గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మే 2022, శుక్రవారం

ప్రశాన్తమనసం హ్యేనం .|| 6-27 ||..//.. యుఞ్జన్నేవం సదాత్మానం..|| 6-28 ||..కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 6-27 ||

శ్లో.  ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్|

ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్.

తే.గీ.  శమితమగురజో గుణుడు ప్రశాంత చిత్తు

డనుపమగుబ్రహ్మరూపుడై యలరు నట్టి

యోగి కాత్మసంబంధమౌ యుత్తమ సుఖ

మందునో పార్థ! నీవందవలయు.

భావము.

ఈ విధంగా రజోగుణం శమించి, దోషరహితమైన, ప్రశాంతమైన 

మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైన 

ఉత్తమ సుఖం లభిస్తుంది.

|| 6-28 ||

శ్లో.  యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః|

సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే.

తే.గీ.  ఆత్మ నభ్యసించుచు యోగి యనవరతము

కల్మషములకు దూరుడౌ, ఘనతరమగు

బ్రహ్మ సత్స్పర్శ సౌఖ్యము పడయునతడు,

పారమేలేని సౌఖ్యమున్ బడయునతడు.

భావము.

ఇలా నిరంతరం ఆత్మాభాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా 

నశిస్తాయి. బ్రహ్మ స్పర్శ ఉన్న అత్యంత సుఖా న్ని తేలికగా పొందుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.