జైశ్రీరామ్.
శ్లో: సత్యహీనా వృథా పూజా, సత్యహీనో వృథా జపః ౹
సత్యహీనం తపోవ్యర్థం, ఊషరే వపనం యథా ౹౹
తే. చవట నేలపై విత్తులు చల్లినటుల
సత్యదూరమౌ పూజయు , జపము, తపము,
వ్యర్థ మరయగ, గని పరమార్థమెన్ని
సత్య జపతపాదులు చేయ సత్ఫలమిడు.
భావము: చవుటి నేలలో విత్తనాలు చల్లితే వ్యర్థమైనట్లుగా సత్యహీనమైన పూజా,
జప తపాదులన్ని నిరుపయోగమే అవుతుంది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.