ఖగవాహన,హరి భక్తి,జగము,చరితార్ధ,కీర్తిలు,జగతిని,చరజగ,నరజన్మ,గర్భ"-పటుతర"- వృత్తము,రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్. 

అశాశ్వత,సత్యం,జీవనా,కీర్తిగను,తలపోయు,తరియించు,ఖగవాహన,హరి భక్తి,జగము,చరితార్ధ,కీర్తిలు,జగతిని,చరజగ,నరజన్మ,గర్భ"-పటుతర"- వృత్తము,

                        రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                                                   

జన్మ మశాశ్వతంబు గదే?చరితార్ధుండగు వాడె !జగతిం వరదుండౌ
                                                                                      సుమా!
కను మిది జీవ సత్యమయా!కరము న్కీర్తి గడించు!ఖగ వాహను
                                                                                నాశీశ్శులన్!
తన్మది నెంచు సామ్యము నున్!తరియింపం దలపోయు!తగ నిల్వుము
                                                                         శోభాయతన్!
చిన్మయు మెచ్చు జీవితమున్!స్థిరమేదీ?జగమందు!జిగి గొల్వుమి భక్తిం
                                                                               హరిన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి ఛందములోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు
"26"అక్షరములుండును.యతులు10,19,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-అశాశ్వత"-వృత్తము.

జన్మ మశాశ్వతంబు గదే?
కను మిది జీవ సత్య మయా!
తన్మది నెంచు సామ్యమునున్!
చిన్మయు మెచ్చు జీవితమున్!

అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు9"-అక్షరము లుండును.

2,గర్భగత"-సత్యం"-వృత్తము.

చరితార్ధుండగు వాడె!
కరము న్కీర్తి గడించు!
తరియింపం దలపోయు!
స్థిర మేదీ?జగ మందు!

అభిజ్ఞా ఛందమునందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-జీవనా"-వృత్తము.

జగతిం వరదుండౌ గదే!
ఖగ వాహను నాశీశ్శులన్!
తగ నిల్వుమి శోభాయతన్!
జిగి గొల్వుమి భక్తిం హరిన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-కీర్తి గను"-వృత్తము.

జన్మ మశాశ్వతంబు గదే!చరితార్ధుండగు వాడె!
కన్మిది జీవ సత్య మయా!కరమున్కీర్తి గడించు!
తన్మది నెంచు సామ్యమునున్!తరియింపం దలపోయు!
చిన్మయు మెచ్చు జీవితమున్!స్థిరమేదీ?జగమందు!

అణిమా ఛందమునందలి అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-తలపోయు"-వృత్తము.

చరితార్ధుండగు వాడె!జన్మ మశా శ్వతంబు గదే!
కరమున్కీర్తి గడించు!కన్మిది జీవ సత్యమయా!
తరియింపం దలపోయు!తన్మది నెంచు సామ్యమునున్!
స్థిరమేదీ?జగ మందు!చిన్మయు మెచ్చు జీవితమున్!

అణిమి ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లొనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9"వ యక్షరము నకు చెల్లును.

6,గర్భగత"-తరియించు"-వృత్తము.

జన్మ మశాశ్వతంబు గదే!జగతిం వరదుండౌ గదే!
కన్మిది జీవసత్య మయా!ఖగ వాహను నాశీశ్శులన్!
తన్మది నెంచు సామ్యమునున్!తగ నిల్వుమి శోభాయతన్!
చిన్మయు మెచ్చు జీవితమున్!జిగి గొల్వుమి భక్తిం హరిన్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-ఖగవాహన"-వృత్తము.

జగతిం వరదుండౌ గదే!జన్మ మశాశ్వతంబు గదే!
ఖగ వాహను నాశీశ్శులన్!కన్మిది జీవ సత్యమయా!
తగ నిల్వుమి శోభాయతన్!తన్మది నెంచు సామ్యమునున్!
జిగి గొల్వుమి భక్తిం హరిన్!చిన్మయు మెచ్చు జీవితమున్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-హరి భక్తి"-వృత్తము.

చరితార్ధుండగు వాడె!జగతిం వరదుండౌ గదే!
కరముం కీర్తి గడించు!ఖగవాహను నాశీశ్శులన్!
తరియింపం దలపోయు!తగ నిల్వుమి శోభాయతన్!
స్థిరమేదీ?జగమందు!జిగి గొల్వుమి భక్తిం హరిన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-జగము"-వృత్తము.

జగతిం వరదుండౌ గదే! చరితార్ధుండగు వాడె!
ఖగవాహను నాశీశ్శులన్!కరము కీర్తిం గడించు!
తగ నిల్వుమి శోభాయతన్!తరి యింపం దలపోయు!
జిగి గొల్వుమి భక్తిం హరిన్!స్థిరమేదీ?జగమందు!

అణిమి ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"చరితార్ధ"- వృత్తము.

