జైశ్రీరామ్.
|| 6-15 ||
యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః|
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి.
తే.గీ. ఆత్మ నిగ్రహమున యోగి యహరహంబు
ధ్యాన మగ్నుడై నాలోన ననుపమముగ
కలిగినట్టిది, మోక్షమై ఘనతరమగు
శాంతి పొందును, కనుమిది సన్నుతాత్మ!
భావము.
మనస్సును నిగ్రహించి యోగి ఇలా ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో నిలిపి,
నాలో ఉన్నదీ, మోక్షరూపమైనదీ అయిన శాంతిని పొందుతాడు.
|| 6-16 ||
శ్లో. నాత్యశ్నతస్తు యోగోऽస్తి న చైకాన్తమనశ్నతః|
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున.
తే.గీ. అతిగ తినువా డసలు తిననట్టి వాడు,
నతిగ నిద్రించువాడును, క్షితిని యసలు
నిద్రపోనట్టివాడును నిలువ లేడు,
సాత్వికాహారి యోగిగా సాగగలడు.
భావము.
అర్జునా! ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ
నిద్ర పోయేవాడికి, అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు.
ఎల్లప్పుడు సాత్వికాహరమునె భుజించాలి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.