జైశ్రీరామ్.
|| 6-9 ||
శ్లో. సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ||
తే.గీ. సాధువుల, సుహృ న్మిత్రులన్ శత్రువులను,
బంధువులను విరోధులన్, వసుధపైన
ఘన దురాచారులన్ మదిన్ గాంచునెవడు
నొక్కటిగ ఘనుడతడె సర్వోత్తముండు.
భావము.
శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు,
విరోధి, బంధువు, సాధువు, దురాచారి—వీళ్ళందరిపట్ల సమబుద్ధి
కలిగినవాడే సర్వోత్తముడు.
|| 6-10 ||
శ్లో. యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ||
తే.గీ. యోగి యేకాంత వాసియై యింద్రియముల
ను, మదిని వశపరచుకొని, కుమతి వీడి
ఏమియు గొనక,చిత్తంబు నెటులనైన
నాత్మపై నిల్పవలెనూ నిరంతరంబు.
భావము.
యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా ఉండి, ఆశలను వదలి,
ఇంద్రియాలనూ మనస్సునూ వశపరచుకుని, ఏమీ పరిగ్రహించకుండా
చిత్తాన్ని ఆత్మమీదే నిరంతరం నిలపాలి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.