చరితార్ధుండగు వాడె!జన్మ మశాశ్వతంబు గదే!జగతిన్వరదుండౌ
                ;                                                                   గదే!
కరమున్కీర్తిం గడించు!కన్మిది జీవ సత్య మయా!ఖగ  వాహను
                                                                        నాశీశ్శులన్!
తరియింపం దలపోయు!తన్మది నెంచు సామ్యము నున్!తగ నిల్వుమి
                                                                      శోభాయతన్!
స్థిర మేదీ?జగమందు!చిన్మయు మెచ్చు జీవితమున్!జిగి గొల్వుమి
                                                                      భక్తిం హరిన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-కీర్తిలు"-వృత్తము.

జన్మ మశాశ్వతంబు గదే!జగతిం వరదుండౌ గదే!చరి తార్ధుండగు
                                                                                  వాడె!
కన్మిది జీవ సత్య మయా!ఖగ వాహను నాశీశ్శులన్!కరమున్కీర్తి
                                                                           గడించు!
తన్మది నెంచు సామ్యమునున్!తగ నిల్వుమి శోభాయతం!తరియింపం
                          ;                                           దలపోయు!
చిన్మయు మెచ్చు జీవితమున్!జిగి గొల్వుమి భక్తిం హరిం!స్థిర మేదీ?
                     :    ;:                                        జగమందు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదము నకు26,అక్షరము లుండును.
యతలు"-10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-జగతిని"-వృత్తము.

జగతిం వరదుండౌ గదే!జన్మ మశాశ్వతంబు గదే!చరితార్ధుండగు
                  : :                                                          వాడె!
ఖగ వాహను నాశీశ్శులం!కన్మిది జీవ సత్యమయా!కరమున్కీర్తి
                                                                         గడించు!
తగ నిల్వుమి శోభాయతన్!తన్మది నెంచుసౌమ్యమునున్! తరియింపం
                                                                     దలపోయు!
జిగి గొల్వుమి భక్తిం హరిన్!చిన్మయు మెచ్చు జీవితమున్!స్థిరమేదీ?
              :                                                    జగమందు!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

13 ,గర్భగత"-చరజగ"వృత్తము.

చరితార్ధుండగు వాడె!జగతిం వరదుండౌ గదే!జన్మ మశాశ్వతంబు
                                                                                     గదే!
కరమున్కీర్తి గడించు!ఖగ వాహను  నాశీశ్శులన్!కన్మిది జీవ సత్య
                                                                              మయా!
తరియింపం  దలపోయు!తగ నిల్వుమి శుభాయతన్!తన్మది నెంచు  
            ::                                                   సౌమ్యమునున్!
స్థిరమేదీ?జగమందు!జిగి గొల్వుమి భక్తిం హరిన్!చిన్మయు మెచ్చు
                                                                    జీవితమున్!

అనిరుద్ఛందము నందలి-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-నరజన్మ"-వృత్తము.

జగతిన్వరదుండౌ గదే!చరితార్ధుండగు వాడె!జన్మ మశాశ్వతంబు
                                                                                   గదే!
ఖగ వాహను నాశీశ్శులన్!కరమున్కీర్తి గడించు!కన్మది జీవ సత్య
                                                                               మయా!
తగ నిల్వుమి శభాయతన్!తరియింపం దలపోయు!తన్మది నెంచు
                                                                సౌమ్యము నున్!
గొల్వుమి భక్తిం హరిన్!స్థిర మేదీ?జగమందు!చిన్మయు మెచ్చు
                                                                    జీవితమున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు ,10,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

తరులు,గిరులు,విరులు,కరటుతన,నిర్విచార,మోసచింత,బిగియు,గగుర్పాటు,తగుత,దోషాత్మ,దోషభూష,ఆత్మదోష,దోషకర్మ,అధర్మ,గర్భ"-రక్త సిక్తతా"-వృత్తము. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్. 

తరులు,గిరులు,విరులు,కరటుతన,నిర్విచార,మోసచింత,బిగియు,గగుర్పాటు,తగుత,దోషాత్మ,దోషభూష,ఆత్మదోష,దోషకర్మ,అధర్మ,గర్భ"-రక్త సిక్తతా"-వృత్తము.  వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.   జుత్తాడ.

తరులు గిరులు విరులే!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తగుత రాము నేలికన్!

కరటు జనుల కలిలోన్!కర్మ దోష భూష లాత్మలై!గగురు పాటు నేడయెన్!
తర తమములు గనకన్!ధర్మ మేడ కేగెనో?యనన్!తగిలి మోస చింతనన్!
వెర పెడమయె జగతిన్!పేర్మి హాని క్రీడ నేడయెన్!బిగిసె రక్త సిక్త మై!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్రరము
లుండును.యతులు"10,19,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-తరులు"-వృత్తము.

తరులు గిరులు విరులే!
కరటు జనుల కలిలోన్!
తర తమములు గనకన్!
వెర పెడమయె జగతిన్!

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-గిరులు"-వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!
కర్మ దోష భూష లాత్మలై!
ధర్మ మేడ కేగెనో?యనన్!
పేర్మి హాని క్రీడ నే డయెన్!

అభిజ్ఞా ఛందము నందలి బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"విరులు"-వృత్తము.

తగుత రాము నేలికన్!
గగురు పాటు నే డయెన్!
తగిలి మోస చింతనన్!
బిగిసె రక్త సిక్తమై!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము నందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "8"అక్షరములుండును.

