గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మే 2022, బుధవారం

అయతిః శ్రద్ధయోపేతో .|| 6-37 ||..//.. కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛి ..|| 6-38 ||.....కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్..

అర్జున ఉవాచ

భావము.

అర్జునుడిట్లు పలికెను.

|| 6-37 ||

శ్లో.  అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః|

అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి.

తే.గీ. శ్రద్ధ గలిగియు మనసును చక్కగాను

వశమునం దుంచుకొనలేక పతితుడయిన

యోగభష్టుడౌ యోగి యేమి

యగును? తెలపుమా నాకు ననుపమముగ..

భావము.

శ్రద్ధ ఉన్నా మనస్సుని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేక పోయేవాడు, 

యోగం నుండి మనస్సు జారిపోయి యోగసిద్ధిని పొందనపుడు ఏమౌతాడు.

|| 6-38 ||

శ్లో.  కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి|

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి.

తే.గీ.  నియతి బ్రహ్మ పథమునందు నిలువలేని

మందబుద్ధి రెంటనుభ్రష్టుడందురు కద, 

చెదరినట్టిమేఘునివోలె చెడునొ తాను?

చెప్పుమా కృష్ణ! సన్నుతి చేసెద నిను.

భావము.

ఓ మహానుభావా! బ్రహ్మ పధంలో నిలవలేని మంద బుద్ధి ఇహపరాలు 

రెంటికీ భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించి పోడా?

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.