జైశ్రీరామ్.
అర్జున ఉవాచ
భావము.
అర్జునుడడిగెను.
|| 6-33 ||
శ్లో. యోऽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన|
ఏతస్యాహం న పశ్యామి చఞ్చలత్వాత్స్థితిం స్థిరామ్.
తే.గీ. నీవు చెప్పిన యీ యోగ మే విధమున
నిలుచు చంచలంబగు చిత్త ఫలకమునను
ననుచు తోచునో కృష్ణుడా! యలయు మిదియు,
నాదు తప్పున్న మన్నించు నలిన నేత్ర!
భావము.
కృష్ణా నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగం మనస్సు యొక్క
చంచల స్వభావం వలన నిలుస్తుందని నాకు అనిపించడం లేదు.
|| 6-34 ||
శ్లో. చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ దృఢమ్|
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్.
తే.గీ. మనసు చంచలమైన, ప్రమాథి, దృఢము,
బలముతో నొప్పుచుండును, పవను నెటుల
యణచ సాధ్యంబు కాదట్లె యణప జాల
మరయ దీనిని, శ్రీకృష్ణ! తెరవు నీవె.
భావము.
కృష్ణా! మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ,
గాలిని అణచడంలాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని నేను
భావిస్తాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.