గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మే 2022, ఆదివారం

శ్రీ కూర్మ జయంతి శుభాకాంక్షలు.💐

 జైశ్రీరామ్.

ఓం నమో నారాయణాయ.🙏

శ్రీ కూర్మ జయంతి శుభాకాంక్షలు.💐


నేను రచించిన శ్రీయాదాద్రి శ్రీనృసింహశతకమునుండి దశావతారములు

105. ఓం లక్ష్మీనృసింహాయ నమః

దండక -  గర్భ సీసమాలిక.                   


(మత్స్యావతారము)

(3) నిద్రించగా బ్రహ్మ నిత్యంబులౌ వేద - ముల్ పైకి కన్పించ మూర్ఖుఁడైన

యా రాక్షసుండౌ హయగ్రీవుఁడే వాటి - నన్నింటినిన్ బట్టి మిన్నకుండ

చౌర్యంబు చేయంగ సద్వేద సంరక్ష - ణంబీవు గావించ నంబుజాక్ష!

క్రూరాత్మునిం జంప క్షోణిం బ్రభూతంపు - మత్స్యంబు నీవేర మహిత దేవ!

 (కూర్మావతారము)

(4) దైత్యాళియున్ దేవతల్ వ్యాప్తమైయున్న - క్షీరాబ్ధినే చిల్క చేరి యచట

కవ్వంబుగా కొండ, గైకొంచు నా త్రాడు - గా వాసుకిన్గొంచు కవ్వమట్లు

చిల్కంగ నవ్వేళ చిత్రంబుగా నీవు - కూర్మంబువై కాచి, కూర్మి చూపి

శ్రీ కూర్మ రూపాన శ్రీకూర్మమందుండి - రక్షింతువే నీవు ప్రాణ నాథ.

(వరాహావతారము)

(5) భూదేవి బాధించు మూర్ఖున్ హిరణ్యాక్షు - నింజంపి, భూమిన్ సునీతినొప్ప

రక్షించు దీక్షన్ వరాహంబుఁగాఁ బుట్టి - దుష్టాత్మునిన్ జంపి సృష్టిలోన

దీనార్తులం గాంచి ప్రాణంబుగా నిల్చి - భక్తాళినే బ్రోచి, ప్రతిభనొప్పి,

భూమిన్ వరాహంబు పూజ్యంబుఁగాఁ జేసి - వర్ధిల్లి తీవేగ ! వశమునుండు. 

(నరసింహావతారము)

(6) రక్షింప శిక్షింపఁ బ్రహ్లాదునిన్ తండ్రి - నిన్నీనృసింహంబు నేర్పు తోడ

రూపంబుగా తాల్చి పాపాత్మునిం ద్రుంచి - ప్రహ్లాదు రక్షించి, ప్రభను జూప

చిద్రూపమొప్పార సింహాచలంబింక, - యాదాద్రి యందీవు హ్లాదమొదవ

తేజంబుతోనిల్చి, దీపింతువే పెక్కు - చోట్లన్ నృసింహాఖ్య! శోభఁ గూర్ప.

(వామనావతారము)

(7) యజ్ఞాదులం జేయు ప్రజ్ఞాన్వితుండౌ బ - లిం గాంచి పాతాళ 

ప్రాంగణమున

లోకాధిపుం జేయ శ్రీకారముం జుట్టి - శ్రీవామనుండౌచుఁ జేర వచ్చి,

దానంబుగా కోరి ధాత్రిం ద్రిపాదంబు - లీయన్ వరాకాశ హృన్మనోజ్ఞ

భూభాగముల్గొంచు మూడున్ గొనన్ శీర్ష - మున్ ద్రొక్కితీవేగ! ప్రోవ నెంచి

 (పరశురామావతారము)

(8) భూపాలకుల్ సృష్టిఁ బాపాత్ములై మంచి - చెడ్డల్ విడన్ గాంచి, 

యడ్డగించి

నీ గొడ్డలిన్ బట్టి వేగంబుగాఁ జేసి - తే రాజ నాశంబు? దేవ దేవ!

రాముండవై? కాన రావయ్య నేడున్ దు - రాత్ముల్ విజృంభించి  యవని పైన

దౌష్ట్యంబులన్ జేయు. దండించు వారిన్ మ - ముం గావ రావేర 

పుణ్య ఫలమ!

