గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మే 2022, శుక్రవారం

ప్రాప్య పుణ్యకృతాం .|| 6-41 ||..//.. అథవా యోగినామేవ కులే ..|| 6-42 ||.....కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 6-41 ||

శ్లో.  ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః|

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోऽభిజాయతే.

తే.గీ.   అరయుమోయి, యోగభ్రష్టు డందు పుణ్య

లోకములనందు వసియించి, శ్రీకరముగ

పుణ్యకర్ములయింట తాపుట్టి, యిచట

భోగభాగ్యంబులన్ దేలు పుడమిపైన.  

భావము.

యోగబ్రష్టుడు పుణ్యలోకాలని పొంది అనేక సంవత్సరాలు 

అక్కడ నివసించి. తరవాత శుచివంతులు, శ్రీమంతులు ఐన 

వారి ఇంట్లో జన్మిస్తాడు.

|| 6-42 ||

శ్లో.  అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్|

ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్.

తే.గీ.  అటుల కాని యోగభ్రష్టు డనితరమగు 

జ్ఞాన నంపన్నులిండ్లలో కలిగి జన్మ

నిహపరంబులనందెడు మహిని పార్థ!

కనగ నరుదైన జన్మంబు ఘనుడ! వింటె?

భావము.

లేదా యోగ బ్రష్టుడు జ్ఞానులైన ఇండ్లలో పుడతాడు. లోకంలో 

ఇలాటి జన్మ చాలా అరుదైనది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.