గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఆగస్టు 2023, శుక్రవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము నందలి 16 వ పద్యము నుండి 20వ పద్యము వరకు..... రచన .. చింతా రామకృష్ణారావు... గానము .. శ్రీమతి బీ.సుశీలాదేవి భాగవతారిణి

 జైశ్రీరామ్.

శ్రీ వసంతతిలక సూర్యశతకము

16. దీనావనా! దినపతీ! జగదేకమూర్తీ!  

జ్ఞానాక్షమై హరిని కాంచఁగఁ జేయు వాడా.

ప్రాణంబుగా నిలిచి వర్ధిలఁజేయుదీవే 

నేనున్ నినున్ మదిని నిల్పెద సూర్య దేవా!   


17. భారతావని సుహృజ్జన పూర్ణ  నీవే  

శోభాయమానముగ  చూచుచు. తేజమిమ్మా.

నా భారతాంబ గణనాథుని తల్లి. సృష్టిన్ 

శోభించు భద్రగుణ సుందరి. సూర్య దేవా! 


18. నీ కాంతియే కనఁగ నేర్పున చేయు సృష్టిన్.  

నీకాంతియే నిజమనిత్యము సేయునెల్లన్.

శ్రీ కాంతుఁడైన దరిసింపఁగ లేడు పృథ్విన్  

నీ కాంతి లేక, మహనీయుఁడ! సూర్య దేవా! 


19. ఆరోగ్య భాగ్యదుఁడ! హారతులందుమయ్యా.

నీ రాకకై కనెడి నీరజపాళి మేమే.

తారాడు చీకటులు ధాత్రిని వీడి పోవన్  

మారాడఁబోక కనుమామది  సూర్యదేవా!   

                                                                                    

20. మా కర్మ సాక్షివి. సమస్తము కాంచుదీవే.  

లోకేశ్వరుండ! నరలోకపు దుష్టపాళిన్

నీకన్నులంగనుచు నిత్యము త్రుంచుమయ్యా  

నీ కాకతోడ మహనీయుఁడ సూర్యదేవా!  

రచన .. చింతా రామకృష్ణారావు.

గానము .. శ్రీమతి బీ.సుశీలాదేవి భాగవతారిణి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.