గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మే 2022, సోమవారం

బాహ్యస్పర్శే ష్వసక్తాత్మా ..|| 5-21 ||..//.. యే హి సంస్పర్శజా భోగా..|| 5-22 ||..//. . కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 5-21 ||

శ్లో.  బాహ్యస్పర్శే ష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్సుఖమ్|

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే.

తే.గీ. బాహ్యమౌ స్పర్శ లేనట్టి బ్రహ్మవేత్త

సుఖము నాత్మానుభూతితో శోభిల గను,

నిరుపమానంద సామ్రాజ్య నేత యతడు,

ధరణిపై వెల్గు నిరుపమ ధన్యు డతడు.

భావము.

బాహ్య స్పర్శలో తగుల్కోనివాడు, ఆత్మలో ఉండే సుఖాన్ని 

పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన ఆ యోగి 

అనంతమైన ఆనందాన్ని పొందుతాడు.

|| 5-22 ||

శ్లో.  యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే|

ఆద్యన్తవన్తః కౌన్తేయ! న తేషు రమతే బుధః.

తే.గీ.  బాహ్య సంస్పర్శ భోగమ్ము లేహ్యమయిన

దుఃఖ మూలమ్ము లెరుగుమా, తోచలేదొ?

యవధులున్నట్టివాటికై యరుగరెపుడు

సద్వివేకులు, ముక్తిసత్సారవిదులు.

భావము.

కుంతీకుమారా! బాహ్య విషయ స్పర్శలవల్ల జనించేభోగాలన్నీ దుఃఖాలకు 

మూలమే. ఆది, అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో 

వివేకవంతుడు రమించడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.