గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మే 2022, ఆదివారం

సర్వభూతస్థితం యో మాం .|| 6-31 ||..//.. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం..|| 6-32 ||.....కర్మసన్యాస యోగము.

 జై శ్రీరామ్.

|| 6-31 ||

శ్లో.  సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః|

సర్వథా వర్తమానోऽపి స యోగీ మయి వర్తతే.

తే.గీ. అన్ని ప్రాణులలోనున్న నన్ను,

దైవ మొక్కడే యనుచు నన్ దలచుచుండి

నన్ను సేవించు నాయోగి మన్ననమున

నుండు నాలోన నెటులున్న  నిండుమదిని.

భావము.

అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నింటా పరమాత్మ ఒక్కడే 

అన్న భావం పొంది సేవిస్తారో, ఆ యోగి ఎలా సంచరించినా 

నాలోనే వర్తిస్తూ ఉంటాడు.

|| 6-32 ||

శ్లో.  ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున|

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః.

తే.గీ. దుఃఖ సుఖములందున తనతో నితరుల

బోల్చుకొనుచు సమముగా ప్రపూజ్య యోగి

శ్రేష్టు డందరి కన్నను చింత చేయ,

నెరుగు మరజునా! నీవిది యెరుక గలిగి.

భావము.

అర్జునా! దుఃఖంగానీ, సుఖంగానీ తనతో పోల్చుకుని తనతో సమానంగా 

అందరిలోనూ చూస్తాడో, ఆ యోగి శ్రేష్టుడని నా అభిప్రాయము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.