గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, మే 2022, శుక్రవారం

సమం కాయశిరోగ్రీవం.|| 6-13 ||..//.. ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మ..|| 6-14 ||..కర్మసన్యాస యోగము.

జైశ్రీరామ్.

 || 6-13 ||

శ్లో.  సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః|

సమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్.

తే.గీ.  దేహమును, మెడన్, దలను, మదిని దలంచి

తిన్నగా దృష్టి నాసాగ్ర మున్నిలుపుచు,

సాధనము చేయవలెనయ్య! సరస సుగుణ!

యోగమున్ జేయ దగునిట్లు యోగియగుచు.

భావము. 

శరీరాన్ని, మెడని, తలనీ నిటారుగా కదలకుండా ఉంచి, దిక్కులు 

చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ....

|| 6-14 ||

శ్లో.  ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః|

మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః.

తే.గీ.  భయమ వీడి, ప్రశాంతుడై, బ్రహ్మచర్య

దీక్ష నూని, జితమనస్కుడై క్షమమున

నన్నె చిత్తంబునన్ నిల్పి, నన్ను జేర

ధ్యానమును లక్ష్య యుక్తుడై తనియవవయు.

భావము.

ప్రశంతమైన మస్సుతో భయాన్ని విడిచి, బ్రహ్మచర్య వ్రతంలో నిలిచి, 

మస్సుని బాగా నిరోధించి, నాలో చిత్తాన్ని నిలిపి, నన్ను చేరాలనే 

లక్ష్యంతో ధ్యాన యుక్తుడై ఉండాలి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.