జైశ్రీరామ్.
|| 6-43 ||
శ్లో. తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్|
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునన్దన!
తే.గీ. పూర్వదేహపుయోగంపుబుద్ధినచట
తిరిగి పొందసాధనచేయు నిరుపమగతి,
యోగమది పండి మరలతా యోగియౌను,
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
కురునందనా! అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని
పొంది, ఆస్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు.
|| 6-44 ||
శ్లో. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః|
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే.
తే.గీ. అవనిపైన యోగభ్రష్టు డనుపమగతి
సాధనముచేయు వివశుడై జయ సుయోగ
మార్గంబుపైలాగు మనసతనికి,
ప్రణవమంత్రమున్ బలికినన్ వరలగలడు.
భావము.
పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వలన యోగ భ్రష్టుడు వివశుడై
యోగం వైపు లాగబడతాడు. యోగాన్ని గురించి కేవలం కుతూహలం
చూపినా, ఓంకారాన్ని జపించడం వలన లభించే వైదిక కర్మ ఫలాన్ని
దాటి పోతాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.