గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మే 2022, బుధవారం

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః...|| 5-25 ||..//..కామక్రోధ వియుక్తానాం యతీనాం..|| 5-26 ||..//.. కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 5-25 ||

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః|

ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః.

తే.గీ. కల్మష విదూరమై భేదముల్మనమును

వీడిపోయి నిగ్రహశక్తి పెరిగి మదిని

ప్రాణికోటిహితమునెన్ను వారె రుషులు,

వారె బ్రహ్మనిర్వాణంబు వడయు ఘనులు.

భావము.

కల్మషాలు నశించి, భేదభావం తొలగిపోయి, మనస్సుని నిగ్రహించి, 

అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు.

|| 5-26 ||

శ్లో.   కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్|

అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్.

తే.గీ. విజిత కామాదుడై గొప్ప పేరుగాంచి,

విజిత మానసుడై, యాత్మ విశ్వరూప

మెరుగు నెవ్వ డా యోగికి నిరుపమాన

బ్రహ్మనిర్వాణ సుస్థితి పట్టుబడును. 

భావము.

కామక్రోధాల నుండి విడిపడి, మనస్సును జయించి, ఆత్మ స్వరూపాన్ని 

ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణస్థితి అంతటా ఉంటుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.