జైశ్రీరామ్.
|| 6-45 ||
శ్లో. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః|
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్.
తే.గీ. యోగి సద్దీక్షతో డ చేయు జతనమున,
పాపముల నుండి విడివడి, పరమగతిని
శుద్ధుడై సదభ్యాసపు శుద్ధ ఫలము
చేత పొందు నోయర్జునా! ఖ్యాతిగాను.
భావము.
యోగి దీక్షతో చేసే ప్రయత్నం వలన పాపాలన్నింటి నుండి విడివడి
శుద్ధుడై, అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమగతిని
(మోక్షం)చేరుకుంటాడు.
|| 6-46 ||
శ్లో. తపస్విభ్యోऽధికో యోగీ జ్ఞానిభ్యోऽపి మతోऽధికః|
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున.
తే.గీ. అర్జునా! తాపసుల కంటె నధికుడరయ,
జ్ఞానులకు మించు నధికుడు, కర్ములకును
మించు నధికుండు యోగియే, మించుచీవు
యోగి కావలె పడయ సద్యోగమిలను.
భావము.
అర్జనా! తపస్సు చేసేవారికంటే, జ్ఞానులకంటే, జ్ఞానులకంటే, కర్మ
చేసే వారికంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వూ
(ఆత్మ సంయమ)యోగివి అగుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.