జైశ్రీరామ్.
|| 6-5 ||
శ్లో. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ||
తే.గీ. శత్రువును బంధువాత్మయే సరిగ నరర
మానవులకిలన్, కాన యా మానవుండె
తనను తానుద్ధరించుకోతగును, నిము,
పతనమును పొందతగదు శుభంబులరయ.
భావము.
తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా. కనుక మానవుడు తనను
తానే ఉద్ధరించుకొనవలెను. తన ఆత్మను అధోగతి పాలుచేసుకోకూడదు.
|| 6-6 ||
శ్లో. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్.
తే.గీ. ఆత్మజితునకు బంధువా యాత్మ నిజము,
కానివానికి శత్రువే కనగ నాత్మ,
కాన యాత్మ నిల జయించు ఘనులు ఘనులు,
చేథకాకున్న పిది వారి చేటు నిజము.
భావము.
మనస్సును స్వాధీనపరచుకున్నవాడికి తన మనస్సే బంధువు.
మనస్సును జయించనవాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.