జైశ్రీరామ్.
శ్లో. శీలం శౌర్యమనాలస్యం - పాండిత్యం మిత్ర సంగ్రహః
అచోర హరణీయాని - పంచైతాన్య క్షయో నిధి: ౹
తే.గీ. స్థవసుశీలమనెడి నిధి, సౌర్య నిధియు,
మహితపాండిత్యమను నిధి, మాన్యజనుల
మైత్రినిధియు, ననాలస్య మహిత నిధియు,
చౌర్యమవని యక్షయనిధుల్, సుగుణ గణ్య!
భావము. సత్కీలము,సౌర్యము,కార్య దీక్షత,పాండిత్యం మంచి స్నేహితులను
చేసుకొనేది,మొదలైన ఈ గుణాలు ఎవరూ దొంగతనం చేయడానికి అవ్వదు.
ఈ ఐదు నిధిలాంటివి.అందుకే అవి ఏవిధంగా ఎప్పటికీ పోవు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.