గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2022, శనివారం

అనాశ్రితః కర్మఫలం కార్యం.|| 6-1 ||..//.. యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం..|| 6-2 ||..కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

శ్రీభగవానువాచ|

భావము.

భగవానుడనుచున్నాడు.

|| 6-1 ||

శ్లో.  అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|

స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః.

తే.గీ. కర్మ ఫలలాభమునకయి కాంచకుండ

కర్మములు చేయు నెవ్వడు ఘను డతండు,

కర్మసన్యాసి తలపగ కవ్వడి! విను

మగ్నికార్యకర్మంబుల నతడు చేయు.

భావము:

కర్మఫలము పైన ఆధారపడకుండా, చేయ వలసిన కర్మని ఎవరు 

చేయునో అతడే కర్మ సన్యాసీ, కర్మ యోగి కూడా అగ్ని కార్యాన్నీ, కర్మనీ 

వదిలేసినవాడు కాదు.

|| 6-2 ||

శ్లో.  యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ|

న హ్యసన్న్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన.

తే.గీ. కనగ సన్న్యాసమే యోగ మనగ నెరుగు

మెవరు సంకల్పమును వీడ రవని వారు

యోగి కానేరర్జునా! భోగులరయ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము:

అర్జునా దేనిని సన్యాసమని అంటారో అదేయోగమని తెలుసుకో. 

సంకల్పాలను సన్యసించనివాడు ఎవడూ యోగికాలేడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.