జైశ్రీరామ్.
|| 6-23 ||
శ్లో. తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్|
స నిశ్చయేన యోక్తవ్యో యోగోऽనిర్విణ్ణచేతసా.
తే.గీ. యోగమన దుఃఖ దూరులై యుండుటె కద,
నిర్విచారులై దీక్షతో నిండు మదిని
యత్నమును చేసి సాధించు టరయుమయ్య,
యోగమన నిది తెలియుమో రాగదూర!
భావము.
దుఃఖంతో సంబంధం లేని స్థితిని యోగం అని తెలుసుకోవాలి,
ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో, పట్టుదలగా సాధించాలి.
|| 6-24 ||
శ్లో. సఙ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః|
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్య సమన్తతః.
తే.గీ. సకల సంకల్ప జనిత వాంఛలను విడిచి,
మనసు నిగ్రహించగవలె ఘనతరమగు
యింద్రియములను పట్టుతో, నెలమి పార్థ!
నీవు సాధింపవలెనిది నేర్పుమీర.
భావము.
సంకల్పమువల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచి
పెట్టాలి. మనస్సు ద్వారానే ఇంద్రియాలన్నింటిని అన్ని
వైపులనుండి నిగ్రహించాలి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.