గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2023, సోమవారం

దత్తపది. ఆంధ్రభారతీవర్ణనము సుధా వారాశి. / శుభోద్భాసంబు/ మదిన్ నేగంటి/ సదా కాపాడు.... దత్తపదికి నా పూరణ.

 జైశ్రీరామ్.

వరణీయంబగు నాంధ్రభారతి సుధా వారాశి. సత్యంబిదే.

పరమార్థాంచిత భావబంధుర శుభోద్భాసంబు చూడన్ భువిన్.


నిరవద్యంబగు పద్యవిద్యయు మదిన్ నేగంటినద్దాని. నో


కరుణ సాంద్ర హరీకృపన్ గని సదా కాపాడుమీ భారతిన్.


జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.