జైశ్రీరామ్.
శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః
శ్రీభగవానువాచ|
భావము. శ్రుకృష్ణభగవానుడనుచున్నాడు.
|| 7-1 ||
శ్లో. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు.
తే.గీ. మనసు నాపైన నిలుపుచు మహిత యోగ
మభ్యసించుచు మదిని న న్నాశ్రయించి,
శంకయేలేని విధముగా చక్కగ నను
పూర్తిగా నెట్లెరుగుదొవో యార్త వినుము.
భావము.
నాపై మనస్సును లగ్నం చేసి,యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి,
నిస్సశయంగా, క్షుణ్ణంగా ఎలా తెలుసుకో గలవో దానిని గురించి వినుము.
|| 7-2 ||
శ్లో. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః|
యజ్జ్ఞాత్వా నేహ భూయోన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే.
తే.గీ. అనుభవ జ్ఞానమున గల ఘనతరమగు
శాస్త్ర విజ్ఞానమును నీకు చక్కగాను
తెల్పుదున్ సర్వమున్ నీకు తెలిసిపోవు
తెలియవలసినదుండదు తెలియనిద్ది.
భావము.
అనుభవంతో కూడిన శాస్త్ర పరిజ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను. దీనిని
తెలుసుకున్నాక నీకు వేరే తెలుసుకోవలసినది ఏమీ ఉండదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.