గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2023, బుధవారం

అర్చన కాలే రూపగతా...... మేలిమి బంగారం మన సంస్కృతి...

జైశ్రీరామ్. 

శ్లో|| అర్చన కాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా

చిన్తనకాలే ప్రాణగతా తత్త్వవిచారే సర్వగతా!

తే.గీ.  అర్చనము వేళ రూపంబు నమ్మ నిలుచు,

స్తోత్రమును జేయ శబ్దమై శోభిలు మదిఁ,

జింతనము సేయ ప్రాణమై చెలఁగు జనని,

తత్వమెన్నుచో సర్వంబు తానె యగును.

తా|| జగన్మాత పూజా సమయంలో ‘రూపం’ లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’ లోనూ, 

చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’ లోనూ, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా 

గోచరిస్తుంది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.