గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2022, గురువారం

ఏతన్మే సంశయం కృష్ణ .|| 6-39 ||..//.. పార్థ నైవేహ నాముత్ర ..|| 6-40 ||.....కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 6-39 ||

శ్లో.  ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః|

త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే.

తే.గీ. పూర్తిగా నాదు సందేహమును దొలంగ

చేయ దగువాడ వీవేను, చేయ లేరు

తొలగగా నాదు సందేహ మిలను పరులు,

నీకు మ్రొక్కెద దెలుపుమా నీరజాక్ష!

భావము.

కృష్ణా! నా ఈ సందేహాన్ని సమూలంగా ఛేదించ తగిన వాడివి నీవే. 

నా అనుమానాన్ని తీర్చగలిగిన వాళ్ళు లోకంలో నీకంటే ఎవరూ లేరు.

శ్రీభగవానువాచ

భావము.

శ్రీకృష్ణభగవానుడిట్లు పలికెను.

|| 6-40 ||

శ్లో.  పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే|

న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి.

తే.గీ.  అర్జునా! యోగమునభ్రష్టుడయినవాని 

కిహపరంబుల నాశన మెన్న లేదు.

మంచి వానికి దుర్గతి మహిని రాదు,

భయము పొందగ పనిలేదు నయనిధాన!

భావము.

అర్జునా యోగబ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం 

లేదు. నాయనా! మంచి పని చేసేవాడెవరూ దుర్గతిని పొందడు కదా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.