జైశ్రీరామ్.
|| 6-29 ||
శ్లో. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని|
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః.
తే.గీ. యోగసంయుక్త సమదర్శి యోగి గాంచు
నన్నిటన్ దనన్, దనలోన నన్నిటి గను
నన్నియున్ దానె గన దానె యన్నిటనని
భావయుక్తుడై ప్బలెడి భవ్యుడతడు.
భావము.
యోగంతో కూడిన సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని
ప్రాణులలో తననీ, తనలో అన్ని ప్రాణులనూ చూస్తాడు.
|| 6-30 ||
శ్లో. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి|
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి.
తే.గీ. అన్నిటన్ నన్ను, నా లోన నన్నిటి నిల
కనెడి వానికి మరుగవన్, వినుము పార్థ!
మరుగు కాడతడును నాకు, ధరణిపైన
అతడు నేనేను, నేనన్ననతడె తెలియ.
భావము.
నన్ను అన్నిటిలోనూ, నాలో అన్నిటినీ ఎవరు చూస్తారో అలాంటి
వారికి నేను మరుగు కాను. అతడు నాకూ మరుగు కాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.