జైశ్రీరామ్.
|| 6-47 ||
శ్లో. యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా|
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః.
తే.గీ. మనసు నాపైన నిలిపెడి మహిత యోగి
నన్ను సేవించునుత్తముం డెన్న యోగి
పుంగవుండిలఘనులలో పుంగవుండు,
నీవు కావలెనట్టుల నిరుపమముగ.
భావము.
యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా ఎవరు
సేవిస్తారో. అతడు ఉత్తముడని నాఅభిప్రాయము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయః..
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.