(శ్రీరామావతారము)

(9) కామాతురుండై మృగంబట్లు వర్తించు - చున్ రావణ బ్రహ్మ శోభ చెదర

సీతాపహారంబు సేయంగ వానిన్ వ - ధించంగ సుగ్రీవు పంచ చేరి

స్నేహంబునే చేసి శ్రీలంకనే చేరి - యారావణుం జంపి యచట నున్న

సీతమ్మతోఁ జేరి శ్రీరామ.! రాజ్యంబు - పాలించితీవేర! పరమ పురుష!

 (శ్రీకృష్ణావతారము)

(10) శ్రీమన్మహా గీత చేకొండటంచున్ బ్ర - బోధంబు సేయంగ భూమిపైన

కృష్ణుండుగాఁ బుట్టి, తృష్ణన్ నినున్ జూచు - భక్తుండు పార్థుండు భయముఁ గొల్పు

యుద్ధంబులో భీతినొద్దంచు యుద్ధంబు - మానంగ నచ్చోట మహిమ చేసి

గీతన్ బ్రబోధించి చైతన్యముం గొల్పి - చేయించితీవేర చిద్విభాస!

(బుద్ధావతారము)

(11) భూమీశులున్ మానవుల్ యజ్ఞ యాగాదు - లన్ జేయుచున్ నందు లక్ష్యమొప్ప

జీవాళినే జంప, జీవంబులన్ దీయు - యాగంబులన్ మాన్ప నవనిపైన

సిద్ధార్థుఁడై పుట్టి బుద్ధుండుగామారి, - బౌద్ధంబు బోధించి, ప్రస్ఫుటముగ

హింసా విధిన్ మాన్పి, హృత్సీమలో శాంతి - నే గొల్పితీవేర నిత్య శుభద!

 (కల్క్యవతారము)

(12) దుష్టుల్ విజృంభించి, శిష్టాత్ములన్ బాధ - లన్ ముంచుటం జేసి లక్ష్యమైన

ధర్మంబు క్షీణింప, మర్మాత్ములం జంపి - ధర్మంబు రక్షింపఁ దప్పదంచు

కల్యంతమున్ ఘోర ఖడ్గంబునే దాల్చి - భూభారమే తగ్గ దుష్ట నిహతిఁ

జేయంగ జన్మించు శ్రీమన్మహా కల్కి - దేవా నమస్తేస్తు దీప్త నృహరి! 


105 వ సీస మాలిక గర్భస్థ దండకము.


(మత్స్యావతారము)

(3) నిద్రించగా బ్రహ్మ నిత్యంబులౌ వేదముల్ పైకి కన్పించ 

యా రాక్షసుండౌ హయగ్రీవుఁడే వాటినన్నింటినిన్ బట్టి 

చౌర్యంబు చేయంగ సద్వేద సంరక్షణంబీవు కావించ 

క్రూరాత్మునిం జంప క్షోణిం బ్రభూతంపు మత్స్యంబు నీవేర. 

(కూర్మావతారము)

(4) దైత్యాళియున్ దేవతల్ వ్యాప్తమైయున్న క్షీరాబ్ధినే చిల్క 

కవ్వంబుగా కొం డఁ గైకొంచు నా త్రాడుగా వాసుకిన్గొంచు 

చిల్కంగ నవ్వేళ చిత్రంబుగా నీవు కూర్మంబువై కాచి, 

శ్రీ కూర్మ రూపాన శ్రీకూర్మమందుండి రక్షింతువే నీవు . 

(వరాహావతారము)

(5) భూదేవి బాధించు మూర్ఖున్ హిరణ్యాక్షు నింజంపి, భూమిన్ సు 

రక్షించు దీక్షన్ వరాహంబుఁగాఁ బుట్టి దుష్టాత్మునిన్ జంపి 

దీనార్తులం గాంచి ప్రాణంబుగా నిల్చి భక్తాళినే బ్రోచి, 

భూమిన్ వరాహంబు పూజ్యంబుఁగాఁ జేసి వర్ధిల్లి తీవేగ?.

(నారసింహావతారము)

(6) రక్షింప శిక్షింపఁ బ్రహ్లాదునిన్ తండ్రి నిన్నీనృసింహంబు 

రూపంబుగా తాల్చి పాపాత్మునిం ద్రుంచి ప్రహ్లాదు రక్షించి, 

చిద్రూపమొప్పార సింహాచలంబింక, యాదాద్రి యందీవు 

తేజంబుతోనిల్చి, దీపింతువే పెక్కు చో…

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.