జైశ్రీరామ్..
|| 6-17 ||
శ్లో. యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు|
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా.
తే.గీ. అవని పయి
యుక్త భుక్తి, విహారునకును
కర్మలన్యుక్తచేష్టప్రకాశునకును
యుక్త స్వప్నావబోధక రక్తునకిల
దుఃఖ హరణమౌ యోగమస్తోక సుగతి.
భావము.
ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వానికీ, కర్మలో తగు
మాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ తగుమాత్రంగా
వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ సమంగా పాటించే
వానికీ యోగం(జన మరణ)దుఃఖాన్ని హరిస్తుంది.
|| 6-18 ||
యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే|
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా.
తే.గీ. కామ్యవస్తువుల్ కోరక, కలుగ మనసు
వశము నందున, నాతనిన్ వసుధపైన
యోగ సిద్ధు డనందు రో యురుగుణాఢ్య!
యోగసిద్ధుడే ధన్యుడయుక్త రహిత.
భావము.
ఏ కామ్య వస్తువు పైనా కోరిక లేక, నిగ్రహింప బడిన మనస్సు ఆత్మలోనే
ఉన్నప్పుడు అతడిని యోగ సిద్ధుడని అంటారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.