4,గర్భగత"-కరటుతన"-వృత్తము.

గిరులు తరులు విరులే!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!
కరటు జనుల కలిలోన్!కర్మ దోష భూష లాత్మలై!
తర తమములు గనకన్!ధర్మ మేడ కేగెనో?యనన్!
వెర పెడమయె జగతిన్!పేర్మి హాని క్రీడ నే డయెన్!

అణిమా,ఛందమునందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-నిర్విచార"-వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!గిరులు తరులు విరులే!
కర్మ దోష భూష లాత్మలై!కరటు జనుల కలిలోన్!
ధర్మ మేడ కేగెనో?యనన్!తర తమములు గనకన్!
పేర్మి హాని క్రీడ నేడయెన్!వెర పెడ మయె జగతిన్!

అణిమా ఛందమునందలి"ధృతి"-ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-మోసచింత"-వృత్తము.

తరులు గిరులు విరులే!తగుత రాము నేలికన్!
కరటు జనుల కలిలోన్!గగురు పాటు నేడయెన్!
తర తమములు గనకన్!తగిలి మోస చింతనన్!
వెర పెడమయె జగతిన్!బిగిసె రక్త సిక్తమై!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛదము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

7,గర్భగత"-బిగియు"-వృత్తము.

తగుత రాము నేలికన్!తరులు గిరులు విరులే!
గగురు పాటు నేడయెన్!కరటు జనుల కలిలోన్!
తగిలి మోస చింతనన్!తర తమములు గనకన్!
బిగిసె రక్త సిక్తమై!వెర పెడమయె జగతిన్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-గగుర్పాటు"-వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తగుత రాము నేలికన్!
కర్మ దోష భూష లాత్మలై!గగురు పాటు నేడయెన్!
ధర్మ మేడ కేగెనో?యనన్!తగిలి మోస చింత నన్!
పేర్మి హాని క్రీడ నే డయెన్!బిగిసె రక్త సిక్తమై!

అణిమాఛందము నందలి అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

9,గర్భగత"-తగుత"-వృత్తము.

తగుత రాము నేలికన్!ధర్మ సాక్ష్య మారె మాతకున్!
గగురు పాటు నే డయెన్!కర్మ రోష భూష లాత్మలై!
తగిలి మోస చింత నన్!ధర్మ మేడ కేగెనో?యనన్!
బిగిసె రక్త సిక్తమై!పేర్మి హాని క్రీడ నే డయెన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-దోషాత్మ"వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తరులు గిరులు విరులే!తగుత రాము నేలికన్!
కర్మ దోష భూష లాత్మలై!కరటు జనుల కలిలోన్! గగురు పాటు నేడయెన్!
ధర్మ మేడ కేగెనో?యనన్!తర తమములు గనకన్!తగిలి మోస చింతనన్!
పేర్మి హాని క్రీడ నే డయెన్!వెర పెడమయె!జగతిన్!బిగిసె రక్త సిక్తమై!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26 "అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-దోష భూష"-వృత్తము.

తరులు గిరులు విరులే!తగుత రాము నేలికన్!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!
కరటు జనుల కలిలోన్!గగురుఫాటు నే డయెన్!కర్మ దోష భూష లాత్మలై!
తర తమములు గనకన్!తగిలి మోస చింతనన్!ధర్మ మేడ కేగెనో?యనన్!
వెర పెడమయె జగతిన్!బిగిసె రక్త సిక్తమై!పేర్మి హాని క్రీడ నేడయెన్!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-ఆత్మదోష"-వృత్తము.

తగుత రాము నేలికన్!తరులు గిరులు విరులే!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!
గగురు పాటు నే డయెన్!కరటు జనుల కలి లోన్!కర్మ దోష భూష లాత్మలై!
తగిలి మోస చింతనన్!తర తమములు గనకన్!ధర్మ మేడకేగెనో?యనన్!
బిగిసె రక్త సిక్త మై!వెర పెడమయె జగతిన్!పేర్మి హాని క్రీడ నే డయెన్!

అనిరుద్ఛందమునందలి,ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-దోషకర్మ"వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తగుత రాము నేలికన్!తరులు గిరులు విరులే!
కర్మ దోష భూష లాత్మలై!గగురు పాటు నేడయెన్!కరటు జనుల కలిలోన్!
ధర్మ మేడ కేగెనో?యనన్!తగిలి మోస చింతనన్!తర తమములు గనకన్!
పేర్మి హాని క్రీడ నేడయెన్!బిగిసె రక్త సిక్తమై! వెర పెడమయె జగతిన్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-"అధర్మ"వృత్తము.

తగుత రాము నేలికన్!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తరులు గిరులు విరులే!
గగురు పాటు నే డయెన్!కర్మ దోష భూష లాత్మలై!కరటు జనుల కలి లోన్!
తగిలి మోస చింతనన్!ధర్మ మేడ కేగెనో?యవవ్!తర తమములు గనకన్!
బిగిసె రక్త సిక్తమై!పేర్మి హాని క్రీడ నే డయెన్!వెర పెడమయె జగతిన్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
పూరాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు.9,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.