జైశ్రీరామ్.
|| 6-19 ||
యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా|
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః.
తే.గీ. యోగి మనసు గణింపగ నొప్పియుండు
వాత రహితంపు దీపమవారితగతి
కావునన్బోల్తురట్టులలే ఘనులు నిజము
నీవు గ్రహియింపుమర్జునా నిరుపమముగ.
భావము.
ఆత్మ సమ్యమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సునుని, గాలి
లేని చోట ఉంచిన దీపం స్థిరంగా ఉండే స్థితితో పోల్చుతారు.
|| 6-20 ||
శ్లో. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా|
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి.
తే.గీ. యోగి నిగ్రహాత్మెచ్చట నొందు శాంతి,
ఆత్మ దర్శనమును యోగి హాయి నెచట
పొందుచుండునో తెలియుము బంధురముగ,
ననుపమాన శుభాస్పదా! ఘనసుచరిత!
భావము.
యోగాభ్యాసం ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము
పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ
(యోగి) ఆనందిస్తాడో,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.